చీడపీడల యాజమాన్యం

Grape Rot Prevention: ద్రాక్షను ఆశించు తెగులు – నివారణ.!

0
Grape Pest and Dieases
Grape Pest and Dieases

Grape Rot Prevention:

     డౌనీ మిల్డ్యూ(Downy mildew)-

  • ఈ తెగులు ప్లాసోపారా వైటికోల అను శీలింద్రం వల్ల కలుగుతుంది.
  • ఆకుల పై భాగాన చిన్న ఆకు పచ్చని లేక  పసుపు పచ్చని  నూనె మచ్చలు కనిపించును. మచ్చలు పెద్దవై కణాలు  ఎరుపు  గీత వాలే ఆగుపించును.
  • తెగులు సోకిన భాగాలు  రంగుకు మారతాయి.
  • ఈ దశలో తెగులు సోకిన మచ్చల కింద  భాగంలో  శీలింద్రపు పెరుగుదలా కనిపించును.
  • తెగులు సోకిన మచ్చలు  ఒక దానితో ఒకటి  కలిసి పెద్ద వాగును కొన్ని సార్లు శాఖలు  తీగలు, లేత  ఆకులపై , పువ్వుల పై  కాయలపై  గోధుమ  వర్ణపు మచ్చలు   ఉంటాయి.
Downy Mildew and Powdery Mildew

Downy Mildew and Powdery Mildew

  • సంవత్సరం పొడవునా ఆకు పచ్చగా  ఉండే  పంట  పై  కొనిడియా ద్వారా తెగులు  వ్యాప్తి చేదుతుంది.
  • లేని యెడల ఆకులు  కొమ్మలపై  ఏర్పడిన  ఉస్పోర్సు ద్వారా తెగులు వ్యాపించును.
  • తెగులు సోకిన మొక్కల అవశేషాలలోని ఊస్పోర్సు అనుకూల పరిస్థితులలో మొలకెత్తి కింది  ఆకులపై  తెగులును కలుగచేయును.
  • తెగులు ప్రధమ  దశ  తరువాత గాలి ద్వారా కొనిడియా వలన  తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందును.
  • తెగులు నేలపై ఉండే మొక్క అన్ని భాగాలకు  సోకుతుంది. ఆకులపై  అకృతి లేని చిన్న చిన్న  ముదురు  మచ్చలు ఏర్పడును.
  • వాతావరణంలోని అధిక తేమ వలన  తెగులు సోకిన  భాగాలపైన  నారింజ  రంగు  కల  శీలింద్ర బీజలా పెరుగుదల కనిపించును. తెగులు సోకిన  మొక్కల బాగాలలోని పుండ్లు మరియు అవశేషాలలో శిలీంద్రము జీవించి  ఉండి కొనిడియా ద్వారా తెగులు కలుగజేయును.

Also Read: Insect Pest Management in Grapes: ద్రాక్ష పంటను ఆశించే తెగుళ్ళు వాటి గుర్తింపు లక్షణాలు ఎలా ఉంటాయి? వాటి నివారణకు ఏం చేయాలి.!

నివారణ:

  • తెగులు సోకిన మొక్కలను ఏరి నాశనం చేయాలి.
  • తీగలను నేల నుండి పైకి  ప్రాకించి సిఫార్సు చేసిన దూరంలో  సరైన సమయంలో కత్తిరించాలి.
  • ఒక శాతం బోర్డు మిశ్రమం, మేటలక్సిన్  2 గ్రా. ప్రోపినేబ్ 3 గ్రా. మందులో  ఒక దానిని పిచికారీ చేసి నివారణ చేయాలి.

పక్షి కన్ను తెగులు:

  • ఈ తెగులు ఎలిసినో ఎంపిలిన అను శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • ఆకులపై అకృతిలేని చిన్న చిన్న  గోధుమ  మచ్చలు ఏర్పడి  మధ్య భాగంలో  బూడిద  రంగుకు  మారి మచ్చ  చుట్టూ ముదురు  గోధుమ  రంగు  ఉంటుంది. కొన్ని సార్లు మచ్చల మధ్య భాగం  ఆకుల నుండి వేరై రాలిపోతాయి.
Grape Rot Prevention:

Anthracnose Disease

  • కొమ్మలు, తీగలపై చిన్న  లేత  గోధుమ  రంగు  మచ్చలు  మొక్కపై  కుదించుకుపోయినట్లు కనిపిస్తాయి.
  • వాతావరణంలో అధిక తేమ  ఉన్నపుడు తెగులు సోకిన  భాగాలపై  నారింజ  శిలీంద్ర బీజలా పెరుగుదల  కనిపించును.
  • తెగులుకు గురైన భాగాలలో  పెరుగుదల తగ్గును. ఆకులు పాలి పోయి పసుపు  రంగుకు మారి  క్రింది వైపుకు ముడుచుకు పోతాయి. కాయలపై  కూడా పక్షి కన్ను ఆకారంలో  మచ్చలు  ఏర్పడడం వలన  కాయలపై  పగుళ్ళు ఏర్పడును.

నివారణ:

  • తెగులు సోకిన తీగలను , కొమ్మలను కత్తిరించాలి.
  • కార్బడిజం 1%  థయోఫినైట్ మిధైల్ 1%  మందును ఎదో ఒక దానిని  తెగులు తీవ్రతను బట్టి 10-15 రోజుల  వ్యవధి లో పిచికారీ చేయాలి.

Also Read: Grape Vines: ద్రాక్షలో తీగలను పాకించే విధానం గురించి తెలుసుకోండి.!

Must Watch:

Also Watch: 

Leave Your Comments

Food Wrapped in News Paper: న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహరం తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.!

Previous article

Aquatic Weed Damage: నీటికలుపు మొక్కల వలన కలిగే నష్టాలు.!

Next article

You may also like