Precautions in Organic Farming: ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజ వనరులతో, సాంప్రదాయ పద్ధతులతో పంటల్ని పండిరచటమే సేంద్రియ వ్యవసాయంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం పద్ధతి కొత్త పుంతలు తొక్కుతూ ప్రకృతి, సహజ వ్యవసాయంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ వ్యవసాయం పద్ధతిని ఇంతలా ప్రభుత్వాలు ప్రాచుర్యం చేయడం వలన కొంత మంది రైతులు కూడా ముందుకు వస్తున్నారు.
సేంద్రియ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం వలన ప్రయోజనాలు
. సేంద్రియ వ్యవసాయం వల్ల నేలలో సారం, ఉత్పాదకత పెరుగుతుంది.
. చక్కని జన్యు వైవిధ్యం ఏర్పడుతుంది.
. సురక్షిత ఆహార ఉత్పత్తికి దోహదపడుతుంది.
. నేలలో కర్బనం పెరుగుదలకు పశువుల ఎరువుపైనే కాకుండా పచ్చిరొట్ట, పచ్చిఆకు, వానపాముల ఎరువు, చెరకు మడ్డి, కోడిపెంట, పంది, మేక ఎరువుల వాడకానికి ప్రాధాన్యమివ్వాలి.
. అన్నిరకాల సేంద్రియ, జీవన ఎరువులు వాడి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.
. సస్య రక్షణలో వృక్ష, జీవ సంబంద రసాయనాలు వాడి సహజ వనరులు కలుష్యానికి గురికాకుండా చూడవచ్చు.
. కాబట్టి ఇలాంటి జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులతో చేసే వ్యవసాయం పర్యావరణానికి, మానవ మనుగడకు మేలు చేస్తుంది.
. సేంద్రియ ఎరువులతో పండిరచిన కూరగాయలు తినటం వలన శరీరానికి ఆరోగ్యం చేరుతుంది.
సేంద్రియ వ్యవసాయంలోకి ఎలా మారాలి ?
సేంద్రియ వ్యవసాయం/ సహజ వ్యవసాయం పెట్టుబడిలేని వ్యవసాయం అంటే తక్కువ పెట్టుబడి అవసరం. చాలా మంది రైతులు ‘‘సేంద్రియ వ్యవసాయం’’ అందరూ చేయలేరు, అది చాలా కష్టంతో కూడినది, మనవల్ల కాదు, రసాయన వ్యవసాయంలోనే సరైన ఆదాయాలు రావటం లేదు, ఇక సేంద్రియ వ్యవసాయంలో ఆదాయాలు వస్తాయా? అని నిట్టూరుస్తూ నిరుత్సాహపడుతుంటారు. కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది. కృషి ఉంటే ఏదైనా ఫలిస్తుంది. సేంద్రియ వ్యవసాయం కూడా అంతే. ఏది కూడా ఒకసారికే ఫలితం వచ్చేయదు. అలాగే సేంద్రియ వ్యవసాయం / సహజ వ్యవసాయం ఒక్కసారిగా మొదలు పెట్టరాదు. ఒక యోజనతో 3, 4 సంవత్సరాల ముందు నుండి రసాయనాల వాడకం తగ్గిస్తూ, జీవామృతం/ ఘనా జీవామృతం వాడకం పెంచుతూ రావాలి. భూమిలో రసాయన ఎరువులు, కలుపు మందుల అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోవాలంటే సుమారు 3`4 సంవత్సరాలు పడుతుంది. సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లిన మొదటి దశలో మూడు, నాలుగు సంవత్సరాల పాటు దిగుబడులు, ఆదాయాలు ఆశించిన రీతిలో రాకపోవచ్చు. తర్వాత నుండి తీసుకున్న శ్రద్దను బట్టి స్దిరమైన దిగుబడులు, అధిక లాభాలు వస్తాయి.
Also Read: Summer Plant Care: వేసవిలో పెంచుకునే మొక్కలు మరియు జాగ్రత్తలు
ఇతర సూచనలు :
. మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు ఉంటే పంటలు సమృద్దిగా పండుతాయి.
. పంట కోతకాలం తర్వాత ఆకులను, మొక్కలను కాల్చకూడదు. వాటిని ఆచ్ఛాదనకు ఉపయోగించవచ్చు
. రైతు వేసే ప్రధాన పంటలతోపాటు ఒకటి, రెండు ఇతర పంటలు కూడా వేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చు.
. ఏ పంటైనా మొక్కకు మొక్కకు మధ్య సరిపోయే దూరం ఉండాలి.
. సేంద్రియ వ్యవసాయం వలన వాతావరణ కాలుష్యం నివారింపబడుతుంది.
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ ముఖ్య ఉద్దేశ్యములు :
1. కరువును తట్టుకొనే విధంగా ధాన్యపు పంటలు, పప్పుదినుసుల అంతర పంటలు, మిశ్రమ పంటలను ప్రోత్సహించుట.
2. బెట్ట / కరువు సమయంలో పంటలు బెట్టకు గురికాకుండా రక్షకతడులతో కాపాడుట.
3. రైతులకు పంట పెట్టుబడి ఖర్చులను తగ్గించుట, పంట దిగుబడులను పెంచుట. తద్వారా నికర ఆదాయం పెంచుట.
4. భూమిలో సేంద్రియ పదార్ధమును పెంచి, భూమి ఉత్పాదక సామర్ధ్యమును పెంచుట.
5. మిశ్రమ, బహుళ పంటల ద్వారా నేలపైన ఎక్కువ కాలం (8 లేక 9 నెలలు) పంటలు ఉండే విధంగా, తద్వారా భూమిపై ఎండ పడకుండా కాపాడి, నేలలోని సూక్ష్మజీవులను రక్షించి, తద్వారా పంట దిగుబడులను పెంచడం.
6. కుటుంబానికి మరియు ప్రజలకు రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారపంటలను పండిరచి అందించుట. తద్వారా అందరికీ ఆరోగ్యమును అందించుట. పర్యావరణమును రక్షించి రోగాలను తగ్గిస్తూ, కొత్త రోగాలను రాకుండా జాగ్రత్త పడటం.
7. రైతుకు నికర ఆదాయముతో పాటు, నేల ఆరోగ్యం కాపాడుకుంటూ, పశువులకు మేతను వృద్ది చేయుట, పశుపోషణకు ప్రోత్సహించుట.
ప్రకృతి వ్యవసాయంలో – రాజీలేని సూత్రాలు మరియు ముందు జాగ్రత్తలు :
. వేసవి దుక్కులు
. వర్షపు నీటిని నిల్వచేసుకోవడం
. జీవన ఎరువులు వాడడం
. పొలాల్లోని వ్యర్థాలను సేంద్రీయ ఎరువులుగా తయారు చేసుకోవడం/ వానపాముల ఎరువు వాడడం
. రైతు వారి పద్ధ్దతులలో మదర్ కల్చర్ని ఉపయాగించి జీవన ఎరువులు తయారు చేసుకోవడం
. నూనె చెక్కలు వాడడం
. సామూహిక పొలం గట్ల పైన మంటలు
. పచ్చిరొట్ట పైరు పెంపకం/ పచ్చరొట్ట ఆకులు వాడడం
. బీజామృతంతో విత్తనం మరియు నారు శుద్ధి
. జీవామృతం వాడకం
. వరిలో నారు కొసలు తుంచి నాటడం
. వరిలో కాలిబాటలు తీయడం
. పసుపు తెలుపు పళ్ళాలు అమర్చడం
. లింగాకర్షక బుట్టలు అమర్చడం
. పక్షి స్థావరాల ఏర్పాటు
. ఎర పంటలు వేయుట/సరిహద్దు పంటలు
. రక్షక పంటలు వేయుట
. సమగ్ర నీటి యాజమాన్యం పాటించుట
. మిశ్రమ, అంతర పంటలు వేయుట
. ఆకుల కషాయాల వాడకం
. గట్ల పైన చెట్టు పెంచుట
. పశుసంపదను కుటంబ అవసరాల కోసం పెంచుకోవడం.
8. సంవత్సరిక / కార్శి పంటలతో పాటు, వర్షాధారంపై పండే వృక్ష పంటలను – మామిడి, సీతాఫలం, నేరేడు, సీమచింత, ఉసిరి, రేగు లాంటి పంటలు కరువుకు తట్టుకొని ఫలాలను అందించగలవు. ఈ వృక్ష పంటలతో పాటు మధ్య సాళ్ళలో ధాన్యపు పంటలు, పప్పుదినుసులు, కూరగాయల పంటలను పెట్టి ఆదాయాన్ని పెంపొందించుట.
9. భూమిని శక్తివంతమవుగా చేసి, మనం తినే ఆహారం, తాగేనీరు, పీల్చేగాలి స్వచ్చంగా చేయడం.
Also Read: Oil Price: వంట నూనె ధరలు తగ్గిస్తూ నిర్ణయం.. సామాన్య ప్రజలకు ఊరట కలిగించే వార్తను అందజేసిన కేంద్రం!