Caster Diseases – లక్షణాలు: ఆముదపు మొక్క ఆకులు నెమ్మదిగా లేక హటాత్తుగా పసుపు వర్ణానికి మారి ఈ ఆకులు మొక్కనుండి వేలాడుతూ పైకి ముడుచుకొని ఉంటాయి. తర్వాత ఆకులు ఎండిపోయి పూర్తి మొక్క గాని కొన్ని కొమ్మలు గాని చనిపోవడం జరుగుతుంది. ఆకుల ఈనెల మధ్యలో ఇటుక వర్ణపు మచ్చలు ఏర్పడుతాయి. చనిపోయిన మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపల కణజాలాలు కృళ్లడము కాండంపై భాగమునకు కూడా వ్యాపిస్తుంది. ఈ దశలో కొమ్మ మరియు కాండంపు పై భాగాలు పరిశీలించినప్పుడు వాటిపై తెలుపు లేక గులాబి వర్ణపు శిలీంధ్ర పెరుగుదల కనబడుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 17-30 సెం. గ్రే మధ్యలో ఉన్నప్పుడు మరియు నేల ఉష్ణోగ్రత 22-25 సెం. ఈ తెగులు ఉదృతం అవుతుంది. ఈ శిలీంధ్రం నేలలోను మరియు పంట అవశేషాల్లో జీవిస్తుంది.
నివారణ: ఆముదం పైరు కోసిన తర్వాత మొక్కల అవశేషాలను తీసివేసి నాశనం చెయ్యాలి.తెగులు సోకిన మొక్కలను గుర్తించిన వెంటనే తీసివేసి కాల్చి వెయ్యాలి.ఎండాకాలంలో నేలలను లోతుగా దున్నాలి.నీరు నిలిచే నేలలు మరియు పల్లపు ప్రాంతాలలో ఆముదం సాగు చేయాలి.. పొలంలో వీలయినంత ఎక్కువగా పశువుల ఎరువును వేయాలి. పంట మార్పిడి పద్దతిన కనీసం 2-3 సంవత్సరాలకొకసారి పాటించాలి. ఇందుకుగాను సజ్జ పంటను ఎన్నుకోవాలి.తెగులు తట్టుకునే రకాలయిన జ్యోతి, జి.పి. హెచ్ 4, జ్యాల వంటి రకాలను హెచ్-4, సాగుచేయాలి.పాలంలో వర్షపు నీరు నిలువకుండా జాగ్రత్త వహించాలి.తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.అంతర పంటగా కంది వేయడం ద్వారా కొంతవరకు తెగులు ఉధృతిని తగ్గించవచ్చు.కిలో విత్తనానికి 3 గ్రా॥ కార్బండిజం లేదా థైరామ్ కలిపి విత్తన శుద్ది చేయాలి.
Also Read: Watershed Facts: నీటి పరీవాహక ప్రాంతం గురించి ముఖ్య విషయాలు తెలుసుకోండి.!
కాయకుళ్లు తెగులు
లక్షణాలు: ఈ తెగులు ముఖ్యంగా ఆమదం గెలపైన లేక కొన్ని కాయలపై కూడా ఏర్పడవచ్చు. మొదట గెలలోని కొన్ని కాయలపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడుతాయి. తర్వాత ఈ వ్యాధి అన్ని గింజలకు ప్రాకుతుంది. తెగులు సోకిన భాగాలపై దూది పింజ లాంటి బూడిద లేక గోధుమ వర్ణపు శిలీంద్రపు పెరుగుదలకు చూడవచ్చు. ఈ శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన కాయలు మెత్తబడి కృల్లిపోతాయి. ముదిరిన కాయలు కూడ వ్యాధి సోకినప్పుడు కృళ్లి రాలిపోతాయి. పువ్వులపై ఈ శిలీంద్రం ఆశించడం వలన పూతపట్టకుండపోయి నల్లగా మారుతాయి. ఆరోగ్యవంతమైన ఆకులు తెగులు సోకిన భాగాలను తాకటం వలన కొన్నిసార్లు తెగులు ఆకులపై కూడా వ్యాపిస్తుంది. ఆకులపై గోధుమ వర్ణపు చారలు కనపడుతాయి. కంకి కాడ పై మరియు శాఖలపై కూడా ఈ తెగుళ్లు ఆశించటo వలన వ్యాధి సోకిన ప్రాంతాల్లో ఇవి విరిగి పడిపోతుంది. ఆముదము యొక్క గెల వేసే సమయంలో గాలిలో తేమ అధికంగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రత 22 సె. గ్రే. కన్న తక్కువగా చెదురు ముదురుగా వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.
నివారణ: పంట అవశేషాలను తీసివేసి తగులబెట్టాలి. తేగులు సోకిన గెలలను ఏరి పొలానికి దురంగా వేసి తగులబెట్టాలి.పాలంలో మొక్కలను మరీ దగ్గరగా నాటరాదు.కిలో విత్తనానికి 3-4 గ్రా॥ కార్బండిజం మందు కలిపి విత్తన శుద్ధి చేయాలి.పూత సమయం నుండి వాతావరణ సూచనలకు అనుగుణంగా వర్షం పడుటకు కనీసం 6-8 గంటల ముందు కార్బండిజం 1 గ్రా॥ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వర్షాలు తగ్గిన వెంటనే మరలా 0.1శాతం కార్బండిజం మందు పిచికారీ చేయాలి.వర్షాలు తగ్గిన తర్వాత ఎకరానికి 20 కె.జీల యూరియ 10కిలోల మ్యురేట్, ఆఫ్ పొటాష్ పై పాటుగా వేస్తే తర్వాత వచ్చే గెలలు ఆరోగ్యవంతంగా వస్తాయి.
Also Read: Nutrient Deficiencies in Turmeric Crop: పసుపు పంటలో కలిగే పోషక పదార్ధాల లోపాలు – నివారణ