చీడపీడల యాజమాన్యం

Biological Pest Control: పంటలనాశించు చీడపురుగుల నివారణలో జీవ నియంత్రణా పద్ధతులు.!

0
Biological Pest Control
Biological Pest Control

Biological Pest Control: ప్రస్తుత ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించుట వలన పంటలనాశించు చీడపురుగుల ఉదృతి అధికమైంది. తక్కువ స్థాయిలో ఉన్న చీడపురుగులు కూడా గరిష్ట స్థాయికి పెరిగి పంటలకు అధిక నష్టం కలగజేయుచున్నది. విష ప్రభావం కలిగిన పురుగు మందులను మోతాదు మించి వాడడం మరియు 2`3 కీటక నాశనుల మిశ్రమాలను వినియోగించటం ద్వారా పురుగులలో పురుగు మందులను తట్టుకొనే శక్తి పెరగటమే కాక పంట ఉత్పత్తులలో రసాయనాల అవశేషాలు అధిక శాతంలోకూడా ఉండడం గమనిచడం జరిగింది. ఈ దృష్ట్యా సమగ్ర సస్యరక్షణా చర్యలను సమయానుకులంగా రైతాంగం పాటించవలెను. సస్యరక్షణా చర్యలలో జీవ నియంత్రణా పద్ధతులను ఒక ప్రధాన అంశంగా పరిగణింప జేసి చీడపురుగుల ఉదృతిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు పూనుకోవాలి.

Biological Pest Control

Biological Pest Control

జీవ నియంత్రణా పద్ధతులు : వజ్రాన్ని వజ్రంతో కోయాలని అందరికి తెలిసిన సామెత, అలానే పంటలనాశించు చీడపురుగులను అదుపులో ఉంచటానికి సహజ శత్రువులను ఉపయోగించడమే జీవ నియంత్రణా పద్ధతి. ఈ జీవ నియంత్రణా పద్ధతులను రసాయనిక పురుగుమందులకు ప్రత్న్యాయంగా వాడడం వలన పర్యావరణ సమతుల్యత పాటించబడుతూ అవశేషరహిత నాణ్యత కలిగిన పంట ఉత్పత్తులను సాదించవచ్చు.
సహజ శత్రువులను ప్రధానంగా మూడు రకాలు..
1. పరాన్నజీవులు
2. బదనికలు
3. రోగాలు కలుగు జేసే సుక్ష్మజీవులు (జీవ రసాయనాలు)                   పరాన్నజీవులు : ఈ పరాన్న జీవులు పంటలకు హాని కలుగజేసే చీడపురుగుల మీద ఆశించే సహజ శత్రువులు. ఈ పరాన్నజీవులు పురుగుల లోపలకాని వాటిపైన కాని చేరి పురుగుల యొక్క జీవరసాన్ని పీల్చి వాటిని చంపివేస్తాయి. పరాన్నజీవులు పురుగుల యొక్క గ్రుడ్ల దశ, గొంగళి పురుగు దశ, కొసస్థదశలలో ఆశించి పురుగుల ఉదృతిని తగ్గిస్థాయి. ప్రకృతిలో సహజ సిద్ధంగానే వీటి యొక్క సంతానోత్పతి అధికంగా ఉండుట వలన వీటిని సమగ్ర సస్యరక్షణా పద్ధతులలో ఒక ముఖ్యసాధనంగా వాడుతున్నారు.
ఉదాహరణ : గ్రుడ్ల పరాన్నజీవి`ట్రైకోగ్రామా

  • పత్తి కాయ తొలుచు పురుగు నివారణకు 4 ట్రైకోగ్రామా కార్డులు ఎకరానికి ఎనిమిది సార్లు చొప్పున పదిరోజుల వ్యవధిలో విడుదల చేయుట వలన నియంత్రించగలము.
  • వరినాశించు కాండం తొలుచు పురుగు మరియు ఆకు ముడత పురుగు నివారణకు 4 ట్రైకగ్రామా కార్డులు మూడుసార్లు పదిరోజుల వ్యవదిలో వాడవలెను.
  • చెరుకు నాశించు కాండం తొలుచు పురుగు, మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు మరియు కత్తెర పురుగుల నివారణకు ట్రైకోగ్రామా కార్డులు 4 చొప్పున ఎకరాకు 5 సార్లు విడుదల చేసిన యెడల సత్పలితాలు పొందగలరు.
  • మిరపలో శనగ పచ్చ పురుగు, ఆముదం నామాల పురుగు మరియు క్యాబేజీ రెక్కల పురుగు నివారణలో భాగంగా ట్రైకో గ్రామా గ్రుడ్ల పరాన్నజీవి ఒక మంచి జీవనియంత్రణ పద్దతిగా ఉపయోగించవచ్చును.
  • గొంగళి పురుగు నాశించు పరాన్నజీవి `అపాంటేరిస్‌, బ్రాకస్‌, కిలోనస్‌, యాక్లిటోరియా  కొశస్థ దశనాశించు పరాన్నజీవి` బ్రాకిమేరియా, జ్యంతోపింప్లో మొదలగునవి.

 బదనికలు : ఈ బదనికలు వివిధ పంటపోలాలలో హానికారక పురుగులను భుజించి తమ సంతతిని పెంపొందించుకుంటూ పంటలలో నష్ట పరిమాణాన్ని తగ్గిస్తాయి. బదనికల సంఖ్య అధిక శాతంలో ఉంటే రసాయనిక చర్యలు చేపట్టవలసిన అవసరం లేదు.
ఉదా : సాలీడ్లు, తూనీగలు, అల్లిక రెక్కల పురుగులు, అక్షంతాల పురుగులు గొల్లభామ మొదలగునవి.

Biological Pest Control

రోగాలు కలుగు జేసే సుక్ష్మజీవులు (జీవ రసాయనాలు) : చీడపురుగులకు రోగం కలుగ జేసే క్షిమత కలిగిన సుక్ష్మజీవులను ఆధారంగా చేసుకొని ఈ జీవరసాయనాలు తయారు చేయబడతాయి. ఈ రోగకారక సుక్ష్మ క్రిములను పురుగు మందుల వలే పిచికారి చేయవచ్చు. పురుగులు తేలికగా రోగానికి గురై చనిపోవటం జరుగుతుంది. ప్రయోగశాలలో ఈ జీవరసాయనాలను వృద్ధి చేసి ఉపయోగించుటవలన తక్కువ ఖర్చుతో పురుగుల నియంత్రణ సాద్య పడడమే కాక వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.

Also Read: Pest Control in Cocoa Crop: కోకో పంటలో తెగులు నియంత్రణ.!

 జీవ రసాయనాలు 4 రకాలు : బ్యాక్టీరీయ ఆధారిత జీవరసాయనాలు – ఈ రసాయనాలు పురుగు యొక్క శరీరంలో ప్రవేశించిన 7 గంటలలోపు రోగ లక్షణాలు కనపడతాయి. బ్యాక్టిరీయా జీవరసాయనాలు వాడకం వలన చనిపోయిన పురుగులు వాటి యొక్క ముందు కాళ్ళతో ఆకులను, కొమ్మలను పట్టుకొని వేలాడుతుంటాయి. పొడి మరియు ద్రవ రూపంలో లభ్యమయ్యే ఈ జీవరసాయనాలుకు బి.టి. పార్ములేషన్‌ (లేక) బి.టి. మందులు అని వాడుక భాషలో పిలుస్తారు.
ఉదా: బాసిలస్‌ తురింజియెనిస్‌, బాసిలస్‌ లేంటిమార్బ్‌ స్‌, బాసిలస్‌ సీరియస్‌ (1గ్రా (లేక) 1 మి.లీ లీటరు నీటికి)
రెక్కల జాతి పురుగులైన శనగపచ్చ పురుగు, పొగాకు లద్ది పురుగు, నామాల పురుగు, కాండం తొలుచు పురుగు వంటి పురుగుల లార్వాలను రోగగ్రస్తం చేయుట వలన ఉధృతి తగ్గుతుంది.
శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు (కీటక నాశన శిలీంద్రాలు) :
ఈ రసాయనాలు పురుగుల శరిరంపై దాడి చేసి లోపలికి ప్రవేశిస్తాయి. ఆశించిన శిలీంద్రపు రకాన్ని బట్టి పురుగు శరిరంపై తెలుపు, నలుపు లేదా ఎరుపు రంగులతో బూజు పదార్ధం ఏర్పడుతుంది. పురుగు శరీరం గట్టిగా మారుతుంది.
ఉదా: బవేరియా బసియానా, మెటారైజియం ఎనై సొప్లి మరియు వెర్టీసిల్లీయం లికాని (5 గ్రా. లీటరు నీటికి)
రసంపీల్చే పురుగులు : పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ, చెదలు, పొలుసు పురుగు మొదలగు పురుగులను ఈ శీలింద్ర జీవ రసాయనాల ద్వారా అదుపు చేయవచ్చును.
వైరస్‌ ఆధారిత జీవరసాయనాలు : మనుషులలో ఏరకంగా వైరస్‌ సుక్ష్మజీవుల వలన రోగాలు వస్తాయో అటులనే పురుగులలో కూడా వివిధ రకాల వైరస్‌ లు సోకి రోగ కారకాలు అవుతాయి. ఈ వైరస్‌ వ్యాధికి గురైన పురుగు యొక్క లార్వాలు తొలుత తక్కువగా తింటాయి, తరువాత 5`6 రోజులలో చనిపోతాయి. చనిపోయే ముందు మొక్కల పైభాగాలకు ప్రాకి తలక్రీందులుగా వేలాడతాయి. ఈ పురుగులు క్రమంగా కుళ్లిపోయి వైరస్‌ లను విడుదల చేసి కొత్త లార్వాలలో వ్యాధిని వ్యాప్తి చేస్తాయి.
వైరస్‌లు ప్రధానంగా మూడు రకాలు:
1. న్యూక్లియో పాలిహైడ్రాసిస్‌
2. సైటో ప్లాస్మిక్‌ వైరస్‌
3. న్యూలోసిస్‌ వైరస్‌
పత్తిలో శనగపచ్చ పురుగు నివారణకు 100 ఎల్‌. ఐ / ఎకరాకు, పొగాకు లద్ది పురుగు నివారణకు, 200 ఎల్‌. ఐ / ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే వీటి ఉధృతిని గణనీయంగా తగ్గించుకోవచ్చు. వేరు శనగ నాశించు ఎర్ర గొంగళి పురుగు, ఆముదంలో నామాల పురుగులను కూడా ఈ ఎన్‌.పి.వి లతో నివారించుకోవచ్చు.
కీటక నాశక నులి పురుగులు : నులి పురుగుల నివారణలో జీవరసాయనాలు ప్రాముక్యత సంతరించు కొన్నాయి. హైటిరోర్బటిస్‌ మరియు స్టినర్‌ నిమా జాతులకు చెందిన నులి పురుగులు హానికారక పురుగులను తగ్గించడంలో క్షమత కలిగి ఉండడం ప్రయోగాత్మకంగా నిరూపణ జరిగింది.
ఉదా : వేరు పురుగుల నివారణలో కిటక నాశనలు ప్రధాన పాత్ర వహిస్తాయి.
తెగుళ్ల నివారణలో జీవరసాయనాలు : శిలీంద్ర ఆధారిత రసాయనం, ట్రైకోడెర్మావిరిడి ఒక సమర్ధవంతమైన జీవరసాయనం. ముఖ్యంగా వివిధ పంటలలో ఎండుకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు, నారుకుళ్ళు తెగులు, వడలు తెగులు నివారణకు తోడ్పడుతుంది.
ఈ విధంగా పురుగుల ఉదృతిని గమనించుకొని జీవరసాయనాల వాడకంలో ఎంపిక మరియు పాటించవలసిన మెళుకవలను గ్రహించి రైతాంగం చీడపురుగుల ద్వారా కలిగే పంట నష్టాన్ని నివారించి అవశేష రహిత పంట ఉత్పత్తులను పొందగలరు.

-డా. డి. సుధారాణి, సీనియర్‌ శాస్త్రవేత్త (కీటక నివారణ విభాగం),
చెరకు పరిశోధన స్థానం, ఉయ్యూరు, కృష్ణ జిల్లా, ఫోన్‌ : 94410 58009.

Also Read: Mango Pest Control: మామిడిలో చీడపీడల నివారణ చర్యలు.!

Must Watch:

Leave Your Comments

Rodent Management in Rich Crop: వానాకాలం వరి పంటలో ఎలుకల నివారణ.!

Previous article

Pest Control In Cotton: పత్తిలో కాయ కుళ్ళు తెగులు నివారణ చర్యలు.!

Next article

You may also like