Homeopathy Treatment For Neem Trees: ఏ రోగం రాని చెట్టుగా వేపను గుర్తుచేయుకుంటాం కానీ మారుతున్న వ్యవసాయ పరిస్థితులలో ఈ పంటను రకరకాల చీడ పీడలు ఆశిస్తుండడం గమనార్హం. దీని కోసం క్యూప్రమ్ మెట్ 200 (CUPRUM METALLICUM 200) అనబడే ద్రవ రూప హోమియో మందును తగిన మోతాదులో పిచికారీ చేస్తే ఉద్యాన పంటలలో వచ్చే తేయాకు దోమ అదుపులోకి వస్తుంది. ఈ మందును పిచికారీ చేసిన రెండు రోజుల తర్వాత కొక్సీనెల్లా 200 (COCCINELLA SEPTEMPUNCTATA 200) అనబాబు ద్రవ రూప మందును, వేప చెట్లపై పిచికారీ చేసైనా,లేదా చెట్టు చుట్టూ పాదులు చేసి నేలను తడపవచ్చును.
Also Read: Neem oil: వేప మందుల వాడకంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
అన్నింటికన్నా ముందుగా చెట్టు చుట్టూ శుభ్రం చేసి పాదును చేసి, నీటితో నిండుగా తడపాలి. మందు ద్రావణం చెట్టుకు పది లీటర్లు అవసరమవవును. చెట్టు వయస్సు ఎక్కువ ఉంటె ఇరువై లీటర్ల వరకూ పోసుకోవచ్చు. ఒక దఫా ఈ రెండు మందులు వాడి, 8 రోజుల సమయం వేచి చూడాలి.పురుగు ఉదృతి తగ్గకపోతే, అవసరం అనుకుంటే మరోసారి మందును వాడవచ్చు.
హోమియోపతి మందు వాడే విధానం : 2.5 మిల్లీ లీటర్ల (ఎం.ఎల్.) మోతాదులో హోమియో మందును 20 లీటర్ల నీటికి కలిపి ఉపయోగించవచ్చు. ఒక లీటరు సీసా లేదా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని అందులో సగం వరకు నీరు నింపుకోవాలి. అందులో 2.5 మిల్లీలీటర్ల (ఎం.ఎల్.) మందు కలిపి, మూతను గట్టిగా బిగించి, 50 నుండి 60 సార్లు గట్టిగా పైకి కిందకు ఊపాలి. ఆ తర్వాత ఆ మందును 20 లీటర్ల నీరు ఉన్న స్ప్రేయర్ ట్యాంకులో పోసుకొని,పంట పైన పిచికారీ చేసుకోవాలి.
Also Read: Malabar Neem Farming: మలబార్ వేప సాగుతో రైతులకు అదనపు లాభం