Biological Herbicides: జీవకలుపు నశినులు అనగా కొన్ని రకాల శీలింద్రలను, సూక్ష్మజీవులను పొడిరూపంలో ఉత్పత్తి చేసి మాములు కలుపుమందులవలే పొడి లేదా ద్రవరూపంలో కొన్ని సూచించిన పంటలలో కలుపు నిర్మూలనకు స్ప్రేచేసేవి. వీటినే ఆంగ్లంలో బయోహెర్బీసైడ్స్, మైకో హెర్బీసైడ్స్,బాక్టీరియా హెర్బీసైడ్స్ అని కూడ పిలుస్తారు. మాములుగా జీవరాశులను ఉపయోగించి కలుపు నిర్మూలించే పద్ధతి కన్నా ఇది పూర్తిగా భిన్నమైనది. మాములు పద్ధతులలో పురుగులను , తెగుళ్ళను కలుపు ఉన్న చోట వదిలితే ఆవి నెమ్మదిగా వృద్ధిచెంది ఉన్న కలుపును నిర్మూలిస్తాయి. ఈ జీవరసాయన కలుపు మందులు మాత్రం మాములు రసాయన మందుల వలె మొలిచి వున్నా కలుపు నిర్మూలించుటకు పైర్లలో స్ప్రే చేస్తే అవి త్వరితంగా వృధి చెంది కొద్ది రోజుల్లోనే కలుపు నిర్మూలన జరుగుతుంది.
Also Read: Important Herbicide Properties: కొన్ని ముఖ్యమైన కలుపు మందుల లక్షణాలు.!
ఉపయోగాలు :-
ఎక్కువ విచక్షణ శక్తి కలిగి కేవలం కొన్ని రకాల కలుపును నిర్మూలించును.
పైరుకు ఎటువంటి హాని ఉండదు.
కలుపు మొక్కలు ఈ రకం మందులను తట్టుకొనే అవకాశం లేదు.
సాధారణ రసాయనాల వల్లే వాతావరణం, భూమిలో ఎటువంటి అవశేషాలు ఉండవు. మనుషులకు, పశువులకు చాలా సురక్షితం
రసాయన మందులలో పోలిస్తే వీటి ఉత్పత్తి ఖర్చు తక్కువ
పర్యావరణానికి హాని చేయవు.
నష్టాలు :-
రసాయనాలతో పోలిస్తే కలుపు నిర్మూలన కొంచెం నెమ్మదిగా ఉంటుంది.
వీటి పనితనం పొలంలో వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది.
ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి మాములు జీవరాశులతో పోలిస్తే ఎక్కువ, కాని రసాయనలతో పోలిస్తే తక్కువ.
ప్రతి కలుపు మొక్కకు ప్రత్యేకమైన జీవనాశిని కావలసి వస్తుంది.
ఇవి సాధారణంగా మొలిచిన కలుపు మొక్కను మాత్రమే నిర్ములింస్తాయి. కాబట్టి కలుపు మొలవకుంగా నిరోధించుట సాధ్యం కాదు.
వీటి కాలపరిమితి తక్కువగా ఉంటుంది.
రసాయన మందులు, పురుగు మందులతో కలిపి స్ప్రే చేయుట కుదరదు.
Also Read: Classification of Herbicides: కలుపు మందుల వర్గీకరణ గురించి తెలుసుకోండి.!