చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

ధాన్యం పురుగు పట్టకుండా  నిల్వచేసే సంచుల గురించి మీకు తెలుసా ?

0

insect-proof bags for storing grain? : 
బియ్యం, పిండి,పప్పులు, ఇతర ధాన్యాలను పురుగు పట్టకుండా ఇంట్లో నిల్వచేసుకోవడం చాల కష్టంగా ఉందని తరచుగా వింటుంటాం.రైతులు కూడా తమ ఉత్పత్తులను పురుగు పట్టకుండా నిల్వచేసుకునేందుకు ఎన్నో తంటాలు పడుతుంటారు.ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని హెర్మెటిక్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు.

Stored Grain Pests and Current Advances for Their Management | IntechOpen

ఈ బ్యాగుల్లో పప్పు దినుసులు,బియ్యం,రాగులు,జొన్నలు,గోధుమల వంటివి పురుగు పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు.రెండు,మూడు పొరలతో ఉండే ఈ బ్యాగుల్లో ఎటువంటి పురుగు పట్టకుండా సంవత్సరం పాటు ధాన్యం, పప్పుదినుసులు చెడిపోకుండా ఉంటాయి. తేమ శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది. గోనెసంచిలా ఉండే ఈ బ్యాగు లోపలికి ఎటువంటి గాలి,తేమ పోకుండా రెండు లేదా మూడు పొరలతో ఉంటుంది. పైపొరను పాలిప్రొపెలిన్ తో,లోపలి పొరలను పాలిథీన్ తో చేస్తారు.

ఒకసారి కొనుగోలు చేసిన ఈ సంచిని నాలుగైదు సంవత్సరాలపాటు వాడుకోవచ్చు. వివిధ పరిమాణాలలో అంటే … 5 కిలోల నుంచి 50 కిలోల సైజు వరకు ఈ బ్యాగులు లభ్యమవుతాయి.వీటి ఖరీదు సైజును బట్టి సుమారు రూ. 150/- నుంచి 300/- దాకా ఉంటుంది.ఈ సంచుల్లో విత్తనాలు సంవత్సరం నిల్వ ఉంచిన  తర్వాత కూడా 75 శాతం విత్తనాలు మొలకెత్తుతాయి.అందువల్ల రైతులు తాము నిల్వ చేసే ధాన్యాలకు,విత్తనాలకు పురుగు పట్టకుండా ఈ సంచులు ఎంతో ఉపయోగపడుతాయని ఆశించుదాం.

Leave Your Comments

ఆంధ్రప్రదేశ్ లో పశువైద్యశాలల పనివేళల్ని మార్చాలి !

Previous article

మంచి యాజమాన్యం తో అన్ని పత్తి రకాలు ఒకే రకమైన దిగుబడినిస్తాయి …

Next article

You may also like