Groundnut Diseases: ముందుగా వచ్చు ఆకుమచ్చ తెగులు
లక్షణాలు: వేరు శెనగ పైరుకు ముందుగా ఈ ఆకుమచ్చ తెగులు సోకుతుంది. కాబట్టి దీనిని ముందుగా వచ్చు తెగులు అంటారు. పైరుపై ఈ తెగులు విత్తిన 30 రోజుల తర్వాత కనిపిస్తుంది. మొదట ఆకులపైన నిర్ధారితమైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడుతుంది. ఇవి పెరిగి గుండ్రటి 1-10 యం.యం.ల వ్యాసం గల గోధుమ వర్ణపు గల నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు. చుట్టూ పసుపు పచ్చని వలయం ఉండిన ఈ పసుపు పచ్చని వలయాలు ఆకు మొక్క పై భాగాన్ని నిర్దిష్టంగా కనిపిస్థాయి. ఈ శిలీంధ్రపు బీజాలు మచ్చపై భాగాన్న పెరగటముచే మచ్చలకు నలుపు వర్గం ఏర్పడుతుంది.ఈ మచ్చల ఆకు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోవుతాయి. ఈ శిలీంధ్రం ఆకు తొడిమ, మరియు కాండపు భాగాన్ని కూడా ఆశిస్తుంది. ఇది విత్తనాలలోను, పంట అవశేషాలోను ‘ జీవిస్తుంది గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది.
ఆలస్యంగా వచ్చు ఆకు మచ్చ తెగుళ్లు
లక్షణాలు: ఈ తెగులు పంట విత్తిన 40-45 రోజుల తర్వాత వేరుశెనగ పైరుపై ఈ తెగులు లక్షణాలు కనపడతాయి. ఆకులపైన నిర్ధారితమైన చిన్నిచిన్ని మచ్చలు ఏర్పడి, అవి పెరిగి గుండ్రంగా మారి నలుపు లేదా ముదురు గోధుమ వర్ణానికి మారుతాయి. సామాన్యంగా ఈ మచ్చల చుట్టు పసుపు పచ్చని వలయాలు ఉండవు. ఆకు మొక్క అడుగు భాగాన శిలీంధ్ర బీజాల పెరుగుదల వలన నల్లటి మచ్చలు కనపడతాయి. ఈ మచ్చల్లో శిలీంధ్ర బీజాలు వలయాలు వలయాలుగా ఉంటుంది. ఈ శిలీంధ్రము ఆకు తొడిమ, మరియు కాండాన్ని కూడ ఆశించవచ్చు. ఈ ఆకు మచ్చ తెగులు వాతావరణంలో అధిక తేమ కల్గి యుండి ఉష్ణోగ్రత 26-30సి ఉన్నప్పుడు మరియు వేరు శెనగ తర్వాత వేరు శెనగ వేసినపుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
Also Read: Groundnut Crushing Machine: వేరుశనగ కాయలు వొలుచు యంత్రము
నివారణ: ఆరోగ్యవంతమైన విత్తనాన్ని ఎన్నుకొని థైరాన్/కాప్టాన్ 3గ్రా/ ఒక కె.జి. విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేయాలి. పంటకోసిన తర్వాత పొలంలో మిగిలిన చెత్త చెదారాన్ని ఏరి కాల్చివేయాలి. వ్యాధి కనిపించిన వెంటనే మ్యాంకోజేబ్ 0.25 శాతం కార్బన్ డిసం 0.1 శాతం లేక క్లోరోథయోనిల్ (0.2 శాతం మందులను) 10రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. తెగులు తట్టుకొనే రకాలైన వేమన, నవీన్, తిరుపతి 3 వంటి రకాలను విత్తుకోవాలి.
త్రుప్పు తెగుళ్లు
లక్షణాలు: ఈ తెగులు మొదట ముదురు ఆకులపై కనిపిస్తుంది. ఆకులు అడుగు భాగాన్ని చిన్న చిన్న పరుపు లేదా గోధుమ రంగు బొడిపెలు లాంటి మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పై భాగాన లేత పసుపు రంగు మచ్చలు కనపడుతాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉ న్నప్పుడు ఈ మచ్చలు ఆకు అంతటా వ్యాపించి ఆకులు ఎండి పోతుంది. ఈ వ్యాధి లక్షణాలను ఆకుకాడ మరియు కాండంపై కూడ గమనించవచ్చు. ఈ వ్యాధి వృద్ధికి 15-20 సెంటిగ్రేడు ఉ ష్ణోగ్రత మరియు అధిక తేమతో కూడిన వాతావరణం అనువైనవి.
నివారణ: మ్యాంకోజెబ్ 0.25శాతము మందు లేదా క్లోరోథయోనిల్ 0.2 శాతము మందు లేక కాలిక్సిన్ 0.05 శాతం మందు 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చెయ్యాలి.
Also Read: Soils For Groundnut Cultivation: వేరుశనగ సాగుకు అనువైన నేలలు.!