Fall Army Worm in Maize Crop: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో రైతులు సాగు చేస్తున్న ప్రధానమైన పంటలలో మొక్కజొన్న ముఖ్యమైనది. ఈ పంటను రైతులు యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న చీడపీడల సమస్యలలో ‘‘కత్తెర పురుగు’’ ముఖ్యమైనది. ఈ పురుగు ఆశించడం వలన రైతులు, దీని ఉదృతి ఎక్కువైనప్పుడు నష్టపోయే అవకాశం ఉన్నందున, రైతులు సకాలంలో ఈ పురుగు యొక్క ఉధృతి, నష్టపరిచే విధానం, లక్షణాలు తెలుసుకొని మరియు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే, మంచి దిగుబడులు పొందవచ్చునని వివరించారు.

Fall Army Worm in Maize Crop
నష్టపరిచే విధానం :
. కత్తెర పురుగు లార్వా మొక్కజొన్న ఆకులను, కాండాన్ని తింటుంది. మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినుట వలన ఆకులపై తెల్లని పొర ఏర్పడుతుంది. లార్వా పెరుగుతున్న కొద్ది ఆకుల చివరలను తింటూ, ఆకులను కత్తిరించునట్లగా, ఆకులను పూర్తిగా తింటుంది.
. రెండు మరియు మూడవ దశ లార్వాలు ఆకు సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడుతాయి. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి.
. పూర్తిగా ఎదిగిన లద్దె పురుగులు మొక్కను ఎక్కువగా ఆశించి తినటం వలన ఆకులు పూర్తిగా నష్టపోయి కేవలం కాండం మాత్రమే మిగిలిపోతుంది. పంటను చూస్తే మొత్తం కత్తిరించినట్లుగా కనిపిస్తుంది.
. రెక్కల పురుగు రోజుకు 100 కి.మీ. వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండి, మొక్కజొన్నతో పాటు కూరగాయలు, జొన్న, వేరుశనగ, పొద్దు తిరుగుడు మొదలగు సుమారు 50`100 ఇతర పంటలపై కూడా ఆశిస్తుంది.
జీవిత చక్రం :
. వాతావరణ పరిస్థితులను బట్టి జీవిత కాలం ఒక నెల నుండి 3 నెలల వరకు ఉంటుంది.
. ఆడ రెక్కల పురుగు గుడ్లను సముదాయాలలో (100-200) ఆకుల అడుగు భాగాన పెడుతుంది.
. ఒక్కో ఆడ రెక్కల పురుగు సుమారుగా 1000-2000 గుడ్లను పెడుతుంది.
. గుడ్ల నుండి వచ్చిన లద్దె పురుగు తన పెరుగుదలను 6 దశలలో (గ్రుడ్డు దశ (2-7 రోజులు), పిల్ల పురుగు దశ, లార్వా దశ, లద్దె పురుగు దశ (14-30 రోజులు), కోశస్థ దశ (8-30 రోజులు), మరియు రెక్కల పురుగు దశ (7-21 రోజులు) పూర్తి చేసుకుంటుంది.
Also Read: Prevent Ring Worm in Goats : మేకలలో వచ్చే తామర వ్యాధి ని ఇలా నివారించండి.!
విత్తడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
. విత్తడానికి ముందు ట్రాక్టర్ తో లేక ఎడ్లనాగలితో లోతైన దుక్కి చేసుకోవాలి. దీని వల్ల నెలలోని కత్తెర పురుగు నిద్రావస్థ దశ అయిన ప్యుపాలు సూర్యరశ్మి బారిన పడి చనిపోతాయి. లేదా పక్షులు ఆశించి తినటం వల్ల పురుగు ఉధృతి పైరుపై చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్యూపా నుంచి వచ్చే ఒక్కొక్క తల్లి పురుగు 1500`2000 గుడ్లు పెట్టే అవకాశం ఉన్నది. ప్యుపాలను నాశనం చేయటం ద్వారా వీటిని నివారించవచ్చు. అలాగే వర్షపు నీరు ఎక్కువగా ఇంకి పైరు బెట్టకు త్వరగా రాకుండా కాపాడుతుంది.
. విత్తనాన్ని ముందుగా సేకరించుకొని, విత్తుటకు 24 గంటల ముందు సయంట్రానిలిప్రోల్‌ంథయామిథాక్సమ్ కేజి మొక్కజొన్న విత్తనానికి 4 మి.లీ. చొప్పున విత్తనశుద్ధి చేసుకోవాలి. తద్వారా పంటను 15 నుంచి 20 రోజుల వరకు కాపాడుకోవచ్చు.
. ఒకవేళ జీరో టిల్లేజ్ లో మొక్కజొన్న వేసుకున్నట్లయితే, ఒక హెక్టారుకు 500 కేజీల వేప పిండిని వేసుకోవాలి.
. విత్తడానికి ముందు పొలంలో ఉన్న కలుపు మొక్కలను మరియు ఇతర మొక్కలను తీసివేసి, పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
. కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుకొనుటకు సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి.
. సకాలంలో విత్తుకోక, విడతల వారిగా విత్తుకోవడం తప్పదు అన్నప్పుడు, విత్తిన మొదటి నుండి, ప్రతి వారానికి ఒకసారి 5% వేపగింజల కషాయం లేదా వేపనూనె 1500 పిపిఎమ్ ఏ 5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
విత్తిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
. విత్తనం మొలకెత్తక ముందు ఎకరానికి 5 లింగాకర్షక బుట్టలు పెట్టి, పురుగు యొక్క ఉధృతిని తెలుసుకొని తగిన చర్యలు చేపట్టాలి.
. లేత మొక్కజొన్నలో (30 రోజుల వరకు) ఎకరానికి 10 నుండి 15 వరకు లింగాకర్షక బుట్టలను పైరుకు ఒక అడుగు పై వరకు ఉండునట్లు అమర్చుకోవాలి. ఆకర్షించిన మగ రెక్క పురుగులను నాశనం చేయాలి.
. లేత మొక్కజొన్నలో (30 రోజుల వరకు) ఎకరానికి 10 చొప్పున పక్షులు వాలటానికి ‘%ు%’ ఆకారపు కర్రలను అమర్చుకోవాలి.
. మొక్కజొన్నలో సిఫారసు చేసిన ఎరువులను న మోతాదులో వేసుకోవాలి. ఎకరానికి 80-96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పోటాష్ వేసుకోవాలి. తద్వారా మొక్కజొన్న ఏపుగా పెరిగి కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.
. పైరులో 45 రోజుల వరకు కలుపు లేకుండా ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.
పంట 30 రోజులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
. పొలంలో గ్రుడ్లు గమనించిన వెంటనే పురుగు గ్రుడ్లను, మొదటి దశ పిల్ల పురుగులను నివారణించుటకు, వేప సంబంధిత మందులైన అజాడిరక్టిన్ (1500 పిపిఎమ్) 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
. రెండవ దశ దాటిన లార్వాల నివారణకు ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
. పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నచో, ఎదిగిన లార్వాల నివారణకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ. లేదా స్పైనటోరమ్ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా లింగాకర్షక బుట్టల ద్వారా పురుగుల ఉధృతిని గమనించి, ఉధృతి 5-10% ఉంటే, బ్యాసిల్లాస్ తూరింజెనిసిస్ 2 గ్రా. లీటరు నీటికి లేదా మెటారైజియం ఎనైసోప్లియ లేదా బెవెరియా బ్యాసియానా 5 గ్రా. లీటరు నీటికి కలిపి సాయంకాలం వేళలో పిచికారీ చేయాలి.
. ఎకరానికి 10 కిలోల చొప్పున పొడి ఇసుక మరియు సున్నం 9:1 నిష్పత్తిలో కలిపి మొక్కజొన్న సుడులలో వేసుకున్నచో ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి.
పంట 30-65 రోజులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
పొలంలో 10 % నష్ట పరచిన మొక్కలు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పైన చెప్పిన మందులనే అవసరాన్ని బట్టి మార్చి మార్చి పిచికారీ చేసి ఒకటి రెండవ దశ లద్దె పురుగులను నివారించుకోవచ్చును లేదా ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎర వాడాలి.

Fall Army Worm
విషపు ఎర తయారీ విధానం :
ఎకరానికి 10 కిలోల తౌడు, 2 కిలోల బెల్లం తీసుకొని, బెల్లంను 2-3 లీటర్ల నీటిలో కరిగించి తర్వాత తౌడులో కలిపి మిశ్రమాన్ని 24 గంటలు పులియనిచ్చి అరగంట ముందు ఈ మిశ్రమాన్ని 100 గ్రా.ల థయోడికార్బ్ మందును కలిపి విషపు ఎరలను మొక్క సుడిలో వేసుకోవాలి.
పంట 65 రోజుల కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
. 65 రోజుల కాలంలో అనగా పూత దశలో మొక్కజొన్న పైరుకు పురుగులను తట్టుకునే శక్తి ఉంటుంది.
. దిగుబడిలో ఆర్థిక నష్టపరిమితి తక్కువ పురుగు మందులు పెద్దగా పనిచేయవు.
. ఎదిగిన లార్వాలను మనుషులతో ఎరించి కిరోసిన్ డబ్బాలలో వేసి చంపివేయాలి.
. విషపు ఎరను వేసుకోవాలి.
పురుగు మందుల పిచికారిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
. మందు ద్రావణం మొక్క సుడిలో పడునట్లుగా సాయంకాలం వేళలో పిచికారీ చేయాలి.
. అవసరమైనచో పైన చెప్పిన మందులను మార్చుతూ 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
. పంట కాలంలో రెండు లేక మూడు సార్లు మాత్రమే క్రిమిసంహరక మందులను వాడాలి.
. ముఖం, ముక్కు, నోరు, కళ్ళు మరియు చేతులపై పురుగు మందు పడకుండా జాగ్రత్తలు పాటించాలి.
. ముఖ్యంగా తీపి కండె రకాలను మందు పిచికారి చేసిన 15 రోజుల వరకు తెంపకూడదు.
Also Read: Silkworm Chawki Rearing: చాకీ ఆకు నాణ్యత ఎలా ఉండాలి.!
Also Watch: