చీడపీడల యాజమాన్యం

Citrus Gummosis Managment: నిమ్మ బంకకారు తెగులు “గమ్మోసిస్” నిర్వహణ.!

2
Gummosis Managment
Gummosis Managment

Citrus Gummosis Managment: ఈ వ్యాధికి ఫైటోఫ్తోరా నికోటియానే వర్. పారాసిటికా, పి. పల్మివోరా, పి. సిట్రోఫ్తోరా అనబడే పలు శిలీంద్రాలు కారణం. నీటిపారుదల క్రమ పద్దతిలో లేకపోవడం, కాండం నీటిలో ఎక్కువ సమయం ఉండడం, తడిచిన కాండానికి గాయాలు కావడం లేదా కాండం తొలుచు పురుగు ఆశించి గాయం చేయడం చెట్లను వ్యాధులకు గురి చేస్తుంది.

Citrus Gummosis Managment

Citrus Gummosis Managment

తేలికపాటి నేలల్లో కంటే నల్ల నేలల్లో ఎక్కువగా వస్తుంది. అధిక నీటి మట్టం అధిక సంఘటనలకు దారితీస్తుంది. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంటుంది. తక్కువ మొగ్గలు కలిగిన చెట్లు ఎక్కువగా ప్రభావితమవుతాయి.

Also Read: Integrated Pest Management: సమగ్ర సస్య రక్షణ అమలులో వ్యూహాలు.!

Citrus

Citrus

నివారణ చర్యలు

  • తగినంత నీటి పారుదల, మురుగునీరు పోవు సౌకర్యం ఉన్న సరైన స్థలాన్ని ఎంచుకోవడం ముఖ్యం. అధిక మొగ్గలు కలిగిన అంట్లను ఎంపిక చేసుకోండి (30 నుండి 45 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ).
  • కాండం తేమను తాకకుండా నిరోధించడానికి చెట్టు కాండం చుట్టూ 45 సెంటీమీటర్ల లోపలి వలయాన్ని చేసి, దాని ద్వారా నీటిపారుదల చేపట్టడం. ఈ పద్దతిని డబుల్ రింగ్ పద్ధతి అంటారు. ఈ పద్ధతి వలన ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి కూడా చెందకుండా చూసుకోవచ్చు.
  • అంతర కృషి కార్యకలాపాల సమయంలో వేరుకు లేదా కాండం యొక్క మొదలు భాగానికి గాయాలు కాకుండా ఉంచుకోవాలి. ప్రవర్ధనం కోసం వ్యాధికి నిరోధక శక్తి గల ప్రసిద్ధ/వాణిజ్య రకాలైన పుల్లని నారింజ లేదా ట్రైఫోలియేట్ నారింజ వేరు కాండం ఉపయోగించండి.
Gummosis Managment

Gummosis Managment

  • బోర్డియక్స్ పేస్ట్ లేదా ZnSO4, CuSO4, సున్నం (5:1:4)తో కనీసం సంవత్సరానికి ఒకసారి నేల మట్టం పైన దాదాపు 60 సెం.మీ. ఎత్తులో పూసుకోవాలి.
  • వ్యాధి సోకిన భాగాన్ని గీరి/ఉలి తీసి కాల్చేయాలి.
  • కత్తిరించిన ఉపరితలాన్ని బోర్డియక్స్ పేస్ట్‌తో పూసి వ్యాధి కారకాలనుండి రక్షించండి, తర్వాత ఫోసెటైల్-అల్ 0.2%తో పిచికారీ చేయాలి. లేదా 0.2% మెటాలాక్సిల్ (మెటలాక్సిల్+మాంకోజెబ్ = రిడోమిల్ MZ 72)తో మట్టిని తడిపడం మంచిది. ఇలా చేయడం వలన వ్యాధి బీజాలు నిర్వీర్యమవుతాయి.
  • ట్రైకోడెర్మా విరిడిని వేపపిండితో కలిపి పూర్తిగా చివికిన పేడను వేసుకోవాలి.

Also Read: Tamarind cultivation: చింత సాగులో నాటే పద్ధతులు

Leave Your Comments

Integrated Pest Management: సమగ్ర సస్య రక్షణ అమలులో వ్యూహాలు.!

Previous article

Deep Soils Management: దున్నే అపుడు మీ ట్రాక్టర్ ఎందుకు కూరుకుపోతుందో కారణం తెలుసుకోండి.!

Next article

You may also like