Tissue Culture: వాణిజ్య పంటల్లో చెరకు ఒక ప్రధాన పంట. ఇటీవలి పంట పురుగులు, తెగు ళ్ళకు లోనుకావడం, తద్వారా దిగుబ డులు గణనీయంగా తగ్గడం గమని స్తున్నాం. చెరకులో గడల నుంచి వ్యాపించే తెగుళ్ళు, పురుగులు ఎక్కు వగా ఉంటాయి. వీటిని అధిగమించడానికి ఒక ప్రత్యామ్నాయ పద్ధతి టిష్యూకల్చర్ (కణజాల వర్ధనం).

Tissue Culture
ఈ విధానంలో వేల మొక్కలను జన్యుస్వచ్ఛత దెబ్బతినకుండా ఏకరీతిగా, బలమైన, తేజస్సు కలిగిన, ముఖ్యమైన తెగుళ్ళు అనగా ఎర్రకుళ్ళు, గడ్డి దుబ్బుతెగులు ఆశించనటువంటి మొక్కలను ప్రయోగశాలలో ఉత్పత్తి చేయవచ్చు. ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ దేశాల్లో ఈ పద్దతి ద్వారా వాణిజ్య పరంగా చెరకు మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు. భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఈ పద్ధతి ప్రాచుర్యం పొందుతుంది.
జీవపదార్థాలు, కణాలు, కణజా లాలు లేదా భాగాలను ప్రత్యేకంగా పత్యామ్నాయ పద్ధతి తయారుచేసిన పదార్థంలో సూక్ష్మ జీవరహిత స్థితిలో పెంచినప్పుడు అవి పూర్తి మొక్కలను ఇస్తాయి. ఇది వృక్ష కణాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ విధంగా కొత్త మొక్కలను తయారుచేసే ప్రయోగ పద్ధతులన్నింటిని టి కలిపి టిష్యూకల్చర్ (వృక్ష కణజాల త్తి వర్ధనం)గా పిలుస్తారు. టిష్యూ కల్చర్ ద్వారా సమర్థవంతమైన, వ్యాధి రహిత మొక్కలను చౌకగా తయారు చేయవచ్చు. మొక్కల కాండం శిఖరాగ్రాన్ని వాడి వైరస్ రహిత, ఆరోగ్యవంతమైన మొక్కలను తయారుచేయడం దీని ద్వారా సాధ్యమవుతుంది.
Also Read: Tissue Culture: తక్కువ సమయంలో అధిక దిగుబడి కోసం టిష్యూ కల్చర్ పద్ధతి
లాభాలు: టిష్యూకల్చర్ మొక్కలు జన్యు స్వచ్ఛత కలిగి నూటికి నూరు శాతం తల్లి మొక్కలను పోలి ఉంటాయి. రకాల పునరుత్పత్తి వేగవంతంగా ఉంటుంది. మొక్కలన్నీ ఏకరీతిగా వైరస్ తెగుళ్ళ రహితంగా ఉంటాయి. అధిక మొలక శాతం (95 శాతం) కలిగి ఉంటాయి. త్వరగా మొలకెత్తుతుంది. మొక్కలోని గడలన్నీ ఒక్కసారిగా పక్వానికి వస్తాయి.

Tissue Culture Benefits
అందువల్ల దిగు బడి, పంచదార రికవరీ పెరుగుతుంది. చెరకు దిగుబడి 20-2 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. మొక్కలను ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్ళడం చాలా సులభం. టిష్యూ కల్చర్ మొక్కలు సంవత్సరం మొత్తం తయారు చేయ వచ్చు. కావున రైతుకు ఎప్పుడు అవ సరం వస్తుందో అప్పుడు మొక్కలని సరఫరా చేయవచ్చు. విత్తన వృద్ధి రేటు సాంప్రదాయ పద్ధతి కంటే చాలా ఎక్కువ.
సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది, సూక్ష్మజీవరహిత స్థితిని కలుగు చేయాలి. కణజాల వర్ధనం ద్వారా ఏర్పడిన మొక్కలు నాజూకుగా, సున్నితంగా ఉంటాయి. వీటిని సహజ వాతావరణ పరిస్థితులకు అలవాటు చేసి ఇస్తారు.
Also Read: Tissue Culture: టిష్యూ కల్చరల్ మొక్కల పెంపకం.!
Must Watch: