చీడపీడల యాజమాన్యం

Mulberry Cultivation: మల్బరీ సాగు లో శిలీంద్ర, కీటక నాశని మరియు కలుపు మొక్కల సంహారక మందుల ప్రాముఖ్యత.!

0
Mulberry Fruit
Mulberry Fruit

Mulberry Cultivation : బావిస్టిన్ మరియు డైథేన్ ఎం- 45: – బావిస్టిన్ అనేది ఒక సిస్టమిక్ శిలీంద్రనాశని. దీనిని ఆకులపై పిచికారి చేయడానికి, నారుమొక్కల శుద్ధీకరణకు వాడవచ్చు. అలా కాకుండా డైథేన్ ఎం-45 ఒక కాంటాక్ట్ శిలీంద్రనాశని. ఇది భూమిపై చల్లడానికి, విత్తనకడ్డీ శుద్ధీకరణకు, పట్టుపురుగుల పడకల శుద్ధీకరణకు భాగా ఉపయోగపడుతుంది.

Mulberry cultivation

Mulberry Cultivation

గ్లైసిల్ (గైపోసేట్):- ఇది సిస్టమిక్ కలుపు మొక్కల నివారిణి. ఇది అన్ని రకాల కలుపు మొక్కలను ముఖ్యంగా తుంగ, గరికలాంటి కలుపు మొక్కలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. తోట కత్తిరించి, మిగిలిన ఆకులను తొలగించిన తర్వాత దీనిని 1 లీటరు నీటికి 7 మి.లీ. మరియు 5 గ్రాముల అమ్మోనియం సల్ఫేటుతో కలిపి పిచికారీ చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా WFN-40 నాజిల్ను అమర్చిన స్ప్రేయర్తో పిచికారి చేయాలి. ఏడాదికి 2 సార్లు పంట మార్చి పంటకు పిచికారి చేయాలి. కలుపు మొక్కలు పూర్తిగా ఎండిపోవునంతవరకు పొలాన్ని దున్నకూడదు.

 Glyphosate spraying on plants

Glyphosate spraying on plants

రక్ష (జీవనియంత్రణ కారణి -ట్రైకోడెర్మా విరిడి): ఒక కిలో రక్ష మిశ్రమాన్ని 50 కిలోల పశువుల ఎరువులో కలిపి దానికి నీరు చల్లి 30 శాతం తేమ ఉండేలా చేసి కుప్పలుగా పోసి, ఈ మిశ్రమాన్ని పాలిథిన్ కవరుతో ఎండిపోకుండా కప్పాలి. దీనిని 7-10 రోజుల పాటు నీడలో వుంచితే శిలీంద్రము వృద్ధిచెందుతుంది. రోగం సోకిన మొక్కల చుట్టూ మట్టిని 1 అడుగు లోతున | త్రవ్వి 500 గ్రాములు రక్ష మిశ్రమాన్ని ప్రతిమొక్క వేరు ప్రాంతంలో పట్టించాలి. తర్వాత మట్టిని కప్పి నీరు పెట్టాలి.

Also Read: Important Mulberry Varieties: కొన్ని ముఖ్యమైన మల్బరీ రకాలు.!

మొక్కలు చనిపోయిన ప్రాంతంలో కొత్తగా నాటడానికి ముందు నారు మొక్కలను గానీ, కడ్డీలను గానీ 0.1శాతం డైథేన్ ఎం-45 (1 లీటరుకు 1 గ్రాము) ద్రావణంలో 30 నిముషాల పాటు ముంచాలి. (ఇందుకోసం బావిస్టిన్ వాడకూడదు ఎందుకంటే ట్రైకోడెర్మా బావిస్టిన్ ను తట్టుకోలేవు) ఆ తరువాత 500 గ్రాముల రక్ష మిశ్రమాన్ని పోసి మొక్కలు నాటాలి.

బయోనిమా:- చీడలను అరికట్టడానికి కేంద్ర పట్టుపరిశోధనా మరియు శిక్షణాలయo, మైసూరు వారు తయారుచేసిన బయోనిమాను 1 కిలోతో 24 కిలోల వేప పిండిని 200 కిలోల పశువుల ఎరువును కలిపి నీటిని చల్లి నీడలో కుప్పగా పోయాలి. మధ్య మధ్యలో నీరు చల్లుతూ తేమ శాతం 30 ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వారం తరువాత ఈ మిశ్రమాన్ని రోగగ్రస్తమైన మొక్కల వేరు భాగంలో ప్రతి మొక్కకు 200 గ్రాముల చొప్పున వేసి మట్టి కప్పి నీరు పెట్టాలి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Mulberry Cultivation: మల్బరీ సాగులో మెలుకువలు

Must Watch:

Leave Your Comments

Toxoplasmosis in Cattles: పశువులు మరియు గేదెలలో టాక్సోప్లాస్మోసిస్ వ్యాధి ఎలా వస్తుంది.!

Previous article

Mango Cultivation: మామిడిలో లాభాలు రెట్టింపు చెయ్యడానికి  తీసుకోవాల్సిన చర్యలు.!

Next article

You may also like