Bio Fertilizers: భాస్వరం ఎరువులు బదులుగా ఫాస్ఫరస్ సాలిబ్రైసింగ్ బ్యాక్టీరియా వినియోగం నేల యొక్క సారం నీళ్లలో నివసించే సూక్ష్మజీవుల సంఖ్యపై ఆధారపడుతుంది ఎంత ఎక్కువ సూక్ష్మజీవులు అంత నేల సారం పెరుగుతుంది. నేలలో ఉండే సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని కొల్లగొట్టి వాటిలో ఉన్న పోషకాలను మొక్కకు అందేలా చేస్తాయి.
నిరంతరం రసాయనిక ఎరువులు మరియు ఇతర రసాయనాలు వాడడం వలన నేలలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది, తద్వారా నేలలో సేంద్రీయ గర్భం తగ్గిపోతుంది. నేలలో కనీసం 0.5% సేంద్రియ కర్బనం ఉన్నట్లయితే సాగుకు అనుకూలంగా ఉన్న నేలగా భావిస్తారు. ఈ సూక్ష్మజీవుల్లో ముఖ్యమైనది ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఇది జీవ ఎరువుగా పనిచేస్తుంది సహజంగా సేంద్రియ పదార్థాలలో ఉండే ఫాస్ఫరస్‌ను మొక్కలను అందజేయడానికి ఉపయోగపడుతుంది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మట్టి పరీక్షలలో తెలంగాణ భూముల్లో భాస్వరం విలువలు అధికంగా ఉన్నట్లు తెలిసింది. నేపథ్యంలో వ్యవసాయ విస్తరణ అధికారి టీ నాగార్జున్ భాస్వరం నిల్వల్ని కరిగించే విధంగా పాస్పో బ్యాక్టీరియా వినియోగంపై విస్తృత స్థాయిలో రైతులకు అవగాహన కలిగించి నారాయణరావుపేట క్లస్టర్ వానాకాలంలో 198 ఎకరాల్లో భాస్వరాన్ని కలిగించే బ్యాక్టీరియా రైతులు వినియోగించడం జరిగింది.
పంట ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ముఖ్యమైనది నత్రజని భాస్వరం పొటాషియం అంటారు.ముఖ్యంగా దుక్కిలో వేసే టువంటి 20-20- 0 -13,డి ఏ పి వంటి భాస్వరం ఎరువులు 90 శాతం భాస్వరం ఎరువులను భారతదేశం ఇతర దేశాల నుండి దిగువ తీసుకుంటుంది . అంతేకాకుండా మిగతా ఎరువులు పోల్చుకుంటే భాస్వరపు ఎరువులు చాలా ఖరీదైనవి.
రైతు వేసిన టువంటి ఎరువుల లో కేవలం 30-40 శాతం మాత్రమే మొక్క తీసుకోవడం జరుగుతుంది మిగతా ఎరువు యొక్క అందుకోలేని రూపంలోకి మారుతుంది, యొక్క రసాయన స్వభావం మారిపోయి దీర్ఘకాలంలో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతు యొక్క పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిపోతుంది.ముఖ్యంగా నిలువలు భూమిలో అధికంగా ఉంటే పంటలు జింక్ ధాతువు లోపం ఏర్పడుతుంది.
Also Read: Rabi Cultivation: రబీ సాగు విస్థరణ పై ఈశాన్య ఋతు పవన ప్రభావం.!
జిల్లెల్ల రమేష్ మట్టి పరీక్ష చేసుకొని వాటి ఆధారంగా తన నేలలో అధిక మొత్తంలో పోస్టర్స్ నిలువలు ఉన్నట్లు గ్రహించారు. ఒక ఎకరం పొలంలో దుక్కి మందుకు బదులుగా పూర్తిస్థాయిలో పాస్పోర్ట్ బ్యాక్టీరియాని వినియోగించడం ద్వారా దుక్కి మందుకు అయ్యే ఖర్చును తగ్గించడంతోపాటు 30 క్వింటాల్ పంట దిగుబడి పొందడం జరిగింది.
రైతులు ఫాస్పరస్ అధికంగా ఉన్న నేలలో సుదీర్ఘంగా వినియోగించినట్లయితే నేలలో బ్యాక్టీరియా సంఖ్య పెరిగి దిక్కి మందు (డిఏపి,20 20 013) ఫాస్పరస్ రసాయనిక ఎరువులు వినియోగించకపోయినా మంచి దిగుబడిని పొందుతారు తద్వారా నేలసారాన్ని పెంచడంతోపాటు పెట్టుబడి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయం పై ఆసక్తి చూపుతున్న రైతులు జీవ ఎరువులు మంచి దిగుబడిని పొందవచ్చు.
విత్తన శుద్ధి :
ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఉపయోగించే విధానం.
విత్తనానికి పట్టించే పద్ధతి :
ఒక ఎకరానికి సరిపడే విత్తనాన్ని 200 గ్రా. మన జీవన ఎరువు లేదా 200 మి.లీ. ద్రవ జీవన ఎరువును సమ మోతాదులో 10 శాతం చెక్కర లేదా బెల్లం ద్రావణానికి కలిపి విత్తనం చుట్టూ సమానంగా పట్టించి 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవన ఎరువులను విత్తే ముందు మాత్రమే విత్తనాలకి పట్టించాలి.
నారును ముంచి వాడే పద్ధతి/ నారుమడి పంటలలో ఒక కిలో జీవన ఎరువు ప్యాకెట్ను తీసుకుని 10 నుంచి 15 లీటర్ల నీటితో బాగా కలుపుకోవాలి. ఒక ఎకరాకు అవసరమైన నారును తీసుకొని కట్టలుగా కట్టుకోవాలి. నారును (ముఖ్యంగా వేర్ల భాగాలు) మునిగేలా 15-30 నిమిషాలు జీవన ఎరువుల ద్రావణ మిశ్రమంలో ఉంచాలి. 1:10 నిష్పత్తి ప్రకారం జీవన ఎరువుల మిశ్రమం ప్యాకెట్ 10 లీటర్ల నీటిలో వేసుకోవాలి.
భూమిలో వేసే పద్దతి :
వరి, మొక్కజొన్న, ఇతర పంటలలో నేలలో భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువు బ్యాక్టీరియాను నాటుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల మన జీవన ఎరువు లేదా 200 మి.లీ. ద్రవ జీవన ఎరువును సుమారుగా 100-200 కిలోల పశువుల ఎరువుతో గానీ, వానపాముల ఎరువుతో గానీ లేదా ఇతర సేంద్రియ ఎరువులతో గానీ కలిపి పంట పొలాల్లో వేయాలి. ఎట్టి పరిస్థితులలోను పంట పొలంలో చేపట్టే మొదటి అంతరకృషి చేయడానికి ముందుగా జీవన ఎరువుల వాడకాన్ని చాలి, వరిలో నాటు వేసిన తర్వాత 3-7 రోజుల వ్యవధిలో సేంద్రియ ఎరువుతో కలిపి వెదజల్లాలి.
గమనిక :
జీవన ఎరువులు కలిగిన పాకెట్, బాటిల్ ఎండ తగిలే ప్రదేశంలో నిల్వ చేయరాదు, జీవన ఎరువులను రసాయనిక లేదా పురుగు మందులతో కలిపి వాడకూడదు. కలుపు మందు పిచికారీ చేసిన 24 గంటల తర్వాతనే జీవన ఎరువులను వాడాలి.
Also Read: Tulasi Health Benefits: ఆరోగ్య వరదాయని తులసి.!