Black gram Diseases- చిత్త పురుగులు:- ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంద్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు సరియైన సమయంలో నీవరించకపోతే 30 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ. లేదా ఎసిఫేట్ 1.0 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కంత తడిచేలా పిచికారీ చేయాలి.
రసం పీల్చు పురుగులు:-
తెల్ల దోమ:- తెల్ల దోమలు ప్రత్యేక్షంగా మొక్కల నుండి రసాన్ని పీల్చడమే గాక పరోక్షంగా వైరస్ తెగళ్ళును వ్యాప్తి చేసి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భగాన చేరి రాసాన్ని పీల్చడం వలన మొక్కలు గిడసబారుతాయి. అంతేగాక తేనె లాంటి జిగట పదార్దాన్ని విసర్జించడం వల్ల నల్లటి బూజు ఏర్పడి, కిరణజన్య సంయోగక్రియ జరిగే శక్తిని కోల్పోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఇవి మొక్క తొలి దశలో అధిక నష్టాన్ని కలిగించి పల్లాకు తెగులు వ్యాప్తిలో కీలకపాత్రను పోషిస్తాయి. మొక్కల ఆకులు పసుపు రంగుకు మారి ఎదుగుదల లేక పూత కాయ మందగించి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1.0గ్రా లేక . ట్రైజోఫాస్ 1.5 మి. లీ. లేక అసిటామిప్రిడ్ 0.2 గ్రా చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
తామర పురుగులు:- తల్లి , పిల్ల పురుగులు పైరు తొలిదశలో ఆకుల అడుగు భాగంలో చేరి రాసాన్ని పీల్చడం వలన పంటకు 10-20శాతం నష్టాన్ని కలుగజేయడమే కాకుండా మొవ్వు కుళ్ళు లేక ఆకు ముడతను కలిగించే వైరస్ తెగులు ను వ్యాప్తి చేస్తాయి. ఆకులు ముడతలు పడి వంకరలు తిరిగి మొక్కాలు వడలి క్రమేసిఎండిపోతాయి.దీని నివారణకు ఫిప్రోనీల్ 1.5 మి. లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి. లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
Also Read: Black gram Pests: మినుము పంటలో వచ్చే తెగుళ్లు ఏంటి? వాటి నివారణ కోసం ఏం చేయాలి.!
మారుక మచ్చల పురుగు:- దీనినే గూడు పురుగు లేక పూత పురుగు అనీ కూడా అంటారు. ఈ పురుగు మొగ్గ, పిందె దశలలో ఆశించి పంటకు ఎక్కువ గా నష్టం కలుగచేస్తుంది. ఈ పురుగు పూమొగ్గలపై , లేత ఆకులపై , పిందలపై గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు పూమొగ్గల లోపలకి చొచ్చుకొని పోయి లోపల లేత భాగలను గుడుగా కట్టి కాయలకు రంద్రం చెసి లోపల గింజలను తినడం వలన పంటకు 10 నుండి 80 శాతం వరకు నష్టం కలుగుతుంది. కావున పైరు పూత దశకు రాకముందు నుంచే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
నివారణ:- పొలం గట్ల పై కలుపు మొక్కలు లేకుండా పీకి నాశనం చేయాలి.
పంట పూమొగ్గ దశలో 5మి. లీ. వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన తల్లి పురుగుల గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేగాక అప్పటికే పంట మొక్కల పై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
పంటలో గుళ్ళు గమనించినట్లయితే నోవల్యూరాన్ 10 ఇ. సి 1.0మి.లీ. లేదా క్లోరీపైరిఫాస్ 20ఇ. సి 2.5మి. లీ. మందులలో ఏదో ఒక దానితో ఊదర స్వభావం గల డైక్లోరోవాస్ 50 ఇ. సి 1.0 మి. లీ. ను. కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే 5-10 రోజుల వ్యవధిలో 2-3 మందులను మర్చి పిచికారీ చేయాలి. పరుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు రినాక్సిఫిర్ 0.3 మి. లీ. లేదా ఇమామెక్టీన్ బెంజోయేట్ 5 ఎస్. జి. 0.4గ్రా. లేదా స్పైనోశాడ్ 45 ఎస్. సి 0.3 మి. లీ. లేదా ప్లుబెండియమైట్ 40 ఎస్ సి.0.2 మి. లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పొగాకు అద్దె పురుగు:- ఈ పురుగు అనేక రకాల పంటలను ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన గుడ్లను గుంపుగా పెట్టి వాటిని వెంట్రూకలతో కప్పుతుంది. గుడ్ల నుండి పొదిగిన మొదటి దశ గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోని పత్ర హరితాన్ని గోకి తినడం వలన జల్లెడాకులు ఏర్పడతాయి. పెరిగిన పురుగులు ఆకులను పూర్తిగా తినివేసి ఈ నెలను మాత్రమే మిగులుస్తాయి. పురుగు ఉదృతీ ఎక్కువ గా ఉన్నప్పుడు రెండు మూడు రోజులు పంటను గమనించకుండా సస్యరక్షణ చేపట్టకుండా ఉన్నట్లయితే ఆకుల ఈ నెలను మాత్రమే మిగిలి, పూత, కాయ ఏర్పడక తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.
నివారణ:- గుడ్లు సమూహము మరియు మొదటి దశ పిల్ల పురుగులు ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. లింగాకర్షక బుట్టలను ఎకరాకు నాలుగుచొప్పున అమర్చుకొని పురుగు ఉనికిని మరియు ఉదృతీని తెలుసుకోవాలి. రోజుకు 15-20 రెక్కల పురుగులు వరుసగా మూడు రోజులు పాటు ఒక్కొక్క బుట్టలో గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు ఉదృతీ ఎక్కువగా ఉన్నప్పుడు థయోడికార్బ్ 1.5 గ్రా లేదా నోవల్యూరాన్ 1.0 మి. లి. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి. లి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
Also Read: Black gram Varieties: వరి మాగాణికి అనువైన మినుము రకాలు వాటి గుణగణాలు గురించి తెలుసుకుందాం.!