Mungi Insect in Rice : కాండం తొలుచు పురుగు వరి పంట మీద కనిపించే అతి ముఖ్యమైన పురుగు. ఇది ఖరీఫ్ మరియు రబీలో కూడా పంటను ఆశిస్తూ ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది Monophagous pest అనగా ఒకే పంటను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది.
గుర్తింపు చిహ్నాలు: ఈ పురుగులు లైంగిక ద్విరూపకత (Sexual Dimorphism) కలిగి ఉంటాయి. అనగా ఆడ పురుగులు మరియు మగ పురుగులను కొన్ని గుర్తింపు చిహ్నాల ద్వారా లింగ భేదం చేయవచ్చు.ఆడ పురుగు మగ పురుగు కన్నా పెద్దగా, లావుగా వుండి లేత పసుపు రంగులో ఉంటుంది. ఆడ పురుగు మొదటి జత రెక్కల పైన మధ్యలో ఒక నల్లటి చుక్క ఉంటుంది.
ఆడ పురుగు ఉదరము ఆఖరి ఖండితం పైన వెంట్రుకల కుచ్చు ఉంటుంది. దీనిని ovi positor hair అంటారు.మగ పురుగు ముందు రెక్కలపై నల్లటి మచ్చ ఉండును. లద్దె పురుగు లేత పసుపు రంగులో పచ్చగా ఉండి తల మరియు ప్రాగ్యక్షము గోధుమ రంగులో ఉంటుంది.
లక్షణాలు : గ్రుడ్డు నుంచి వచ్చు లద్దె పురుగులు కొన్ని గంటల పాటు ఆకులపై తిరుగుతూ ఊలు దారంతో వేలాడుతాయి. ఇవి ఆకుల తొడిమిలోకి ప్రవేశించి కంకులను తింటూ కాండం లోపలికి చేరి, లోపలి భాగాన్ని తింటాయి. ఈ పురుగులు వరి పంటను పిలకలు వేసే దశ మరియు చిరుపొట్ట దశలలో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. పిలక దశలో ఆశించినచో మొవ్వు చనిపోవుతుంది. దీనిని Dead heart అంటారు. ఇటువంటి మొవ్వును లాగితే తేలికగా వూడి వస్తుంది. మొవ్వును చీల్చి చూసినట్లయితే దానిలో లద్దె పురుగు గాని, అది విసర్జించిన మలం గాని కనబడుతుంది.మొక్క మొదలులో లద్దె పురుగులోనికి వెళ్ళి చేసే రంద్రం కనబడుతుంది.పైరు చిరుపొట్ట దశలో, కంకి బయటకు వచ్చే దశలో ఉన్నప్పుడు పురుగు ఆశించినట్లయితే తయారవుతున్న గింజలకు పోషక పదార్థాలు అందక తాలు గింజలుగా మారి తెల్ల కంకి” ఏర్పడుతుంది. దీనిని Whitehead అంటారు.మామూలు కంకులు గింజ బరువుకు తల వాల్చి సహజ వర్ణం కలిగి ఉంటాయి. కాని పురుగు ఆశించిన కంకులు తెల్లగా నిటారుగా నిలబడి దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి.
జీవిత చక్రం : ఒక తల్లి పురుగు 300 గుడ్లను (గోధుమ రంగు వెంట్రుకలతో కప్పిన గుడ్లను) చిన్న చిన్న గుంపులుగా ఆకుల చివరి భాగంలో పెడుతుంది.
ఈ గుడ్లను పసుపు రంగు కలిగిన ఊలుతో కప్పి ఉంచుతుంది. ఒక్కొక్క గుడ్డు సముదాయంలో 15 నుండి 80 వరకు ఉంటాయి.
Also Read: Rodent Management in Rice: వరి లో ఎలుకల నియంత్రణ యాజమాన్య పద్ధతులు .!
నివారణ చర్యలు : పురుగులను తట్టుకొనే రకాలైన రత్న, సస్యశ్రీ, వికాస్, గౌతమి, 1.R-20, 1.R-26,R.P-2815 రకాలను సాగు చేయాలి.పంటను కోసిన తర్వాత దుబ్బులను తీసి నాశనం చేయాలి.నాటడానికి ముందు నారు చివరలను తుంచి గుడ్లు సముదాయాలను నాశనం చేసినట్లయితే పురుగు బెడదను కొంత వరకు తగ్గించవచ్చు. వీలైన చోట్ల దీపపు ఎరలను అమర్చాలి.క్లోరోఫైరిఫాస్ 20% EC 2ml ఒక లీటరు నీటిలో కలిపి ఆ ద్రావణంలో వారు కట్టలను 12 గంటలు ఉంచినట్లయితే నాటిన తర్వాత 20 నుంచి 25 రోజులు వరకు పంటను కాపాడుకోవచ్చు. ఒక చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు మరియు ఒక గుడ్ల సముదాయం 5% చచ్చిన మొవ్వులు ఉన్నట్లయితే పురుగు మందు పిచికారి చేయాలి.క్లోరిఫైరిపాన్ 20% EC 2ml ఒక లీటరు నీటికి లేదా ఫాస్ఫోమిడాన్ 40% EC 2m 1 లీటరు నీటికి లేదా ఎసిఫేట్ 15% SP1.5 గ్రా/లీటరు నీటికి లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2m / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Rice Grain Moisture Content: వరి గింజలలో గల తేమ శాతం ఎలా తగ్గిస్తారో తెలుసుకోండి.!
Must Watch: