Cashew Stem Borer: డ్రై ఫ్రూప్ట్స్ లో జీడీ పప్పుడి ప్రత్యేక స్తానం. అధిక లాభాలు ఆర్జించే పంట గనక దీనిని తరుచుగా డాలర్ ఎర్నింగ్ క్రాప్ అని కూడా పిలుస్తారు. ఇది ఉభయ గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, ఖమ్మం, మెదక్ జిల్లాలలో సాగు చేస్తున్నారు. దీనికి మన దేశ మార్కెట్ లోనే కాకుండా ప్రపంచ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటం వలన చాలా మంది రైతులు దీని సాగుకి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చాలా మంది రైతులు మాత్రం అధిక దిగుబడి సాధించుటలో విఫలమయి జీడీ మామిడి సాగు ఆశాజనకంగా లేదని అంటున్నారు. దీనికి కారణం వారు సమగ్ర సస్య రక్షణ చర్యలను జీడీ మామిడి పంటకు ఆపాదించకపోవడమని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ పంటలో వివిధ కీటకాలు ఆశించినా వేరు మరియు కాండం తొలుచు పురుగు ఎక్కువ విస్తీర్ణంలో పంట నష్టం చేకూరుస్తుంది. దీనిని సరిగ్గా నివారించుకోవడం వలన పంట నష్టం తగ్గించవచ్చు.

Stem Borer
వేరు మరియు కాండం తొలుచు పురుగు కొలియాప్టెరా క్రమానికి చెందిన పెంకుపురుగు. దీని స్పర్శకాలు మిగతా పెంకు పురుగులకన్నా పొడవుగా ఉంటాయి.ఇది పూర్తిగా ఎదిగిన చెట్టుని కూడా నాశనం చేయగలదు.సంవత్సరం పొడువునా పంటను ఆశించినా డిసెంబర్ నుండి మే నెలలలో తీవ్రత అధికం. పట్టించుకోకుండా, వయసు మళ్ళిన తోటలలో ఈ పురుగు ఉదృతి ఎక్కువ.
\తల్లి పురుగు గోధుమ రంగులో ఉండి, కాండం మీద బెరడుకి ఉన్న పగుళ్లలో లేదా వేర్ల పైన గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుండి పొదిగిన లార్వాలు మొదట కాండాన్ని తొలిచి, తరువుత వేరు లోపలకు వెళ్లి తింటుంది. ఇలా తినడం వలన కాండం మరియు వేరుకి రంధ్రాలు ఏర్పడుతాయి. ఈ రంధ్రాలు మొత్తం విసర్జకాలతో నిండి ఉంటాయి. ఈ రంధ్రాలు బయటకు కనపడకుండా మూసేస్తుంది. అందుకే దీనిని జాగ్రత్తగా గమనించి గుర్తించాలి.
Also Read: వంగ పంటను ఆశించే పురుగులు-నివారణ పద్ధతులు

Cashew Stem Borer
దీని నష్ట విధానం వలన పైనున్న కొమ్మలకు పోషాకాలు అందక ఆకులు పసుపుగా మారుతాయి, కొమ్మలు ఎండిపోతాయి,చెట్టు చనిపోతుంది.ఈ పురుగు ఆశించిన చెట్లను రక్షించడం కష్టతరం. ముందు నుండి పురుగు ఆనవాళ్ల కోసం గమనిస్తూ తదానుసార జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగు కాండాన్ని ఆశించినపుడు ఇనుప చువ్వతో లాగి చంపేయాలి. బంక కారే చెట్ల నుండి బెరడుని తీసేసి కిరోసిన్ తో కడిగి తారును నింపి మూసేయాలి. లేదా బెరడు పీకిన చోటున 10 మీ.లి క్లోరిపైరీఫోస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
చెట్టు శుభ్రం చేసే సమయంలో వచ్చిన చెట్టు భాగాలు, మల పదార్థాలు మంటలో వేసి కాలబెట్టాలి. ఇలా చేయడం వలన ఇతర చెట్లకు సోకకుండా అరికట్టవచ్చును. పూర్తిగా చనిపోయిన చెట్ల వేర్ల వరకు తవ్వి అహ్హ్ గుంటలో చెత్త వేసి కాలబెట్టాలి.
Also Read: బెండ పంట లో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు యాజమాన్యం