Paddy Nursery Management: రాష్ట్రవ్యాప్తంగా సాగుచేసే ప్రధాన ఆహార పంట వరి, దాని పెరుగుతున్న జనాభాకు ఆహారం, పశువులకు మేత మరియు గ్రామీణ ప్రజలకు ఉపాధిని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో 22 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేసే ప్రధాన పంట వరి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు వరి పంటను ఉత్పత్తి చేస్తున్నాయి, వీటిలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం మరియు చిత్తూరు ప్రధాన ఉత్పత్తిదారులు. నిజానికి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి మరియు కృష్ణా మూడు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే మూడు ముఖ్యమైన వరిని ఉత్పత్తి చేసే జిల్లాలు. పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ యొక్క రైస్ బౌల్ గా పరిగణించబడతాయి.
నర్సరీ:
వరి నారుమడిని బాగా దున్ని 2-3 సార్లు దమ్ముచేసి చదును చేయాలి. నీరు పెట్టటానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్ళను తయారు చేస్తే మంచిది. 2 గుంటల (ఐదు సెంట్లు) నారుమడికి 2 కిలోల నత్రజని (1కిలో విత్తనం చల్లేముందు, మరో కిలో విత్తిన 12-14 రోజులకు), 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి.
Also Read: Maize Cultivation: మొక్కజొన్న సాగులో జాగ్రత్త వహించవలసిన అంశాలు
పశువుల పేడను లేదా సేంద్రియ ఎరువులను దుక్కిలో వేయడం చాలా మంచిది.మొలక కట్టిన విత్తనాన్ని చల్లి, మొదట్లో (7 రోజులు) ఆరు తడులు ఇచ్చి, ఆ తర్వాత మొక్క దశలో పలుచగా (2-3 సెం.మీ.,) నీరు ఉంచాలి.జింకు లోపం కు లీటరు నీటికి 2గ్రా., జింకు సల్ఫేటు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలి. మెట్టనారుమడిలో ఇనుప ధాతు లోపాన్ని గుర్తిస్తే సరిచేయాలి. మొక్క వయను మరియు ఎదుగుదలను బట్టి 2 నుండి 5గ్రా.’ అన్నభేది +0.5 – 1 గ్రా. నిమ్మ ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి .నారు పీకే వారం రోజుల ముందు గుంట నారుమడికి (2.5 సెంట్లకు) 400గ్రా., కార్బోప్యూరాన్ 3G గుళికలు ఇసుకలో కలిపి చల్లి పలుచగా నీరుంచాలి. అవసరాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నాట్లు ఆలస్యమయ్యే ప్రదేశాల్లో రెండవ సారి నత్రజనిని ఆలస్యంగా వేసి నారు ముదరకుండా చూడాలి. ఈ పరిస్థితులలో తామర పురుగులను నివారించాలి.
నారుమడిలో బ్యూటాక్లోర్ లేదా ప్రెటిలాక్లోర్ 25 మి.లీ. ఎకరాకు సరిపడా నారుమడికి 5 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారి చెయ్యాలి. బిస్పైరిబాక్ సోడియం కలుపు మందును 0.5 మి.లీ., ఒక లీటరు నీటికి చొప్పున కలిపి విత్తిన 8 10 రోజులకు పిచికారి చెయ్యాలి.
Also Read: Kidney Bean Cultivation: కిడ్నీ బీన్స్ విత్తే సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు