చీడపీడల యాజమాన్యం

నల్ల తామర పురుగు కలకలం..

0
Home Minister Sucharitha

Home Minister Sucharitha

Home Minister Sucharitha Review On Nalla Thaamara Purugu నల్ల తామర మిర్చి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎక్కడినుంచో వచ్చిందో ఈ మాయరోగం రైతన్నల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో నల్ల తామర ప్రభావం మరింతగా ఉంది. జిల్లాలో నల్ల తామర సోకి వందల ఎకరాల మిర్చి పంట నాశనమైంది. కాగా.. నేడు హోంమంత్రి సుచరిత మీడియా సమావేశంలో మాట్లాడారు. నల్ల తామర పురుగుతో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హోంమంత్రి సుచరిత. ఈ తరహా పురుగు సోకడంతో పండించిన పంటను పీకేస్తున్న పరిస్థితి. Home Minister Sucharitha

Nalla Thaamara

నల్ల తామర పురుగు ఒక్క గుంటూరు జిల్లాలోనే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ ప్రాంతాల్లోనూ దాని ప్రభావం చూపిస్తుంది. దేని వ్యాప్తి మిర్చి నుండి ఇతర పంటలకు సోకె అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ నిపుణులు. తామర పురుగు ప్రభావం సామాన్యులపై ప్రభావం చూపనుంది. ఇలా పంట నష్టం కారణంగా రాబోయే రోజుల్లో మిర్చి ధరలు పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తుందంటున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు 70వేలు పెట్టుబడిని రైతు నష్టపోతున్నారన్నారు హోంమంత్రి సుచరిత. సీఎం జగన్ రైతు పక్షపాతి రైతులకు వీలైనంత సాయం అందేలా చూస్తామని ఆమె చెప్పారు. పంట దెబ్బతిన్న రైతులకు వచ్చే ఏడాది వందశాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని సీఎం వైఎస్ జగన్ ను కోరతామన్నారు. నష్టపోయిన రైతులకు ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం అందించేందుకు సీఎంతో చర్చిస్తామని ఆమె తెలిపారు. Nalla Thaamara Purugu

Nalla Thaamara

Leave Your Comments

కోళ్ళలో సూపర్‌బగ్స్..

Previous article

తెలంగాణాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన వైఎస్ షర్మిల

Next article

You may also like