సేంద్రియ వ్యవసాయం

Natural Cultivation: సహజ సాగులో 1.30 ఎకరాల్లో వైవిధ్య పంటలు.!

2
Natural Cultivation
Natural Farming

Natural Cultivation: హరిత విప్లవం నుంచి నేటి వరకు ప్రపంచాన్ని ఏలుతున్న రసాయన సాగు పద్ధతులపై క్రమంగా విముఖత పెరుగుతుంది. ప్రపంచమంతా నేడు సేంద్రియ జపం చేస్తోంది. సకల అనర్థాలకు మూలమైన రసాయన ఎరువులు, పురుగుమందులు దూరంగా సహజసిద్ధ పర్యావరణ హితకర విధానాలకు ఆదరణ పెరుగుతోంది. రసాయన సాగును గుర్తించి. ప్రకృతిబాట నడిపిస్తున్నాయి. ఈ కోవకు చెందిన రైతు తనకున్న 1.30 ఎకరాల పొలంలో గత 6 ఏళ్లుగా వైవిధ్య ఉద్యాన పంటలని ప్రకృతితో పండిస్తూ మంచి ఫలసాయం, ఆదాయం అందుకుంటూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

పాలేకర్‌ విధానాలే స్పూర్తి

పాలేకర్‌ సమావేశాలు ఎక్కడ జరిగితే అక్కడకి వెళ్లి ప్రకృతి సాగు మెళకువలు తెలుసుకునేవారు. దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకొని 6 ఏళ్ల క్రితం తొలుత నిమ్మ మొక్కలను తీసుకొచ్చి నాటి సహజ ఎరువు, జీవామృతం సాగును ప్రారంభించారు. అరటి, నిమ్మ పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాకుండా తోటలో 250 అరటి, 100 నిమ్మచెట్టు ఉన్నాయి. అరటిలో కర్పూర చక్కెర కేళి, చక్కెరకేళి, ఎర్ర అరటి రకాలు పెంచుతున్నారు. అరటి దిగుబడి బాగా రావడానికి సేంద్రియ ఎరువును వాడుతున్నాడు. దీనివల్ల మొక్కలకు పోషకాలు అందుతున్నాయి.ఎంతోమంది తన తోట వద్దకే వచ్చి గెలలు ఖరీదు చేస్తున్నారని ఒక్కో గెల 400 రూపాయలకి అమ్ముతున్నాని అన్నారు..

Also Read: Madanapalle Tomato Market: మదనపల్లి టమాట మార్కెట్ ను పరిశీలించిన కేంద్ర బృందం.!

Natural Farming

Natural Cultivation

శరీరంలో పండ్లు కీలక భాగం

ఆహారంలో పండ్లను ఒక్క భాగంగా తీసుకుంటారు కొందరు. అందుకే మార్కెట్‌లో లభించే పండ్లు ఎంత వరకు నాణ్యమైనవి అనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది. ఈ నేపథ్యంలో అరటి, నిమ్మ తో పాటు అంజీర, బత్తాయి, నేరేడు, సపోటా, కమల, తీపి నారింజ, పునాస, 15 రకాల మామిడి, బొప్పాయి, జామ, దానిమ్మ చెట్లను పోషిస్తూ చక్కని దిగుబడిని అందుకుంటున్నారు. ఎకరం 30 సెంట్ల సాగు కోసం ఖర్చు చేస్తోంది కేవలం 15 వేలు మాత్రమే అన్ని ఖర్చులు పోను లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న ట్లు చెబుతున్నారు. మార్కెటింగ్‌ ఇబ్బందులు లేకుండా నాణ్యమైన పంటలు పండిస్తున్నందువల్ల తోట వద్దకే వచ్చి తన పంటలను కొనుగోలు చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ అధికారుల సలహాలు

ప్రకృతి సాగు పుణ్యమాని తన కుటుంబం ఆరోగ్య జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయంలో వచ్చే ఆదాయం రసాయన సాగులో రాదు కాబట్టి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ పద్ధతులతో చేస్తే మంచి దిగుబడులను సాధించుకోవచ్చు. పాలేకర్ విధానాలు ఆచరిస్తే లాభాలను ఆర్జించవచ్చు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో మనం సాగును పెంపొందించుకోవచ్చు. అప్పుడే మనం కలుషితం లేని ఆహారాన్ని ప్రపంచానికి అందించవచ్చు. అధికారులు ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: Chinthamani Chilli: కొత్త రకం మిర్చితో రైతులకి మంచి లాభాలు..

Leave Your Comments

Madanapalle Tomato Market: మదనపల్లి టమాట మార్కెట్ ను పరిశీలించిన కేంద్ర బృందం.!

Previous article

Mushrooms Cultivation: ఇంట్లోనే పుట్టగొడుగుల పెంపకం ఎలా చేసుకోవాలి..

Next article

You may also like