మన వ్యవసాయంసేంద్రియ వ్యవసాయం

Types of Compost: కంపోష్టు రకాలు మరియు తయారీలో మెళుకువలు

1

Types of Compost: చెత్త అనేది వృథాగా పడి ఉండే వనరులు. వ్యవసాయ పనులవల్ల, డయిరీ ఫాంలనుంచి, పశువుల కొట్టాలనుంచి ఎంతో పెద్ద ఎత్తున జీవరసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి.

గ్రామీణ కంపోష్టు

  • సుమారు ఆరు అడుగుల లోతు, పన్నెండు అడుగుల వెడల్పు మరియు యాభై అడుగుల పొడవు గల గుంటలో వివిధ గ్రామీణ ప్రాంత వ్యర్ధ పదార్ధాలను ఒక అడుగు మందం లో పరచు కోవాలి.
  • గ్రామీణ ప్రాంత వ్యర్ధాలు: గృహాల్లో ఆహార వ్యర్ధాలు, వ్యవసాయ వ్యర్ధాలు, పశువుల శాల లో పేడ , మూత్రము, మూత్రము తో నానిన గడ్డి మొదలైనవి.
  • వ్యవసాయ వ్యర్ధాలు: కలుపు మొక్కలు, పైరు మోళ్ళు , పొట్టు లేదా ఊక , పైర్ల వ్యర్దాలైన చెరకు ఆకు, ప్రత్తి కంప, వేరు శనగ పొట్టు, ఇతర వ్యర్ధాలు, పశువుల మూత్రం తో నానిన మట్టి, పశువుల విసర్జనలు వాడుతారు.
Compost

Compost

  • వ్యర్దాలను పేడ నీటితో బాగా తడుపుతారు.
  • ఈ విధం గా నేల మీద 5 అడుగులు వచ్చే వరకు క్రమ పద్ధతులలో వ్యర్ధాలను పేర్చుకొంటూ వచ్చి ఆ తరువాత గుంత ను మట్టి తో కప్పుతారు.
  • మూడు నెలల తర్వాత క్రుళ్ళిన వ్యర్ధాలను బయటకు తీసి గుట్ట గా పోసి అవసరం మేరకు నీటితో తడిపి మళ్ళీ మట్టి తో కప్పుతారు.
  • మూడు నెలల తర్వాత క్రుళ్ళిన ఈ వ్యర్ధాలను బయటకు తీసి ఎరువు గా వాడుతారు.
  • పశువుల పేడ ఎక్కువగా వేసిన కృళ్ళే ప్రక్రియ వేగవంతమగును.

Also Read: వర్మికంపోస్టింగ్ వల్ల లాభాలు

పట్టణ కంపోష్టు

  • పట్టణ ప్రాంత వ్యర్ధాలను వాడి కృళ్ళేటట్లు చేయగా తయారయిన ఎరువును “పట్టణ కంపోష్టు” అంటారు.
  • పట్టణ ప్రాంత నివాసాలకు దూరం గా (కనీసం ఒకటిన్నర కి. మీ) పల్లపు ప్రాంతాలలో గాని లేదా వ్యర్ధాల లభ్యతను బట్టి అనువైన ప్రాంతం లో అనువైన కొలతలతో గుంత త్రవ్వుకొని పట్టణ వ్యర్ధాలను క్రమ బద్ధం గా పేర్చు కోవాలి.
  • గృహాలలోని వ్యర్ధాలు, వీధులలోని చెత్త, చేదారము, వివిధ పరిశ్రమల వ్యర్ధాలు, ఇతర వ్యర్ధాలు నిత్యమూ పట్టణ పారిశుధ్య విభాగము ప్రోగు చేసి పట్టణ సరిహద్దులకు తరలించెదరు .వీటిని క్రమ బద్దం గా గుంత లో విస్తరింప చేయుదురు.
  • ఒక అడుగు మందములో వ్యర్ధాలను పేర్చిన తరువాత దాని మీద క్రుళ్ళడానికి మానవ విసర్జనలు (గ్రామీణ కంపోష్టు లో వాడే పశువుల పేడ కు బదులుగా) వాడుదురు.
  • ఈ విధం గా పొరలు పొరలు గా పట్టణ వ్యర్ధాలు, మానవ విసర్జనలు పరచుకొంటూ నేల మీదకు కొంత ఎత్తు వరకు గుట్ట గా చేయాలి.
  • ఈ గుట్టలు కప్పకుండా వదిలి వేసిన ఆక్సిజన్ సమక్షం లో క్రుళ్ళు తాయి. గుట్టలు కప్పి వేసినపుడు ఆక్సిజన్ లేకుండా  కృళ్ళే కార్యక్రమం జరుగుతుంది.
  • పట్టణ కంపోష్టు నుండి వెలువడే దుర్గంధాన్ని  నివారించుటకు మరియు ఈగల  బెడద నివారణ కు కాపర్ సల్ఫేట్ జల్లవలెను.

    Types of Compost

    Types of Compost

పధ్ధతి ని బట్టి వాడే ముడి పదార్ధాలు మారును. ఉపయోగించే సేంద్రియ పదార్ధాలు ఒకే రకమయినప్పటికి క్రుళ్ళ డానికి వాడే ముడి పదార్దములు మారును. ఈ ముడి పదార్ధాలు కృళ్ళే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

Also Read: వర్మీ కంపోస్టును ఎలా తయారు చేసుకోవాలి..!

Leave Your Comments

Benefits of Inter Cropping: అంతర పంటల సాగుతో ప్రయోజనాలు

Previous article

Farmers Income: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు

Next article

You may also like