చీడపీడల యాజమాన్యం

Boar Control in Crops: పంటలలో అడవి పందుల బెడద ఎకోడోన్ చెక్

0

Boar Control in Crops: పంటలలో చీడపీడలే కాకుండా అడవి పందుల బెడద కూడా చెప్పుకోదగ్గ నష్టం చేస్కురుస్తుంది. వీటిని నివారించడం కష్టతరమే కాకుండా ఖర్చుతో కూడుకున్న పని. పందులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మీ పంటలను రక్షించుకోవడానికి సులభమైన విషరహిత – పర్యావరణ హిత , అత్యంత ప్రభావవంతమైన పద్ధతి.

Boar Control in Crops

Boar Control in Crops

ఏకోడాన్ రసాయనం అయినప్పటికీ విషపూరితం కాదు, అలాగే దీని ప్రభావం పంటని తినకుండా మాత్రమే ఆపగలదు కానీ జీవాలకు ఎటువంటి హాని చేకూర్చదు. కావున అహింస పద్ధతిగా పేర్కొనవచ్చును. ప్రస్తుతం ఇది చాలా విజయవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మోతాదు / తగినంత ప్రాంతం: 1 హెక్టారుకు అనగా 2.5 ఎకరాలు1 లీటర్ సరిపోతుంది. ఇది వాడటం వలన అడవి పందులను కనీసం 30 రోజులు తిప్పికొట్టవచ్చు.పందుల నుండి ఎలాంటి నష్టం వాటిల్లదు.

Also Read: అడవి పందుల దాడి నుండి పంటల్ని ఈ పద్ధతులని ఉపయోగించి రక్షించుకోవాలి.!

అడవి పందులకు ఉపయోగించు విధానం:

I) తాడు పద్ధతి –
1. ECODON ను 2 లీటర్ల నీటిలో కరిగించాలి.
2. 1 లేదా 2.5 ఎకరాల భూమిని కవర్ చేయడానికి తగినంత పొడవు గల పత్తి లేదా జనపనార తాడును తీసుకోని, ఒక బకెట్లో నీటిని తీసుకుని పై ద్రావణంలో నానబెట్టాలి.

Crop

Crop

3. గమనిక: ఎకోడాన్ ద్రావణంలో తాడును కనీసం 2:30 నుండి 3 గంటల వరకు నానబెట్టడం)
4. బాగా నానాకా చేను చుట్టూ ఒక అడుగు ఎత్తులో (భూమి నుండి దాదాపు 30 సెం.మీ.) గట్ల చుట్టూ తాడును కట్టాలి.
5.మెరుగైన ఫలితాల కోసం పొలం చుట్టూ తాడులను వాటి మధ్య 1 అడుగు ఎడం రెండు అంచెలుగా కట్టాలి.
6. వారానికోసారి స్ప్రేయర్‌ని ఉపయోగించి తాళ్లపై సాధారణ నీటిని చల్లాలి.దీని వలన దీర్ఘకాల తీవ్రత ఉంటుంది.

ECODON

ECODON

ECODON ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
అత్యంత ప్రభావవంతమైన మరియు ఫలితం ఆధారిత ఉత్పత్తి చేయవచ్చు.ఇది చాలా సౌకర్యవంతంగా, ఉపయోగించడానికి సులభమైనది.ఎలాంటి విషపూరిత పదార్థాలను కలిగి ఉండదు కావున జీవులను చంపలేదు.పర్యావరణానికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవు.మానవులకు మరియు జంతువులకు ఎటువంటి హాని కలిగించదు.ధీర్ఘకాలం పాటు ప్రభావవంతంగా ఉంటుంది.తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. పంటలకు ఎలాంటి నష్టాలు వాటిల్లవు.

Also Read: అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతు వినూత్నపరిష్కారం..

Leave Your Comments

Bird Management in Sunflower: పొద్దు తిరుగుడు పంటలో పక్షుల యాజమాన్యం

Previous article

Water Management in Mustard: ఆవాల పంటలో నీటి యాజమాన్య పద్ధతులు

Next article

You may also like