BPH Management in Direct Seed Paddy: నేరుగా వరి విత్తే పద్దతిలో వరి వత్తుగా ఉంటె కలుపు సమస్యతో పాటుగా సుడిదోమ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున కలుపుతో పాటుగా దోమ నివారణ చేపట్టడం అనివార్యం. ఈ పురుగు ఉదృతి విత్తిన 30 రోజుల నుండి 90 రోజుల వరకు ఉంటుంది.జులై చివరి వారం నుండి ఆగష్టు నెల వరకు ఆశించి నష్టపరుస్తుంది. పిల్ల మరియు పెద్ద దోమలు మొక్క కాండం మీద నీటి పై భాగములో గుంపులుగా చేరి రసం పీల్చడం వలన లేత పైరు గోధుమ రంగుకి మారుతుంది.
Also Read: How to Save Water: జలాల పరిరక్షణ ప్రతి పౌరుని భాద్యత.!
నీటి పైన తెట్టెలాగా తేలియాడుతూ ఉంటాయి. ఉదృతి అధికంగా ఉంటె పీరు సుడులుగా ఎండిపోతుంది. దీనిని ఆంగ్లంలో “హాప్పర్ బర్న్” అని పిలుస్తారు. కొన్ని సందర్భాలలో పంట పూర్తిగా ఎండిపోతుంది. ఇది ప్రత్యేక్షంగా నష్టం కలుగ చేయడమే కాకుండా, “గ్రాసీ స్టంట్” అనబడు వైరస్ ను వ్యాప్తి చేస్తుంది.
నివారణ :
1. వానాకాలం లో తూర్పు పడమర దిశలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలి బాటలు తీసుకోవాలి.
2. క్లోరిపైరిఫోస్, ప్రొఫెనోఫోస్ వంటి సింథటిక్ పైరిథ్రోయిడ్లు వాడరాదు. ఇవి దోమ ఉదృతిని పెంపొందించుతాయి.
3. దోమ పోటు గుర్తించిన తొలి దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఇతోఫెన్ ప్రాక్స్ 2.0 మి.ల్లి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
4. ఉదృతి ఎక్కువగా ఉన్నట్లైతే బుప్రొఫెజిన్ 1.6 మి.ల్లి లేదా పైమెట్రో జెన్ 0.6 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్+ఎథిప్రోల్ 0.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లైతే దోమను అదుపు చేయవచ్చు.
గమనిక : దోమ పోటుకు మందులు పిచికారీ చేసుకునే ముందు పాయలు చేసుకుని మొక్క మొదలు వద్ద మాత్రమే పిచికారీ చేసుకున్నట్లైతే మంచి ఫలితాలు వస్తాయి.
Also Read: Rytu Bandhu in Mulugu: ములుగు జిల్లా రైతులకు తీపి కబురు.!