Glyphosate: హెచ్. టి పత్తి సాగును నియంత్రించడం, ఆ పత్తి సాగు కోసం ఉపయోగించే గ్లైఫోసేట్ కలుపు మందును వాడకాన్ని నియంత్రించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా రైతాంగానికి లబ్ధి చేకూర్చే దృష్టితో పని చేస్తుంది. గ్లైఫోసేట్ మనుషులకు , పశువులకు కాన్సర్ కు కారకం. అందువల్ల వ్యవసాయ శాఖ గ్లైఫోసేట్ అమ్మకాలపై ఆంక్షలు విధించేలా ప్రతిపాదనలు పంపింది.
గ్లైఫోసేట్ అమ్మకంపై ఆంక్షలు విధించేలా పంపిన ప్రతిపాదనలో ముఖ్యమైన అంశాలు:
- గ్లైఫోసేట్ 20.2 శాతం ఎస్.ఎల్.ఐ.పి.ఎ. సాల్ట్ , గ్లైఫోసేట్ 41 శాతం ఎస్.ఎల్.ఐ.పి.ఎ. సాల్ట్, గ్లైఫోసేట్ 54 శాతం ఎస్.ఎల్.ఐ.పి.ఎ. సాల్ట్, గ్లైఫోసేట్ అమ్మోనియం సాల్ట్ 5 శాతం ఎస్ .ఎల్., గ్లైఫోసేట్ 71 శాతం ఎస్.జి (అమ్మోనియం సాల్ట్) వంటి కలుపు నివారణ రసాయనాలను కేవలం సి.ఐ.బి.ఆర్.సి. సిఫారసుల మేరకే వినియోగించాలి . సత్వరమే పంటలు పండించని నేలపై వినియోగించేలా పంటలు పండించే నేలపై ఎటువంటి పరిస్థితితులలో వినియోగించకుండా ఉండేలా ఆదేశాలు జారి చేసింది.
Also Read: కలుపు మొక్క సాగు తో లక్షాధికారులవుతున్న రైతులు
- పంటల సాగు ప్రారంభం కన్నా ముందే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు గ్లైఫోసేట్ పై ఆంక్షలు , వినియోగ పరిమితులు గురించి రైతులకు రైతు వేదికల ద్వారా అవగాహనా కలిగించాలి.
- సాగు భూమిలో వినియోగించేటప్పుడు కూడా అమ్మకం దారులు ADA/DAO అనుమతి స్లిప్ ఉంటేనే అమ్మాలి.
- ఈ ఆంక్షలను ఉల్లంగించిన డిలర్లు/ఉత్పతి దారులపై పురుగు మందు ల చట్టం 1968 లో పొందుపరిచిన నియమాలను అనుసరించి వారిపై చర్యలు తిసుకోవాలి.
- గ్లైఫోసేట్ అమ్మకాల విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగిన ఆ ప్రాంత ADA/MAO ల పై చర్యలు తీసుకుంటారు.
Also Read: వరి కలుపు ఇక సులువు
Leave Your Comments