Optimum Plant Population: వివిధ పంటలలో అధిక దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైనది. మొక్కలు నీరు, నేలలోని పోషకాలు, వెలుతురును సద్వినియోగం చేసుకోవాలంటే, సరైన సాంద్రతలో మొక్కలు కూడా ఉండాలి. నిర్ణీత విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు కలిగి ఉండాలో తెలిపేదే ‘‘మొక్కల సాంద్రత’’. ఎ పంటలో ఐనా మొక్కల సాంద్రత, మూడు ముఖ్యమైన అంశాలపై ఆదారపడి ఉంటుంది. అవి విత్తనా బరువు, సాళ్ళమధ్య దూరం, ఒకే సాలులో మొక్కల మధ్య దూరం. మొక్క ఎదుగుదల, మొక్క యొక్క విస్తీర్ణం, పంటకాలం, నీటి సదుపాయం బట్టి మొక్కల సాంద్రత, పంట పంటకు మారుతూ ఉంటుంది. సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు మాత్రమే అధిక దిగుబడిలు సాదించగలం. మొక్కల సాంద్రత ఎక్కువైన, తక్కువైన పంట సరిగా ఎదగకుండా దిగుబడులు తగ్గుతాయి. ఈ విషయాలపై మన రైతు సోదరులకు సరైన అవగహన లేకపోవడం వల్ల మొక్కల సాంద్రత తక్కువగా ఉండి. దిగుబడులపై ప్రభావితం చూపిస్తుంది.
Also Read: Timber Plantations: లాభసాటిగా కలప మొక్కల పెంపకం.!
మొక్కల సాంద్రత తక్కువగా ఉండటానికి కారణాలు:
. సిఫారసు కంటే తక్కువ మోతాదులో విత్తనం వాడటం.
. విత్తనంలో మొలకశాతం తక్కువగా ఉండటం.
. విత్తనశుద్ధి చేయక పోవడం.
. మొలక దశలోనే పురుగులు, తెగుళ్ళు, వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలు చనిపోవటం.
. నేల సమతలంగా లేకపోవటం వలన సరిగా మొలవక పోవటం.
. నేలలో సరిపడా తేమ లేక సరిగా మొలవ పోవటం.
. విత్తనం లోతుగా పడటం వలన మొలకెత్తక చనిపోవటం.
. కూలీలు సరైన దూరంలో విత్తానని నాటక పోవటం.
. ఎద్దుల గొర్రు మీద విత్తనాలను నైపుణ్యం లేని మనుషుల చేత విత్తడం వలన.
. కొన్ని రకాల పంటలను వెదజల్లే పద్ధతిలో విత్తడం. ఉదా: వరి మాగాణిలో అపరాలను వెదజల్లడం.
. విత్తడానికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకపోవడం.
మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలు:
. ఖాళీలు ఏర్పడి దిగుబడి అదే విధంగా తగ్గుతుంది.
. నీరు, వెలుతురు, ఎరువులు, పురుగు మందులు పూర్తి సద్వినియోగం చేసుకోలేము.
. నేల వినియోగం తగ్గిపోతుంది.
. కలుపు మొక్కలు ఎక్కువ పెరిగి, కలుపు నివారణ ఖర్చు పెరిగుతుంది.
మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండటానికి కారణాలు:
. సిఫారసు కంటే ఎక్కువ మోతాదులో విత్తనం వాడటం.
. సాళ్ళమధ్య, సాళ్ళలో మొక్కల మధ్య తక్కువ దూరంలో విత్తడం
. అధికంగా వున్నా మొక్కలను తొలిదశలో తిసివేయక పోవడం.
మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలు:
. మొక్కలు వెలుతురు కోసం పోటిపడి పొడువుగా పెరిగి లేక పొట్టిగా మరి బలిహినంగా తయారవుతాయి.
. కొమ్మలు/పిలకలు తక్కువగా రావడం.
. ఉండవలసిన గింజలు, కాయలు తక్కువగా వుండి దిగుబడి తగ్గిపోవడం
. నీరు, వెలుతురు, పోషకాలు పంట చివరి దశ వరకు లభ్యంకాక దిగుబడి తగ్గుతాయి.
ఈ సమస్యను అదిగామించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి:
. సిఫారసు మేరకు విత్తన మోతాదు వాడటం.
. సరైన పద్ధతిలో విత్తుకోవటం.
. విత్తే ముందు మొలక శాతం పరీక్షించి దాని ప్రకారం విత్తనం వాడడం
. నేల సమతలంగా ఉండేలా చదును చేయటం
. సరైన పద్ధతిలో సరైన లోతులో విత్తడం
. సరైన పదునులో తేమ ఉన్నప్పుడు విత్తడం
. విత్తనశుద్ధి సక్రమంగా చేసి ప్రాధమిక దశలో మొక్కలను కాపాడుకోవడం
. సాళ్ళమధ్యలో, సాళ్ళలో మొక్కల మధ్య సరైన దూరంలో విత్తడం.
. ఖాళీలు ఉన్న చోట మరల విత్తటం, వత్తుగా ఉన్న చోట ఒక మొక్క ఉంచి, మిగిలిన మొక్కలను పీకివేయాలి. విత్తిన వారం రోజుల నుండి 15 రోజుల లోపు మొలక రాని చోట మరలా విత్తుకోవాలి.
. సరైన మొక్కల సాంద్రత కోసం రైతులు విత్తన గొర్రు వినియోగించుకోవాలి. ప్రస్తుతం విత్తన గొర్రులు అందరికి అందుబాటులో ఉన్నవి. విత్తన గొర్రును ప్రభుత్వం సబ్సిడీ క్రింద కూడా లభిస్తున్నాయి.
. ముఖ్యమైన పంటలలో సరైన మొక్కల సాంద్రత పాటించడానికి చేపట్టవలసిన యాజమాన్యం పద్ధతులు
వరి: మొక్కల సాంద్రత తక్కువగా ఉండడం మనం గమనించే సాధారణ అంశం. ఖరీఫ్‌లో చ.మీకు 33 దుబ్బులు, రబీలో 44 ఉండాలి. కానీ 22-24 దుబ్బులు మాత్రమే ఉంటున్నాయి. దీనికి ముఖ్య కారణం కూలీల సమస్య. తక్కువ దుబ్బులు వున్నాప్పుడు దిగుబడి తగ్గకుండా ఉండేందుకు మరియు దుబ్బులనుండి పిలకలు వచ్చేందుకు అధిక రసాయన ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల ఎరువులపై ఖర్చు పెరిగిపోతుంది. అంతేకాక రసాయనిక ఎరువుల అధిక వినియోగం వాళ్ళ దోమ పోటు, ఆకుచుట్ట్టూ పురుగులు, అగ్గి తెగులు, పాముపొడ, ఎండుతెగులు ఎక్కువ ఆశించి సస్యరక్షణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.
ఈ ఇబ్బందిని అధిగమించడానికి కూలీలతో సరైన ఒప్పందంతో సిఫారుసు మేరకు దుబ్బులు ఉండేలా నాట్లు వేయించాలి. కూలీల సమస్య అధిగామించలేనప్పుడు యంత్రాలతో వరిని నాటే నూతన విధానాన్ని ఎంచుకోవాలి. ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రత్యామ్నాయ వరిసాగు విధానలైన ట్రేలలో నారు పెంచుకొని ట్రాస్స్ ప్లాంటర్‌తో నాట్లు వేసుకోవటం, డ్రమ్సిడర్తో విత్తుకోవడం వంటి పద్ధతులు ఆచరించవచ్చు.
మినుము/పెసర:
మినుము, పెసర పంటలలో చ.మీకు 33- 44 మొక్కలు ఉండాలి. మొక్కల సాంద్రత తక్కువ ఉన్నప్పుడు కలుపు సమస్య అధికంగా ఉంటుంది. ఇవి తక్కువ కాలపరిమితి కలిగి, కొమ్మలు పెరుగుదల తక్కువగా ఉంటే చిన్న మొక్కలు కాబట్టి మొక్కల సాంద్రత తగ్గితే దిగుబడులలో చాల వ్యత్యాసం వస్తుంది. ముఖ్యంగా వరి మగాణులలో మినుము, పెసర సాగులో మొక్కల సంఖ్య తక్కువగా ఉంది, కలుపు ఎక్కువగా పెరిగి దిగుబడులు తక్కువగా ఉంది నమోదు అవుతున్నవి. కొన్ని చోట్ల అవసరం కంటే ఎక్కువ మొక్కలు వుండి పేలగా మరి, ఎత్తుగా పెరిగడం జరుగుతుంది. ఇలాంటి పొలాలలో మారుకా మచ్చల పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. వరి మాగాణుల్లో ఎకరానికి 16 కిలోల మినుములు, 12 కిలోల పెసలు చల్లినప్పుడు సరైన మొక్కల సాంద్రత ఉంటుంది.
శనగ: రబీలో పండిరచే పంటలలో ముఖ్యమైనది. ఓక చ.మీకు 33 మొక్కలు ఉండాలి. ఎకరానికి 30-35 కిలోల విత్తనం అవసరం.
వేరుశనగ: ఖరీఫ్‌లో ఒక చ.మీకు 33 మొక్కలు మరియు రబీలో చ.మీకు 44 మొక్కలు ఉండాలి. రకాలు, గింజ బరువును బట్టి, పైరులో ఆశించే మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు, వేరు కుళ్ళు, వంటి తెగుళ్ళు ఆశించే నేలలలో విత్తనమోతాదు పెంచుకోవాలి.
మొక్కజొన్న: ఎకరాకు 7-8 కిలోల విత్తనం 60`20 సెం.మీ దూరంలో చ.మీకు 8 మొక్కలు వచ్చేలా విత్తుకోవాలి. తొలిదశలో ఆశించే కాండం తొలిచే పురుగు కారణంగా మొక్కల సాంద్రత తగ్గి ఇబ్బందులు ఉంటాయి. విత్తిన 12-15 రోజుల మరలా 25-35 రోజులకు సమర్థవంతమైన పురుగు మందులు పిచికారీ చేయటం లేక మొక్కల మొవ్వలో పురుగు మందుల గుళికలు వేయుట ద్వారా మొక్కల సాంద్రత తగ్గకుండా కాపాడుకోవాలి.
అరుణ్ కుమార్ కొండేటి, శాస్తవేత్త (సేద్య విభాగం)
డా.ఆర్.నరసింహులు, శాస్త్రవేత్త (ప్లాంట్ బ్రీడిరగ్),
లక్ష్మీ కళ్యాణి, శాస్త్రవేత్త (సేద్య విభాగం) మరియు డా.యన్.సి. వెంకటేశ్వరులు,
పరిశోధన సహా సంచాలకులు, ఆర్.ఎ.ఆర్.స్, నంద్యాల.
Also Read: Trichoderma: నేలకు ఆరోగ్య సంజీవని` ట్రైకోడెర్మా.!