Jaivik India Award 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాయంతో ప్రకృతి సాగుని రైతు సాధికార సంస్థ ప్రోత్సాహిస్తుంది. ఈఆవార్డులకు ఎంపికైనా అత్తలూరుపాలెం ఎఫ్పీఓ, బాపట్ల జిల్లా మహిళా రైతు పద్మజా.. వచ్చే నెల 7న ఆవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మన రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ఈ అవార్డును ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ICCOA) సంస్థ ప్రకటించింది. జాతీయ స్థాయిలో మొత్తం 10 విభాగాల్లో 51 అవార్డులను వెల్లడించగా ఇందులో మన రాష్ట్రానికి 3 అవార్డులు దక్కడం విశేషం.
పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరులో ఉన్న అత్తలూరుపాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీఓ), బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ కూడా జైవిక్ ఇండియా అవార్డులకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 7న ఢిల్లీలో జరగనున్న ‘బయోఫ్యాక్ ఇండియా నేచురల్ ఎక్స్‌పో’లో ఈ అర్హులైన వారిని సత్కరించనున్నారు.
Also Read: Increase Banana Yield: అరటి తోట ఇలా సాగు చేస్తే రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది..
అత్యుత్తమ సాగుతున్న అవార్డులు పొందిన అత్తలూరుపాలెం FPO, బాపట్ల జిల్లా మహిళా రైతు పద్మజా, రైతు ఉత్పత్తిదారుల సంఘం (FPO) కేటగిరిలో అత్తలూరు పాలెం ఆర్గానికి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ కు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ఈ కంపెనీ పరిధిలో 400 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ గ్రామాల పరిధిలోని ఇతర రైతులకు అవసరమయ్యే జీవ ఎరువులను అందజేస్తున్నారు.
ఇలానే ఉత్తమ ప్రకృతి వ్యవసాయ మహిళ కేటగిరిలో బాపట్ల జిల్లాకు చెందిన గనిమిశెట్టి పద్మజ కు జైవిక్ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నాలుగేళ్లుగా సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తోంది. ఆమె తనకు ఉన్న ఎకరం పొలం ద్వారా రూ.1.5 లక్షల ఆదాయం అర్జీస్తోంది. అలానే పశువుల పెంపకం ద్వారా రూ.60 వేలు, కషాయాల విక్రయాల ద్వారా మరో రూ.5 వేలు సంపాదిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాల కోటాలో ఏపీ ఉత్తమ ప్రభుత్వంగా నిలిచి జైవిక్ ఇండియా అవార్డుకు ఎంపికైంది.
Also Read: Rayalaseema Drought: రాయలసీమలో తీవ్రమవుతున్న కరువు