Insect Pest Management in Groundnut: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆరు తడి పండ వేరుశెనగ నూనె గింజల పంటలలో వేరుశెనగకు ప్రత్యేక స్థానం కలదు. ఈ పంట విత్తుకున్న తర్వాత యాజమాన్యం సులభంగా ఉన్నప్పటికీ చీడపీడల మరియు తెగుళ్ళ బెడద కూడా అధికంగానే ఉంటుంది. కావున పంట తొలి దశ నుండి కోత వరకు ఆశించే వివిధ చీడపీడలను సకాలంలో గుర్తించి సరైన సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా ఆశించిన దిగుబడులను సాధించవచ్చు.
వేరుశనగ పంటను ఆశించే పురుగులు :
1. వేరు పురుగు :
వేరుశనగలో వేరుపురుగు తల్లి పురుగులు వర్షాలు పడిన వెంటనే భూమి నుండి బయటకు వచ్చి పొలం చుట్టూ ఉన్న వేప, రేగు చెట్లను ఆశిస్తాయి. ఆడ పురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉండి పరుపు తల కలిగి, బాగా పదిగిన పురుగులు ‘సి’ ఆకారంలో అండి వేరు శెనగ మొక్క వేర్లు ఆశిస్తాయి. వేరు పురుగు ఆశించిన మొక్కలు వాడిపోయి. పండిపోయి చనిపోతాయి మొక్కలను పీకితే సులువుగా ఊడివస్తాయి. మొక్కలు గుంపులు, గుంపులుగా చనిపోతాయి. లోతు దుక్కి చేయడం వల్ల వేరు పురుగు కోశస్థ దశలు బయట పడతాయి. వీటిని పక్షులు తింటాయి. లేదా ఎండ వేడిమికి చనిపోతాయి.
నివారణ :
వేరు పురుగులు నివారణకు ఫోరెట్ 10% గుళికలు ఎకరాకు 6 కిలొలు చొప్ఫున ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
2. ఆకు ముడత పురుగు :
విత్తన 15 రోజుల నుండి ఆకు ముడత పురుగు వేరుశనగను ఆశిస్తుంది. తొలి దశలో ఆకులపై గోధుమరంగు మచ్చలు ఉంటాయి. వీటి లోపల ఆకుపచ్చరంగులో నల్లని తలకలిగిన పిల్లపురుగులు ఉంటాయి. ఇవి రెండు, మూడు ఆకులను కలిపి గూడు చేసుకుని వాటిలో ఉండి పచ్చని పత్రహరితాన్ని తినేయడం వల్ల ఆకులన్నీ పండి, దూరం నుండి కాలినట్లు కనిపిస్తాయి. దీనిని రైతులు అగ్గి తెగులు అని కూడా అంటారు.
నివారణ :
ఈ పురుగు ఉనికి మరియు ఉదృతి గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. నివారణకు క్లోరిపైరిఫాస్ 500 మి.లీ లేదా పసిఫేట్ 300 గ్రా. లను 200 లీటర్లు నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.
3. పొగాకు లద్దె పురుగు :
దీని మొక్క తల్లి పురుగు లేత గోధుమ రంగులో ఆకుపైన లేదా ఆకు అడుగు భాగాన గుంపుగా గుడ్డు పెడుతుంది. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహరితాన్ని గోకి తినేసి జిల్లెడు ఆకులుగా మారుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు మొక్కల అడుగు భాగాన లేదా మట్టిపెళ్ళలు, రాళ్ళకింద దాగి ఉండి రాత్రపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినేస్తాయి.
నివారణ :
పకరాకు 4`5 లింగాకర్షక బుట్టలు అమర్చుకుని మగరెక్కల పురుగులను ఆకర్షించాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. 8`10 చొప్పున పక్షి స్థావరాలను ఒక పకరాకి అమర్చుకోవాలి. పదిగిన లార్వాలను నివారించడానికి నొవాల్యురాన్ 200 మి.లీ లేదా ప్లూబెండామైడ్ 40 మి.లీ ఒక పకరాకు సరిపోయేలా 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విషపు ఎర (వరితపుడు 5 కిలోలు G 500 గ్రా బెల్లంG 500 మి.లీ మోనోక్రోవాఫాస్)ను తయారు చేసుకుని పొలంలో సాయంత్రం వేళ చల్లాలి.
Also Read: Jeevamrutham: జీవామృతం
4. తామర పురుగులు : తామర పురుగులు పంటను ఆశిస్తే ఆకులు అడుగు భాగాన గోధుమ, ఇనుము, రంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం కుళ్ళు, మొవ్వ కుళ్ళు పరిస్థితులు ఉన్నప్పుడు వీటి ఉధృతి అధికమవుతుంది.
నివారణ : తామర పురుగల నివారణకు మోనోక్రోటోఫాస్ 320 మి.లీ. G వేపనూనె 1లీ. G ఒక కిలో సబ్బు పొడిని 200 లీ. నీటిలో కలిపి పకరా పొలంలో పిచికారి చేసుకోవాలి. ధయోమిథాక్సామ్ 100 గ్రా.లను 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
5. పచ్చదనపు పురుగులు :
ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఆకు కొనభాగాన ‘వి’ ఆకారంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
నివారణ :
పైన తామర పురుగులను నివారిచడానికి తీసుకొన్న పర్సల్ పచ్చదనపు పురుగులు నివారించడానికి వర్తిస్తాయి.
6. పేను బంక పురుగు :
పిల్ల మరియు తల్లి పురుగలు యొక్క లేత కొమ్మలు మరియు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి.
నివారణ :
పేను బంక ఉధృతి అధికంగా ఉన్నట్లుగమనించినట్లయితే పసిఫేట్ 1:5 గ్రా./లీ. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
వేరుశనగను ఆశించే తెగుళ్ళు :
1. తిక్కా ఆకు మచ్చ తెగులు :
ఈ తెగులు వేరు శనగ పంటను 2 దశలో ఆశిస్తుంది. అవి
ఎ. ముందుగా సోకే ఆకుమచ్చ తెగులు
బి. అలస్యంగా సోకే ఆకు మచ్చ తెగులు
ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులు పైరు లేత దశలో అంటే విత్తిన 30 రోజుల లోపు ఆశిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలపై భాగాన గుండ్రటి గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. అలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు గుండ్రని చిన్న, చిన్న మచ్చల ఆకుల అడుగు భాగాన ఏర్పడతాయి.
నివారణ :
తెగులు సోకినట్లు గమినంచగానే లీటరు నీటికి మాంకోజెబ్ 2.5 గ్రా.G కార్బండజిమ్ 1 గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా., లేదా హెక్సాకొనజోల్ 3 మి.లీ. మందును 1 లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారి చేయాలి.
2. మొదలు కుళ్ళు :
విత్తనం మొలకెత్తిన తర్వాత నేలకు ఆనుకొని నల్లని శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుంది.
నివారణ : మొక్క మొదళ్ళు దగ్గర కార్బండజిమ్ G మాంకోజెబ్ కలిసిన మందు 2 గ్రా./లీటరు నీటికి కలిసి నేలను తడపాలి.
3. వేరు కుళ్ళు తెగులు (డ్రైరూట్ రాట్) :
ఈ తెగులు సోకినప్పుడు తల్లివేరు కుళ్ళిపోయి నలుపురంగుకి మారి నుజ్జునుజ్జుగా తయారవుతుంది.
నివారణ : కార్బండజిమ్ 1గ్రా / లీటరు నీటికి కలిసి తెగులు సోకిన మొక్కల చుట్టూ నేలను తడపాలి.
4. కాండం కుళ్ళు తెగులు (స్టెప్ రాట్ / స్ల్కీరోషియం) :
ఈ తెగులు సోకిన నేలపై భాగాన ఉన్న కాండంపై తెల్లటి బూజు తెగులు. తెరలుగా ఏర్పడుతుంది. మొక్కలను లాగినప్పుడు పై భాగం మాత్రమే ఊడివస్తుంది. క్రమేణా కాయలు కూడా కుళ్ళిపోతాయి.
నివారణ : హెక్సాకొనజోల్ 2 మి.లీ. / లీ. నీటికి కలిపి మొక్కలు బాగా తడిచేలా పిచికారి చేసుకోవాలి.
5. మొవ్వ కుళ్ళు వైరస్ తెగులు :
మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు ఆశిస్తే మొక్కలు కురచబడి పక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి మొవ్వ పండిపోతుంది ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తిచెందుతుంది.
నివారణ :
పైరుపై తెగులు గమనించినట్లైతే నివారణకు థమోమిథాక్సామ్ 100 గ్రా. లను 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
6. కాండం కుళ్ళు వైరస్ తెగులు :
లేత ఆకులపై ఆకుల ఈనెలపై నల్లటి మాడిన మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ మచ్చలు కాండంపై విస్తరించి మొవ్వ పండిపోతుంది. ఈ తెగులు కూడా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
నివారణ :
ఒక పకరాపొలానికి 80 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట మీద చీడ పీడలు మరియు తెగుళ్ళు ఉధృతిని బట్టి సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా ఆశించిన పంట దిగుబడులలో నికర ఆదాయాన్ని పొందడానికి ఆస్కారముంటుంది.
Also Read: Cattle Management in Winter: చలి కాలంలో పాడి పశువుల మరియు దూడల నిర్వహణలో జాగ్రత్తలు.!