మన వ్యవసాయంసేంద్రియ వ్యవసాయం

Organic Farming Uses: సేంద్రియ వ్యవసాయం

1
Organic Farming
Organic Farming Profits

Organic Farming Uses: సేంద్రియ వ్యవసాయం భారతదేశ రైతులకు క్రొత్త కాదు. అనేక వేల సంవత్సరాలనుండి సేంద్రియ పదార్థాలను భూమి కి అందించి ఆరోగ్యమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తి ని చేసేవాడు. కాల క్రమేణ దేశ జనాభా పెరగడం, వారికీ తగ్గ ఆహార ఉత్పత్తి కొరకు అధిక దిగుబడి వంగడాలను ప్రవేశ పెట్టడం, దానితో బాటు రాసాయనిక ఎరువుల వాడకం, రాసాయనిక పురుగు మందులు వాడకం ఎక్కువ అయి వాతావరణ కాలుష్యం ఏర్పడింది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే ముప్పు తెచ్చే ది గా తయారు అయ్యింది.

ప్రస్తుతం ప్రపంచం దేశాలు సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యత ను గురించి మరల సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుడుతున్నారు. సహజ వనరులైన పోషకాలు సహజ సస్య రక్షణ పద్ధతులు ఉపయోగించి సక్రమ యాజమాన్య పద్ధతులలో పంటలను పండించే విధానాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఒక్క మాట లో చెప్పాలంటే పర్యావరణ ప్రకృతి వనరుల యాజమాన్యమే కాని కృత్రిమ వనరుల వినియోగం కాదు. ఆరోగ్య ఆహార ఉత్పత్తి, కాలుష్య రహిత వాతావరణం, సహజ శ్రేయస్సు ఇందులో ఇమిడి ఉన్నాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, శీలింద్ర నాశిను లు, కలుపు మందులు, గ్రోత్ రేగులేటిర్లు జన్యు మార్పిడి విత్తనాలు వాడకం ఎంత మాత్రం పనికి రావు.చివరకు రసాయనాలతో విత్తిన శుద్ధి కుడా నిషిద్దమే.

Organic Farming Uses

Organic Farming Uses

Also Read: Water Hyacinth Organic Compost Fertilizer: గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు.!

సేంద్రియ వ్యవసాయం లో యాజమాన్యం:-

అవసరమైనంత మేరకే దున్నడం, నేల కోతకు గురి కాకుండా జాగ్రత్త పడడం,

నేల నీరు ను సంరక్షించడం.

వ్యవసాయం తో బాటు పశు పోషణ కు ప్రాధాన్యత ఇవ్వడం

అంతర పంటల సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం

పంట మార్పిడి తప్పని సరిగా పాటించాలి

పచ్చి రొట్ట ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వడం

వ్యవసాయ వ్యర్థాలకు సమర్ధవంతం గా వినియోగించడం

పూర్తిగా కుళ్లిన సేంద్రియ ఎరువులు, వర్మికొంపోస్టు, గోబర్ గ్యాస్ వ్యర్థాలకు వాడడం

పరిశుభ్రమైన సాగు కలుపు నిర్మాలనా యాజమాన్యం

సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు విరివిగా వాడడం

Organic Food

Organic Food

Also Read: Organic Farmer Story: సేంద్రీయ వ్యవసాయం ద్వారా 3 లక్షలు సంపాదిస్తున్న రైతు

సాగు నిటి సద్వినియోగం – యాజమాన్యం
రసాయనాలు వాడకం పూర్తిగా తగ్గించి సహజ వనరుల ద్వారా భూసార పెంపకం
రసాయన మందులు వాడకుండా సస్య రక్షణ యాజమాన్యం
జీవనియంత్రం పద్దతులకు, వృక్ష సంబంధ మందులకు ప్రాధాన్యత ఇవ్వడం
పంట కోసిన తర్వాత వినియోగ దారునికి అందే వరకు ఉత్పతుల నాణ్యత చెడకుండా జాగ్రత్తలు

సేంద్రియ వ్యవసాయం వల్ల లాభాలు:-

కాలుష్య నివారణకు దోహద పడుతుంది.

జీవ వైవిద్యానికి నాంది పలుకుతుంది.

మంచి జన్యు వైవిద్యo ఏర్పడుతుంది

సహజ వనరులు ప్రస్తుత కాలం లో ఉపయోగ పడుట యే గాక రాబోయే తరాల  వారికి కూడా అందుబాటులో ఉంటాయి. పంట నాణ్యత, ఉత్పత్తులు, నిల్వ గుణం పెరుగుతాయి. సురక్షిత ఆహరం లభిస్తుంది. ఆహారం లోనికి విష పదార్థాలు ప్రవేశించే అవకాశం ఉండదు. అధిక పెట్టుబడులు పెట్ట వలసిన అవసరం లేదు. పంట మార్పిడి, అంతర పంటల వల్ల చీడ పిడల ఉధృతి తగ్గి రైతు ఆర్ధికంగా బలపడతాడు.

Also Read: Organic Farming Techniques: సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు.!

Leave Your Comments

Dusters Uses: పొడి మందులు చల్లడంలో డస్టర్ల ఉపయోగాలు.!

Previous article

Tomato Cultivation: టమాటో సాగు.!

Next article

You may also like