Organic Farming Precautions: రసాయనాలు వాడకూడదు
. సైరన విధంగా అంతర పంటలు వేయడం
. పచ్చిరొట్ట ఎరువులకి ప్రాముఖ్యత ఇవ్వడం
. వ్యవసాయ వ్యర్ధాలని సరిగ్గా ఉపయోగించడం.
. పూర్తిగా కుళ్ళిన సేంద్రీయ ఎరువులని వాడాలి
. పంట మార్పిడి ఖచ్చితంగా చేయాలి
. పరిశుభ్రమైన సాగు, కలుపు నిర్మూలన యాజమాన్యం
. పంటకోసిన తర్వాత వినియోగదారునికి అందే వరకు నాణ్యత చెడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
. మొక్కల నుండి లభ్యమయ్యే నూనెలు, లైట్ మినరల్ ఆయిల్స్, గంధకము ప్రాసెస్ చేయాలని రాక్ఫోస్ఫేట్ ఆమ్లా, క్షార భూములని పునరుద్దరించడానికి సున్నం, జిప్సమ్ రాసాయానాలకు పరిమితంగా వాడవచ్చు.
పంట దిగుబడుల సేంద్రీయ వ్యవసాయం పై పరిశోధనా ఫలితాలు :
. సేంద్రీయ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతుండడం వల్ల పలు రకాల పరిశోధనలు చేస్తున్నారు.
. సేంద్రీయ వ్యవసాయంలో వివిధ పంటలు పండిరచడానికి అనుసరించవలసిన పద్ధతి, పోషకాలు ఏవిధంగా అందించాలి, సూక్ష్మజీవులను ఏ విధంగా నివారించవచ్చు, కలుపు యజమాన్యము, మొదలైన అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
. సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టిన తర్వత మొదటి 4 సంవత్సరాలు పరిణామదశ, అందువల్ల దిగుబడులు తగ్గుతాయి. – ఆ తర్వాత నేలలో జీవ సంబంధమైన కార్యకలాపాలు వృద్ధి చెంది దిగుబడులు పెరుగుతాయి.
. ఆచార్య ఎన్‌జిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, గత దశబ్దంగా వరి, చిరుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి మొదలగు పంటలలో సేంద్రీయ సాగు మరియు సహజ సాగు విధానాలపై పరిశోధనలు చేపట్టింది. వివిధ పంటల్లో ముఖ్యంగా చిరుధాన్యాలు వేరుశెనగ, గోగు వంటి పంటల్లో 2`3సంవత్సరాలలో దిగుబడుల స్థిరీకరణ గమనించడం జరిగింది.
Also Read: Useful Agricultural Tools: వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్లు.!
. ఆచార్య ఎన్‌జిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, గత దశబ్దంగా వరి, చిరుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి మొదలగు పంటలలో సేంద్రీయ సాగు మరియు సహజ సాగు విధానాలపై పరిశోదనలు చేపట్టింది. వివిధ పంటలలో ముఖ్యంగా చిరుధాన్యాలు వేరుశెనగ, గోగు వంటి పంటల్లో 2`3సంవత్సరాలలో దిగుబడుల స్థిరీకరణ గమనించడం జరిగింది.
సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణ :
నేడు ప్రపంచం మొత్తం సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తుంది. మన దేశంలో కూడ కొంత విస్తీర్ణంలో ఉంది, భారత ప్రభుత్వం వ్యవసాయ శాఖ 2005 సంవత్సరంలో జాతీయ సేంద్రీయ ఉత్పత్తుల పథకంను ప్రవేశ పెట్టింది. సేంద్రీయ దృవీకరణ పత్రాన్ని వ్యక్తిగతంగా కాకుండా, రైతు గ్రూపులకు సంపూర్ణంగా ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నది.
క్యాడమియం, క్రామ్యిం, రాగి, పాదరసం, సీిసం వంటి భారీ లోహాలను నేలల్లోను, మొక్కల్లోను చేర్చడం సమస్యగా తయారైంది.
వ్యవసాయ ఉత్పత్తుల విలువల మీద మరియు కనీస ధర లభించే నమ్మకం రైతులకు కలిగించి ప్రోత్సహించినప్పుడే సేంద్రియ వ్యవసాయం రైతులు ఆవలంభించడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం మనదేశంలో రెండు రకాలుగా సేంద్రియ ఉత్పత్తులను గుర్తించడం జరుగుతుంది. ధృవీకరణ వ్యవస్థ ‘‘ఆపేఢ’’ ద్వారా దృవీకరణ పత్రాన్ని పొందటం, తద్వారా ఎగుమతులకు సానుకూలతను పొందటం. రెండవ విధానంలో ప్రతినిధ్య హామీ పద్ధ్దతిలో ఉత్పత్తి దారులను వారి ఉత్పత్తులను స్వయంగానే దృవీకరించాలి. అయితే ఇవి ఎగుమతికి యోగ్యం కావు. దేశీయంగానే ఉపయోగించాలి.
Also Read: Phytohormones Importance: మొక్కలలో ఫైటోహార్మోన్ల ప్రాముఖ్యత.!