చీడపీడల యాజమాన్యం

Wild Pigs Destroying Crops: పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను ఇలా తరిమి కొట్టండి..!

0
Wild Pigs
Wild Pigs

Wild Pigs Destroying Crops: వివిధ పంటలలో కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కలు, ఎలుకలు, పక్షులు మాదిరిగానే అడవిపందుల వలన కూడా నష్టం వాటిల్లుతుంది. ఆహార పంటలైన వరి, మొక్కజొన్న, జొన్న, నూనెగింజ పంటలైన వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, వాణిజ్య పంటైన చెఱకు మరియు వివిధ కూరగాయ పంటలు, పండ్ల జాతి పంటలపై అడవి పందులు దాడిచేసి, తినడం ద్వారా పంటలకు నష్టం కలిగించటంతో పాటు పరోక్షంగా వాటి సంచారం. ద్వారా కూడా పంటలను ధ్వంసం చేస్తాయి.

Wild Pigs

Wild Pigs

అడవుల విస్తీర్ణం తగ్గడం వలన పంటలకు వీటి వలన అధికంగా నష్టం వాటిల్లడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వీటికి ఘ్రాణశక్తి అధికం. దూరం నుండే వివిధ పంటల ఉనికిని పసిగడతాయి. ఇవి గుంపులుగా రాత్రివేళల్లో లేదా ప్రాతః కాల సమయంలో మాత్రమే పంటలపై దాడి చేస్తాయి. వీటి నష్టాన్ని నివారించడానికి సమగ్ర నివారణ పద్ధతులను అవలంభించాలి.

భౌతిక పద్ధతులు :

  1. ఎ. పొలం చుట్టు కంచె (Fencing).
  2. ఎ) ఇనుప ముళ్ళ తీగె కంచె (Barbed wire Fencing)
  3. బి) వలయాకార ముళ్ళ కంచె (Ranger Fence)
  4. సి) ఇనుప వల కంచె (Chain Thin Fence)
  5. డి) సౌరశక్తి ఫెన్స్ (సోలార్ ఫెన్స్)

పై కంచెలను పొలం గట్టు వెంబడి పంటకు ఒక అడుగు దూరంలో వెదురు గడలు (లేదా) సిమెంట్ స్తంభాల సహాయంతో ఒక అడుగు నుండి 3 అడుగుల ఎత్తువరకు బిగించి కట్టినట్లైతే అవి అడవిపందులు ప్రవేశాన్ని నిరోధిస్తాయి. సౌరశక్తి పెన్సింగ్ పద్ధతిలో సోలార్ ప్లేట్ల ద్వారా 12 వోల్టుల విద్యుత్న ఉత్పత్తి చేసి స్వల్ప మోతాదులో వైర్ల ద్వారా ప్రసారం చేయుట ద్వారా అడవిపందులకు షాక్ తగిలి అవి పొలాలలోనికి ప్రవేశించవు.

జీవ కంచెలు (Bio Fencing) : ఈ విధానంలో పొలం చుట్టూ 4-5 వరుసలలో కుసుమ (లేదా) ఆముదం పంటలను వేసుకోవటం ద్వారా కుసుమ పంటకు ఉండే ముళ్ళు, ఆముదం వాసన గిట్టక అవి పొలంలోనికి ప్రవేశించవు. అలాగే వివిధ ముళ్ళజాతి మొక్కలు రేగు, అగేవ్, కాక్టస్, గచ్చకాయ, వాక్కాయ వంటి వాటిని పొలం చుట్టూ నాటడం ద్వారా కూడా అడవి పందులను పంట పొలాలలోనికి ప్రవేశించకుండా నిరోధించవచ్చు.

Wild Pigs Destroying Crops

Wild Pigs Destroying Crops

కందకం త్రవ్వు పద్ధతి (Trench Method) : పంట పొలం చుట్టూ ఒక అడుగు దూరంలో గట్టు వెంబడి రెండు అడుగులు వెడల్పు, ఒకటిన్నర అడుగు లోతైన కందాలను త్రవ్వడం ద్వారా అడవిపందులు పొలంలోనికి ప్రవేశించలేవు.

వల పద్ధతి : 6 అడుగులు వెడల్పు కలిగి, 1000 మి.మీ.ల గళ్ళు కలిగిన నైలాన్ వలను పంట పొలంచుట్టూ వెదురు బొంగులు /సర్విదుంగల సహాయంతో 3 అడుగుల ఎత్తు ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే అవి ఒక గోడ వలె ఉంటూ పంటలను అడవిపందుల బారినుండి రక్షిస్తుంది.

రసాయనిక పద్ధతులు :

ఫోరేట్ గుళికలు : 200 గ్రా.ల ఫోరేట్ గుళికలను ఒక కిలో పొడి ఇసుకలో కలిపి దాని ఒక గుడ్డ సంచిలో కాని (లేదా) చిన్న చిన్న రంధ్రాలు చేసిన ప్లాస్టిక్ సంచిలో మూటగట్టి పొలం చుట్టూ ఒక అడుగు దూరంలో 3 మీ.కు ఒక మూట చొప్పున కర్రలు పాతి వ్రేలాడ గట్టినట్లయితే (60-100 సెం.మీ.ల ఎత్తులో) దాని వాసనకు అడవిపందులను పారద్రోలవచ్చు.

Also Read: Transmissible Gastro Enteritis in Pigs: పందులలో ట్రాన్సిమిసబుల్ గ్యాస్ట్రా ఏంటి రైటిస్ వ్యాధి కి ఇలా చికిత్స చెయ్యండి.!

క్రుళ్ళిన కోడిగుడ్ల ద్రావణం పొలం చుట్టూ పిచికారీ : క్రుళ్ళిన (లేదా) మామూలు కోడిగ్రుడ్ల ద్రావణాన్ని 20 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పంట పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పులో చదును చేసిన తడి భూమిపై పిచికారీ చేసిననూ అడవిపందులను పారద్రోలవచ్చు. ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ ద్రావణం వాడితే మంచి ఫలితాలుంటాయి.

కిరోసిన్ ద్రావణంలో 2 గంటలపాటు కాటన్ నవార్ను ముంచి ఆరబెట్టి పంట పొలం చుట్టూ కర్ర దుంగలను పాతి 3 వరుసలలో అడుగు ఎత్తువరకు చుట్టుకోవటం ద్వారా అడవి పందులను పారద్రోలవచ్చు.

గంధకం పంది క్రొవ్వు మిశ్రమాన్ని కొబ్బరి తాడుకి పూసి పైన తెలిపినవిధంగా 3 వరుసల పొలం చుట్టూ చుట్టుకోవటం ద్వారా కూడా అరికట్టవచ్చు.

జీవ ఆర్తనార పద్ధతి (Bio Acoustic Method): ఈ పద్ధతిలో సింహాలు, పులులు, చిరుతలు, అడవికుక్కలు వంటి క్రూర మృగాలు జంతువులను వేటాడేటప్పుడు చేసే గాండ్రింపు శబ్దాలను ప్రత్యక్షంగా రికార్డ్ చేసి వాటిని స్పీకర్ల సహాయంతో పంట దగ్గరలో బాగా వినిపించేటట్టు ప్రసారం చేసినట్లయితే అడవిపందులు ఆశబ్దాలకి భయపడి దూరంగా పారిపోతాయి.

పైన తెలిపిన పద్ధతులే కాకుండా సాంప్రదాయ పద్ధతులైన ఊరపందుల పెంట ద్రావణాన్ని పిచికారీ చేయడం లేదా వాటి పేడతో తయారైన పిడకలను కాల్చి పొగ బారించటం, వెంట్రుకలను పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పు చల్లటం, పొలం చుట్టూ చీరలు కట్టడం, టపాకాయలను రాత్రి వేళల్లో కాల్చడం, వేటకుక్కలతో తరమడం వంటివి కూడా ఆచరించి అడవి పందులను పారద్రోలవచ్చు.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Protect Crop From Wild Pigs: అడవి పందులు పొలంలోకి రాకుండా ఉండాలి అంటే ఇలా చేయండి.!

Also Watch :

Leave Your Comments

Gladiolus Flower Cultivation : గ్లాడియోలస్‌ సాగు, సస్యరక్షణ.!

Previous article

Harms of Soft Drinks: సాఫ్ట్ డ్రింక్స్ తరచుగా తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే!

Next article

You may also like