శనగ పచ్చ పురుగు: ఈ పురుగు ప్రొద్దు తిరుగుడు పడించే అన్ని ప్రాంతంలో ఆశించును.ఈ పురుగు యొక్క లార్వాలు పువ్వులు, గింజలు,కాయల మధ్య చేరి గింజలను తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తుంది.ఈ పురుగు ఉధృతి ఎక్కవగా ఉంటే క్వినాలోఫాస్, క్లోరిపైరిఫాస్ 2 మ్. ల్. లీటర్ చొప్పున లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మ్. ల్.ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.పురుగుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఏరి వేసి చంపేయాలి .
తెల్ల దోమ: తెల్ల దోమ యొక్క శాభకాలు అడుగు భాగం నుండి రాసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారి మొక్కలు గిడసబారి చనిపోతాయి.దీని నివారణకు ట్రైజోఫాస్ 2.5 మ్. ల్.లీటర్ నీటికి లేదా ఎసిఫెట్ 1.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పచ్చ దీపపు పురుగు: ఈ పురుగు ఆకు యొక్క అడుగు భాగంలో ఉంటూ రాసాన్ని పిలుస్తాయి.ఆకులు దోప్పులుగా మారి అంచులు ముడుచుకొని పోయి పసుపు రంగుగా మారతాయి.వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మ్. ల్. డైమీథోయేట్ 2 మ్. ల్. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Also Read: Sunflower Diseases: పొద్దుతిరుగుడు పంటలో వచ్చే తెగుళ్ల నివారణ.!
తామర పురుగులు: ఈ పురుగు సన్ ఫ్లవర్ నెక్రోసిస్ అనే వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేస్తాయి.ఈ పురుగు పంట మొదటి దశ నుండి ఆశిస్తాయి.పై రు బెట్టకు గురైనప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.ఈ పురుగులు లేత భాగలను ఆశించి పెరగడం వలన మొక్కలు గిడసబారి పోతాయి.1 కిలో విత్తనానికి 5 గ్రా ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేయాలి.విత్తన శుద్ధి చేసి నాటడం వలన పురుగు బెడద నుండి పంటకు 25-30 రోజులకు పంటను కాపాడుకోవచ్చు. మోనోక్రోటోఫాస్ 1.6 మ్. ల్. లీటర్ నీటికి పిచికారీ చేయాలి.
బీహారి గొంగళి పురుగు: రెక్కల పురుగుల శరీరం గోధుమ రంగు మరియు ఎరుపు రంగులో ఉండి నల్లని మచ్చలు ఏర్పడతాయి.లద్దె పురుగు శరీరం లేత పసుపు రంగులో ఉండి వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది.లద్దె పురుగు ఆకులను తిని అపారమైన నష్టాన్ని కలుగజేస్తుంది.గుడ్లు మరియు తోలి దశలో ఉన్న గొంగళి పురుగులు గుంపులు గుంపులుగా ఉంటాయి కాబట్టి వాటిని చేతితో ఏరి వేసి నాశనం చేయాలి.నివారణకు వేప గింజ కాషాయం 5% పిచికారీ చేయాలి. లద్దె పురుగులు పెద్దగా ఉన్నపుడు క్లోరిపైరిఫాస్ 2 మ్. ల్. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Also Read: Weed Management Methods: కలుపు మొక్కల యాజమాన్యం మరియు నివారణా పద్ధతులు.!