Pink Stem Borer in Cotton: ప్రపంచలో అతి ముఖ్యం అయినా వాణిజ్య పంట.దీన్ని తెల్ల బంగారం అని కూడా పిలుస్తారు.అయితే గులాబీ రంగు కాండం తోలుచు పంటకు ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. ప్రత్తి పంటల్లో ఆశించిన గులాబీ రంగు కాండం తోలుచు పురుగుని ఎలా కానీపెట్టాలో తెలుసుకుందాం.
గులాబీ రంగు కాండం తోలుచు పురుగును ఎలా కనిపెట్టాలి?
ప్రత్తి నాటిన 40-50 రోజులలో తర్వాత పూత దశలోనే గుర్తించవచ్చు.
సాధారణంగా పైరు మధ్య నుండి చివరి దశ వరకు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.దీని రెక్కల పురుగు ముదురు గోధుమ లేక తేలిక పసుపు రంగులో ఉంటాయి.వాటి పై ముదురు రంగు మచ్చలు అనేవి ఉండడం ద్వారా కనిపెట్టవచ్చు.
పిల్ల పురుగులు మొదట తెలుపు రంగులో ఉండి తర్వాత గోధుమ రంగుకి గాని ఆకుపచ్చ రంగుకి గాని నల్ల రంగు కి గాని మారి చివరికి గులాబీ రంగులోకి మారతాయి.వీటి శరీరంత ముదురు రంగులోకి మారి చారాలు ఏర్పడతాయి.లద్దె పురుగులు మొక్కల లోనికి తోలుచుకొని పోయి లోపల పదార్ధాలను తింటాయి.పుష్పo లోనికి ప్రవేశించినపుడు ఆకర్షక పత్రలు విప్పబడకుండా ముడుచుకొని పోతాయి తద్వారా మొగ్గలు గ్రుడ్డి పులుగా మారతాయి.
లేత కాయలు సన్నని రంధ్రాలు చేసి లోపలికి దూరి ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి.ఈ కాయలు కూడా రాలిపోతాయి.కొంచెం ముదురు కాయలు అయితే చెట్టుకు అంటుకొని ఉంటాయి.లద్దె పురుగు కాయలోనికి ప్రవేశించడానికి చేసిన రంధ్రాలు క్రమేపి కనిపించకుండా పోయి నష్ట పరచిన కాయకు ఆరోగ్యంగా ఉన్న కాయకు కాయ పగిలే వరకు తేడా కనిపించదు. రైతులు గులాబీ కాండం తోలుచు పురుగులు కనిపెట్టాలి అంటే లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి.
ఎకరానికి 4-8 లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవాలి.వరుసగా నాలుగు రోజులు పొలం లో 4-8 పెట్టుకోవాలి. ఆ తర్వాత బుట్టకు 8 మాగ రెక్కల పురుగులు ఉంటే మందును పిచికారీ చేయాలి.లింగక్షర్షణ బుట్టలు పెట్టుకోవడం వల్ల పురుగుల ఉధృతి గమనించవచ్చు.పురుగు ఆశించిన వెంటనే మందులను పిచికారీ చేయరాదు.
Also Read: Cotton Harvesting and Storage: రైతులు పత్తి పంట కోత మరియు నిల్వ సమయం లో తీస్కోవాల్సిన జాగ్రత్తలు