చీడపీడల యాజమాన్యం

Diseases In Green gram And Black gram:పెసర, మినుము పంటల్లో తెగుళ్ళ సమస్య నివారణ చర్యలు.!

0
Green Gram and Black Gram
Green Gram and Black Gram

Diseases In Green gram And Black gram: రాష్ట్రo లో పండించే అపరాల పంటలలో పెసర, మినుము ముఖ్యమైనవి. పెసర 4.55 నుంచి 6.81 లక్షల హెక్టార్లు. మినుము 5.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వీటిని ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో పండిస్తున్నప్పటికీ పెసర సాగు ఎక్కువగా తెలంగాణ. రాయలసీమ ప్రాంతాలలో ఖరీఫ్లో, మినుము సాగు ఎక్కువగా కోస్తా ఆంధ్రలో రబీలో జరుగుతుంది. పెసర, మినుము స్వల్పకా లపు పంటలు. వీటిలో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు తప్పకుండా సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

Diseases In Green gram And Black gram

Diseases In Green gram And Black gram

వేరుకుళ్ళు తెగులు: ఈ తెగులు మొలక దశనుంచి పూత, కాత దశలవరకు పైరును ఆశించవచ్చు. తెగులు తొలిదశలో ఆకులు పసుపు రంగుకు మారి క్రమేపీ మొక్క ఎండిపోతుంది. వేర్లు, నేల మట్టానికి దగ్గరగా ఉన్న కాండం భాగం నల్లబడి కుళ్ళిపోతుంది. ఇటువంటి మొక్కలను వేర్లనుంచి నిలువునా చీల్చి చూస్తే లోపలి కణ జాలం ఎరుపు రంగుకు మారి కనిపిస్తుంది. చిన్న మొలకలలో కాండం, వేళ్లు పూర్తిగా కుళ్ళి మొక్క చనిపోతుంది. అధిక ఉష్ణోగ్రత, అనావృష్టి పరిస్థితులు ఈ తెగులు ఉదృతికి దోహదపడతాయి. భూమిలో తగినంత తేమ ఉంటే ఈ తెగులు స్థాయి చాలా తక్కు నగా ఉంటుంది.

పెసరలో ఎల్ జిజి-407, మినుములో ఎల్.బి.జి-61] (కొత్త (బుట్ట మినుము), ఎల్.బి.జి.168, ఎల్.బి.జి-618 రకాలకు రోగనిరోధక శక్తి ఉంది. కిలో విత్తనానికి 4 గ్రా. ట్రైకోడెర్మా విరిడి ఫార్ములేషన్+ 3 గ్రా. మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ధి ని చేస్తే ఈ తెగులు ఉధృతిని కొంతవ రకు అరికట్టవచ్చు తెగులు తీవ్రత ఎక్కువగా ఉండే నేలల్లో తప్పనిసరిగా పంటమార్పిడి పాటించాలి.

బూడిదతెగులు: ఈ తెగులు రబీపంటలో ఎక్కు వగా ఆశిస్తుంది. పైరు పూత దశలో ఆకులపైన తెల్లటి బూడిద వంటి చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమంగా పరిమాణంలో పెరిగి ఆకు కిందివైపు కూడా ఆక్రమిస్తాయి. తెగులు తీవ్రత పెరిగేకొద్దీ ఆకుల పైభాగం, కింది భాగం కూడా పూర్తిగా బూడిద వంటి శిలీంద్రపు తో కప్పి ఉంటుంది. ఫలితంగా ఆకులు ఎండిపోతాయి. కాయల సంఖ్య, గింజల పరిమాణం తగ్గుతుంది. దిగుబడులు గణనీయంగా పడిపోతాయి.

Also Read: Green gram Varieties: పెసర రకాలు – వాటి లక్షణాలు.!

పెసరలో పూసా-9072, టి.ఎ.ఆర్. ఎమ్-1 రకాలు, మినుములో కృష్ణయ్య (ఎల్.బి.జి-17) రకం ఈ తెగులును తట్టుకుంటాయి. తెగులు ఆశించిన వెంటనే 15 రోజుల తర్వాత మరోసారి లీటరు నీటికి కార్బెండా జిమ్ ఒక గ్రాము లేదా థయోఫొనేట్ మిథైల్ ఒకగ్రాము లేదా ట్రైడిమార్చ్ రం ఒక మి.లీ. లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. చొప్పున కలిపి పైరుపై పిచికారి చేసి ఈ తెగులును చాలా సమర్థంగా నివారించవచ్చు.

ఆకుమచ్చ తెగుళ్ళు: గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. ఆకుమచ్చ తెగుళ్ళలో సర్కో స్పోరా ఆకుమచ్చ, ఆంత్రక్నోస్, కొరినోస్పోరా ఆకుమచ్చ తెగుళ్ళు ముఖ్యమైనవి

సర్కోస్పోరా ఆకుమచ్చ: పైరు పూత, పిందె దశలో ఆకుల పైభాగంలో గోధుమ రంగులో గుండ్రటి చిన్నమచ్చలు ఈనెల మధ్య భాగంలో ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేపి సైజు పెరిగి రాగి రంగు అంచుతో, మచ్చ మధ్యభాగంలో తెలుపు రంగులో ఉంటాయి. ఆకుల పైన అధిక సంఖ్యలో ఈ మచ్చలు ఏర్పడితే ఆకులు వాడి, ఎండి రాలిపోతాయి. కాయల సంఖ్య, గింజల పరిమాణం తగ్గి, దిగుబడులు తగ్గుతాయి.

ఆంత్రక్నోస్: ఈ తెగులు మొక్క అన్ని భాగాలకు పైరు ఏ దశలోనైన ఆశించవచ్చు.

Anthracnose

Anthracnose

తెగులు సోకిన మొక్కల ఆకుల అడుగు భాగంలో ముదురు గోధుమ లేక నల్లటి రంగులో గుండ్రటి మచ్చలు ఏర్పడ తాయి. తెగులు ఉధృతి పెరిగేకొద్దీ మచ్చల సంఖ్య పెరిగి పెద్దవై దాదాపు 15-20 మి.మీ. పరిమా ణంలో ఆకుల పైభాగాన్ని, అడుగు భాగాన్ని ఆక్రమిస్తాయి. ఫలితంగా ఆకులు పండి, రాలిపోతాయి. మొలక దశలో తెగులు ఆశిస్తే మొక్కలు ఎదగక కుంగిపోతాయి. ఆకు తొడిమలు, కాండం, కాయలపైన కూడా ఈ తెగులు ఆశించవచ్చు. దీనివల్ల గింజలు సరిగా నిండక దిగుబడులు తగ్గుతాయి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Red Gram Health Benefits: మందులు అవసరం లేకుండా – కందులతో మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.!

Must Watch:

Leave Your Comments

Jasmine Cultivation: మల్లె సాగులో మెళుకువలు.!

Previous article

Cabbage and Cauliflower Cultivation: క్యాబేజి, కాలీఫ్లవర్ సాగులో మెళుకువలు.!

Next article

You may also like