Sorghum Disease Management: జొన్న పంట పుష్పంచే దశలో అధిక తేమతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితులలో ఈ శీలింద్రం కంకిలో పుష్పలను ఆశించి అండాశయాంపై వృద్ధి చెందుతుంది. వ్యాధి సోకిన గింజల నుండి తెల్లని లేక లేత ఎరుపు రంగు జిగట లాంటి తీయటి ద్రవం చుక్కలు చుక్కలుగా బయటకి వస్తుంది. దీనిలో శీలింద్ర బీజలు ఉంటాయి. దీని తర్వాత వ్యాధి సోకిన గింజల్లో నల్లటి స్క్లీరోషియాలు ఏర్పడును. దీనిని ఎర్గాట్ దశ అంటారు. ఈ వ్యాధి పంట పొలాల్లో కిటకాల ద్వారా మరియు వర్షపు గాలి ద్వారా ఒక మొక్క నుండి మారొక మొక్కకు వ్యాప్తి చెందును.
నివారణ:
తెగులు సోకని పొలము నుండి విత్తనాలను సేకరించాలి.
విత్తనాలను 10% ఉప్పు ద్రావణంలో ముంచి తేలిన స్క్లీరోషియాలు వేరు చేయాలి.
వేసవి లో లోతు దుక్కి చేయాలి.
పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కలను తీసివేయాలి.
పైరు పూత దశలో మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బడిజం 1 గ్రా. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
Also Read: Sorghum Insect Pests: జొన్న పంటలో మొవ్వు ఈగ రియు కాండం తొలుచు పురుగు ను ఎలా నివారించాలి
కుంకుమ తెగులు:
ఆకుల అడుగు భాగంలో సన్నగా పసుపు లేదా నారింజ రంగులో ఉండే బొబ్బల వంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమంగా గోధుమ రంగునుండి ముదురు గోధుమ రంగుకు మారతాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు తోడిమాలకు మచ్చలు ఏర్పడి తెగులు సోకిన మొక్కలు దూరానికి ముదురు గోధుమ రంగులో కనిపిస్తాయి.చల్లని వాతావరణం, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నపుడు తెగులు వృద్ధి చెందడానికి అనుకూలమైనది.నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా ట్రైడీమార్క్ 1 మీ. లి. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాటుక తెగులు:
ఈ తెగులు పైరు విత్తిన తరువాత ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తుంది. తెగులు సోకిన మొక్కలు గిడసబారి వెన్ను తీసిన తర్వాత తెగుళ్ళ లక్షణాలు గుర్తించవచ్చు. తెగులు సోకిన గింజలు ఆరోగ్యవంతమైన గింజలు కన్నా పెద్దవిగా ఉండి తెల్లని పొర కప్పబడి ఉండును. తెగులు సోకిన గింజలు గుండ్రంగా ఉండక మొనదేలి ఉంటాయి. ఈ గింజలు పగిలి శీలింద్ర బీజలు బయటకు వస్తాయి. పంట మార్పిడి చేయాలి. థైరామ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
Also Read: Pest Management in Sorghum: జొన్నను ఆశించు తెగులు – వాటి నివారణ