Pelargonium Graveolens Cultivation: పన్నీరు మొక్క 2 అడుగుల ఎత్తువరకు పెరిగే బహువార్షిక జాతికి చెందిన గుబురు మొక్క దీని తైలాన్ని ఖరీదైన సబ్బులు, పరిమళాలు మరియు సౌందర్య సాధనాల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
నేలలు: నీరు నిలువలేని, తేలికపాటి నుండి లోతైన ఎర్రనేలలు అనుకూలం. నల్లరేగడి భూములు ఈ పంట సాగుకు పనికిరావు.
సాగుకు అనువైన ప్రాంతాలు: పన్నీరు మొక్క సాగుకు మన రాష్ట్రంలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, విశఖపట్నం మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు అనుకూలం. నల్లరేగడి భూములు ఈ పంట సాగుకు పనికి రావు.
ప్రవర్ధనం: కొమ్ముల నుండి గాని లేక పేర్లు కలిగిన కాండపు ముక్కల ద్వారా గాని ప్రవర్ధనం చేస్తారు.. వారు మూక్కల కొరకు ఎత్తైన నారుమళ్లను సెప్టెంబర్-అక్టోబరు మాసాల్లో కార్బండైజిమ్ మరియు ఆక్సిక్లోరైడ్ మందులతో సీల శుద్ధి చేసి తయారు చేయాలి. ఏపుగా పెరిగిన ఆరోగ్యమైన మొక్కల్ కొమ్మల చివరి భాగాల్ నుండి షుమారు 10-15 సెం.మీ పొడవైన ముక్కలను కత్తిరించాలి.
పై భాగాన 2. 3 ఆకులు వదిలి మిగిలిన ఆకులను తీసివేసి, అడుగు భాగాన ఏటవాలుగా కోసి 1 గ్రా. కార్బండైజిమ్ లీటరు నీటికి కలిపిన ద్రావణంలో మరియు 2000 పి.పి.యం. (2 గ్రా/లీ. నీరు) ఐ.బి.ఎ ద్రా వణంలో కత్తిరించిన ముక్కల ఆడుగు భాగలు 2-3 నిమిషాలు ముంచి, రెండు కణుపులు సీలలోకి పోవునట్లు, నారుముడిలో నాటుకోవాలి. ప్రతి దినం తేలికపాటి తడుల నివ్వాలి. నాటిన 30 నుండి 40 రోజుల్లో వేళ్ళు వచ్చి మొక్కలు నాటటానికి సిద్ధంగా ఉంటాయి.
Also Read: Coconut Fruit Drop: కొబ్బరిలో పిందెలు రాలటాన్ని ఇలా నివారించండి.!
నాటేకాలం: వేళ్ళు వచ్చిన మొక్కలను నారుముళ్ళ నుండి తీసి అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు వరుసల మధ్య 60 సెం.మీ. మొక్కల మధ్య 45 సెం.మీ. ఎడమిచ్చి నాటు కోవాలి. ఒక ఎకరాకు నాటటానికి షుమారు 15,000 మొక్కలు అవసరం.
నవంబరు చివరి వారం నుండి జనవరి మొదటి వరకు నేరుగా కొమ్మకత్తిరింపులను పొలంలోనే నాటుకోవచ్చు.
ఎరువులు: ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 30 కిలోల యూరియా, 80 కిలోల్ సూపర్ ఫాస్పేట్ మరియు 20 కిలోల్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కిలో వేయాలి. నాటిన 2 నెలల తర్వాత ఎకరాకు 30 కిలోల యూరియా వేయాలి. అలాగే ప్రతి కోత తర్వాత అంతే మోతదులో యూరియా చేయాలి.
నీటి యాజమాన్యం: మొక్కలు నాటిన వెంటనే నీటి తడి నివ్వాలి. ఒక నెల రోజుల వరకు ప్రతి 3 రోజులకొకసారి నేరుపెట్టాలి. తరువాత వారం రోజుల వ్యవధిలో నేల మరియు వాతావరణాన్ని బట్టి నీరు పెట్టుకోవాలి. స్ప్రింక్లర్ పద్ధతి కూడ పాటించి నేరు పెట్టుకోవచ్చు.
అంతరకృషి: మొక్కలు నాటిన 2 నుండి 3 నెలలు వరకు పంటలో ఎటువంటి కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట కోసిన ప్రతిసారి ఒక నెల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ఎండుతెగులు: ఇది పంటకు అపార నష్టం కలిగిస్తుంది. తెగులు సోకిన ఆకులు పసుపు పచ్చగా మారి, కొమ్మలు వాడి క్రమేపి మొక్క అంతా వాడి, ఎండినట్లు కనిపిస్తుంది. పేరు నల్లబడి పోతుంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి పారవేసి, మిగితా మొక్కల మీద, మరియు మొదలు చుట్టు 0.1 శాతం (1 గ్రా. లీటరు నీటిలో కలిపి) కార్బండైజిమ్ మందును లేక బెనోమిల్ ద్రావణాన్ని పిచికారి చేయాలి.
పంటకోత: నాటిన 5 నుండి 6 మాసాల తర్వాత పంట మొదటి కోతకు వస్తుంది. తదుపరి పంటకోతలు 3 మాసాలకొకసారి తీసుకోవచ్చు. ఈ విధంగా పంటలను 2 నుండి 3 సంవత్సరాల వరకు లాభదాయకంగా తీసుకొనవచ్చు. పదునైన కొడవళ్ళను ఉపయోగించి మొక్క లేత భాగాలను మరియు కొన్ని ఆకులను మాత్రమే వదిలి మిగతా కోమ్మ లను ఆకులను పూర్తిగా కోసుకోవాలి. పంట కోసేటప్పుడు మొక్కల కుదుళ్ళు కదల కుండ జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను పూర్తిగా నేల మట్టం వరకు కోయరాదు. పంటకోసిన పతిసారి 0.1 శాతం కార్బండైజిమ్ లేక బెనోమిల్ ద్రావణంతో పిచికారి
నూనె తీనె విధానం: పన్నీరు మొక్కల నుండి డిస్తిలేషన్ పద్ధతి ద్వార నూనెతీస్తారు. తాజాగా కోసిన పంటను యంత్రంలొ వేసి నూనెను కండెన్సర్ పద్ధతి ద్వారా పేరు పర్పాలి. నూనెలో నేరు, ఇతర పదార్థాలు లేకుండ జాగ్రత్తలు తీసుకొని శుబ్రపరిచిన నూనెను గాజు OR అల్యూమినియం లేక స్టీల్ డ్రమ్ముల్లో భద్రపరచాలి.
ఆదాయం: పన్నీరు మొక్క పమ్ నుండి ఎకరాకు సంవత్సరానికి 8 నుంచి 10 కిలోల నూనె మరియు తద్వారా ఎకరాకు రెండవ సంవత్సరం నుండి రూ.20,000 – 25,000 వరకు నికరాదాయం లభిస్తుంది.
Also Read: Tulasi Cultivation: తులసి సాగులో మెళుకువలు.!