Ganoderma Root rot in Lemon – గానోడెర్మావేరు కుళ్లు తెగులు :- ఈ తెగులు గానోడెర్మా లూసిడం అను పుట్టకొక్కుల జాతికి సంబంధించిన శీలింద్రం వలన కలుగుతుంది. వర్షాకాలంలో చెట్టు మొదలు పై ఈ తెగులు లక్షణాలు ఎక్కువగా కనిపించును. తెగులు లక్షణాలు ముందుగా నేలలో చెట్టు యొక్క ప్రక్క వేర్లలో ఆగుపించును. వేర్ల బెరడు పై తెల్లని దారపు పోగుల లాగా శీలింద్రపు పెరుగుదల కనిపించును. తరువాత ముదురు గోధుమ రంగులోనికి మారును. నెమ్మదిగా శీలింద్రము కాండము మొదలు వరకు వ్యాపించును. తరువాత ఈ శీలింద్రము చెట్టు మొదలుపై భూమికి దగ్గర పుట్టగొడుగులు రూపంలో తెగులు సోకిన భాగాలు చాలా తేలికగా ఉండి నీటిని పీల్చుకొనుటవలన మొత్తగా ఉండును. ఈ శీలింద్రము పూతికాహారంగా నేలలోని కొయ్య భాగాల పై జీవిస్తుంది.
తెగులు సోకిన భాగాలనుండి బెసీడియో స్పోర్స్ విడుదల చేయుటవలన గాలి ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపించును. ఈ తెగులు నిమ్మ, చీని, బత్తాయి, మోసంబిలకే గాక మామిడి, కొబ్బరి, పనస చెట్లకూ సోకుతుంది. నీటి ద్వారా ఈ తెగులు సులువుగా వ్యాపిస్తుంది.
నివారణ:-
చనిపోయిన లేక కుళ్ళిపోయిన మొక్కల మొదల్లను ఏరివేయాలి
మొక్కలకు ఆసరాగా ఏర్పడిన కర్రల మొదల్లను శీలింద్ర నాశినులతో శుద్ధి చేయాలి . పచ్చి రొట్ట ఆకు పంటలను పండించి నేలలో కలియ దున్నాలి.
నిమ్మ, మామిడి, పనస, కొబ్బరి, మొదలగు మొక్కల మొదల్లలో ఏర్పడిన పుట్టగొడుగులు నన్నింటిని పోగుచేసి కాల్చివేయాలి. తెగులు తొలి దశలో , తెగులు సోకిన ఒకటి లేక రెండు ప్రక్క వేర్లను కత్తిరించి తీసివేయాలి. తెగులు సోకి చనిపోయిన మొక్కల చుట్టూ గుంత తీసి వేరే చెట్ల నుండి వేరు పరచాలి.
తెగులు సోకిన చెట్టు నుండి పారే నీరు ఆరోగ్యమైన చెట్టుకు రాకుండా చూడాలి.
Also Read: Biological Herbicides: జీవకలుపు నశినులు లేదా జీవ రసాయన కలుపు మందులు.!
మాక్రోఫోమినా ఫాసియోలిన, ప్యుసేరియం మరియు డిప్లోడియ
ఈ తెగులు సోకిన చెట్టు విపరీతమైన పూత పట్టి వాడి అకస్మాత్తుగా కృశించి పోతుంది. వేర్లపై బెరడు కుళ్లి పీచులాగా ఊడి వస్తుంది. కుళ్లిన వేర్లు కొన్ని నల్లబడతాయి. మాక్రోప్లోమినా శీలింద్రము సోకిన మొక్కలలో ఆకులు పసుపు రంగుకు మారతాయి. డిప్లోడియా శీలింద్రము సోకిన మొక్కలలో వేర్లవై గోధుమ రంగు శీలింద్రపు దారలు పెరుగుదల ఏర్పడి, ముదురు గోధుమ రంగు కలిగిన పుట్టగొడుగులు గుంపులుగా కాండము మొదలు వద్ద ఏర్పడును. కుళ్లిన వేర్లు ఒక రకమయిన వాసన కలుగచేయును. నీటి తడుల్ని క్రమబద్దం చేయునపుడు , సకాలంలో ఎరువులు ఎక్కువ లేదా తక్కువ మోతాదుల్లో వేసినపుడు, నేలలో ఎక్కువ తేమ ఉండి వెర్లకు గాలందనపుడు, వేరు కుళ్లు వచ్చే అస్కారముంది. నిమ్మ, తీయ నారింజ రకాలకు ఈ తెగులు వస్తుంది.
నివారణ :-
నీటి తడుల్ని క్రమబద్దం చేయాలి. సకాలంలో సరియైన మోతాదుల్లో ఎరువులు వేయాలి. జంబేరి బదులు రంగ్ పూర్ నిమ్మ వేరుమూలం ఉపయోగించిన అంట్లు ఈ తెగులును తట్టుకుంటాయి. పాదులు తవ్వినపుడు వేర్లకు గాయాలు పడకుండా చూడాలి. నీటి ఎప్పుడున్న తోటలకి ఎండా కాలంలో పాదుకి 30 -50 కిలోల వేరుశెనగ పొట్టును సమంగా పరచాలి.
తెగులు తొలిదశలో తెగులుసోకిన ఒకటి, రెండు వేర్లను కత్తిరించి నాశనం చేయాలి. కత్తిరించిన వేర్లకు బోర్డ్ పేస్టుతో పూత పూయాలి లేక పది గ్రాముల బావిస్టిన్ మందును పది లీటర్ల నీటిలో కలిపి చెట్టు పాదిలో ఒక చదరపు మీటరకు ఒక లీటరు చొప్పున మందు నీరు పోయాలి.
15 రోజులకు మరో మారు అదే మందు నీటిని పాదుల్లో పోయాలి. నీరు కట్టిన 12నుండి 24 గంటల తరువాత మందు నీరు పోయాలి.
Also Read: Fertilizers Adulteration: ఎరువులలో కల్తీని గుర్తించే పరీక్షలు.!