Nematodes: ఈ ఏడాది వానలు అనుకున్న దాని కంటే ఎక్కువగా పడ్డాయి. ఆధిక వర్షాలు వల్లన గాలిలో తేమ ఎక్కువ శాతం ఉంటోది. దీనికి తోడు భూమిలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వ్యాధులు కూడా ప్రభలే ఆవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా పంటలపై ఎక్కువగా చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. కానీ ఈమధ్య కాలంలో కంటికి కనిపించని నులిపురుగులు ఎక్కువగా అభివృద్ధి చెంది పంటలపై వైరస్ ను కలుగజేస్తున్నాయి.
దీనివల్ల రైతులు ఎక్కువగా పురుగు మందులను పిచికారీ చేస్తు పెట్టుబడులను పెంచుకుంటున్నారు. దీంతో భూమిలో ఉన్న నులి పురుగుల సంఖ్య వృద్ధి చెంది ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అసలు నులిపురుగులు అనేది భూతద్దంలో వెతికిన కూడా కనబడనంత పరిమాణంలో ఉంటాయి. కానీ పంటకు చేసే నష్టం మాత్రం విపరీతంగా ఉంటుంది.
కంటికి కనిపించని చిన్న సైజులో
పర్వతాల ఎత్తు నుంచి సముద్రాల లోతు వరకు ప్రాణి బ్రతకడానికి అవకాశమున్న ప్రతిచోట తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఇవి మట్టిలో లేదా నీటిలోనే కాకుండా పరాన్నజీవులుie మానవులు, జంతువులు, మొక్కలలో కూడా స్వేచ్ఛగా జీవిస్తాయి. ఇవి కంటికి కనిపించని చిన్న సైజులో ఉంటాయి. సన్నని దారం వలె ఉంటాయి. ఇవి ఎక్కువగా వేర్లపై బుడిపెలను కలుగజేస్తాయి. ఇవి తేమ ఉన్న ప్రాంతంలో, భూమిలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి.
Also Read: టీ ట్రీ ఆయిల్ ల్లోని ఉపయోగాలు.!
నులిపురుగుల వల్ల పంటల్లో చాలా నష్టం కలుగుతుంది. దేశంలో వీటివల్ల ఏటా కోట్ల నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఎక్కువ తేమ, ఎక్కువ ఎరువుల వాడకం, ఏడాది పొడవునా పంటలు సాగు చేయడం, ఎక్కువ పంట సాంద్రత ఉండటం వల్ల అధిక నులిపురుగుల వృద్ధికి దోహదం చేస్తాయి.
నివారణ పద్ధతులు
పంటలకు నీరు నిల్వ ఉండకూడదు. పంట నాటే ముందు విత్తనాలను 55-54 డిగ్రీల సెల్సియస్ కలిగిన నీటిలో 15 నుంచి 20 నిమిషాల వరకు ముంచాలి. తర్వాత విత్తనశుద్ధి చేయాలి. సాధారణంగా మార్కెట్‌లో నులిపురుగుల నివారణకు రసాయన ముందులు అనేవి లేవు. కానీ కొన్ని పురుగు మందులైన కార్బోఫ్యూరాన్, ఫోరెట్ కళికలు నులి పురుగులను నివారించగలదు. మే, జూన్ నెలల్లో వేసవి దుక్కులు చేయడం వల్ల వేరు కణుపు పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. బంతి, వెల్లుల్లి, ఆవాల పంట చుట్టూ వేయాలి. ఇవి నులి పురుగులను చంపే రసాయనాలు విడుదల చేస్తాయి.
ఆముదం, పిల్లి పెసర మొక్కలను నులిపురుగులను ఆకర్షిస్తాయి. ఎక్కడైతే నులిపురుగుల లక్షణాలు కనపడిన వెంటనే వాటిని పీకాలి. పంటల మధ్య మల్చింగ్ చేయడం వల్ల కొంతవరకు నులిపురుగుల వృద్ధిని అరికట్టవచ్చు. సేంద్రియ పద్దతుల్లో పంటలను వేస్తే ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. నులిపురుగుల బారి నుంచి తట్టుకుంటాయి.సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి నులిపురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.
Also Read: సీజన్ తో సంబందం లేకుండా ఏడాది పొడువునా సాగు.!