సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయం

0

మన పూర్వీకులు వ్యవసాయాన్నే వృత్తిగా నమ్ముకొని పశుసంపదను పెంచుకొని దాని ద్వారా వచ్చే సేంద్రియ పదార్ధాలను ఉపయోగించుకొని, భూసారాన్ని పెంచి వివిధ నాణ్యత గల పంటను పండించేవారు పెరుగుతున్న జనాభా అవసరాకు అనుగుణంగా అధిక దిగుబడి వంగడాలు, రసాయన ఎరువు ప్రయోజనము వల్ల హరిత విప్లవం సాధించడమైనది. కాలక్రమేణా రైతు విచక్షణా రహితంగా రసాయనిక ఎరువు, పురుగు మందు వాడకం వల్లనే, నీరు, వాతావరణం కాలుష్యం చెంది పర్యావరణ సమతుల్యతను కోల్పోయాము. మానవాళికి తెలియని కొత్త ఆరోగ్య సమస్యలు ఏర్పడి మానవ మనుగడకే పెనుముప్పుగా పరిణమించింది.

ప్రస్తుతం శాస్త్రవేత్తలు, రైతాంగం, ప్రభుత్వాలు ఈ పెనుముప్పును ఏ విధంగా తప్పించి మానవాళి మనుగడకు సహాయ పడాలి అన్న దృక్పదంతో మరలా మన పూర్వ సాంప్రదాయ వ్యవసాయానికే స్వాగతంపలుకుతున్నారు. ఆరోగ్య జీవనం కోసం ఆరోగ్యమైన తిండి, ఆరోగ్య మైన పంట, ఆరోగ్యమైన నేల కావాలి. ఈ సత్యాన్ని గ్రహించి సేంద్రియ సేద్యానికి నాంది పలుకుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (2013) అంచనా ప్రకారం సుమారు 69.7 మిలియన్ల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం విస్తరించబడి 1.8 మిల్లియన్ల టన్నుల సేంద్రియ ఉత్పత్తు తయారు చేసే రైతు ఉన్నారని దృవీకరించారు. మనదేశంలో సేంద్రియ వ్యవసాయం 0.04 మిలియన్ల హెక్టార్ల (2007-2008) నుండి 5.5 మిల్లియన్ల హెక్టార్లలో వరి, అపరాలు, పత్తి, కాఫీ, ఔషథ మొక్కలు మొదలైన పంటల్లో సాగుచేయబడుతూ సుమారు 3.9 మిల్లియన్ల టన్నులు సేంద్రియ ఉత్పత్తులు తయారుచేయబడుచున్నవి. వ్యవసాయ, శుద్దిచేసిన ఆహార ఉత్పత్తు ఎగుమతి, అభివృద్ధి ప్రాధికార సంస్థ 2012 అంచనా ప్రకారం మనదేశంలో సుమారు 300 సేంద్రియ ఉత్పత్తును (1,15,147 మెట్రిక్‌ టన్నులు) ఎగుమతి చేయబడి 8.3 మిలియన్ల విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించడమైనది. సేంద్రియ ఉత్పత్తుల వినియోగంలో కూడా 20 -22 శాతం పెరుగుదల నమోదైంది.

మనదేశంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)లో సేంద్రియ సేద్యానికి సముచితస్థానం కేటాయించడం జరిగింది. సేంద్రియ సేద్యంలో చేపట్టి ఉత్పత్తి విధానాలు, నాణ్యత ప్రమాణాలు, వ్యాపార వాణిజ్య పరమైన అంశాలతో కూడిన పాఠ్యాంశాలను రూపొందించవలసిందిగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలను మరియు కొన్ని ప్రత్యేక సంస్థను కోరడమైనది. భారత వ్యవసాయ పరిశోధనామండలి విభాగంలో వివిధశాఖ సమన్వయంతో సేంద్రియ సేద్యానికి సంభందించిన అంశాలతో కూడిన పరిశోధనను చేపట్టుటకు ప్రప్రధమంగా ఉత్తరప్రదేశ్‌ లోని భారత పంట సరళి పరిశోధన సంస్థ మోదిపురంలో ఎంపికచేయడమైనది. అదే స్పూర్తితో జయశంకర విశ్వ విద్యాయంలో వివిధ పంటపై సేంద్రియ సేద్యానికి సంబంధించిన పలు అంశాలతో కూడిన పరిశోధనను చేయబడుచున్నవి.

సేంద్రియ వ్యవసాయ నిర్వచనం :

నేలకు సేంద్రియ పదార్ధాలను అందించి అధిక దిగుబడుతో పాటు నాణ్యత గల పంట ఉత్పత్తులను పొందడమే ‘‘సేంద్రియ వ్యవసాయం’’.

సేంద్రియ వ్యవసాయం`అవలంబించవలసిన సాగు పద్ధతులు :

1. అవసరమైనంత మేరకే నేలను దున్ని, నేల కోతను తగ్గించాలి.
2. వ్యవసాయం అంటే పాడి, పంట దీన్ని దృష్టిలో పెట్టుకుని పంటలతో పాటు పాడి పశువు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
3. వృక్ష, జంతు సంబంధ వ్యర్ధాలను అన్నిటినీ సేంద్రియ ఎరువుగా మార్చి వినియోగించాలి.
4. అంతర కృషి చేస్తూ కలుపు సకాలంలో తీసి పంటకు తగినంత పోషకాలు అందేటట్లు చూడాలి.
5. జీవన ఎరువు ప్రాధాన్యత రైతుకు తెలిపి విరివిగా వాడేటట్లు చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవన ఎరువు ఉత్పత్తి ఎక్కువ చేసి రైతుకు అందజేయాలి.
6. నీటి వనరును సద్వినియోగం చేస్తూ, నేలలోని తేమను పరిరక్షించుటకు తగు సేద్య విధానాలను అవలంభించాలి.
7. సస్య రక్షణకు వృక్ష, జంతు సంబంధ మందును వాడాలి.
8. జీవ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చి సస్యరక్షణ చేయాలి.
9. పంట దిగుబడులు తగ్గకుండా, నాణ్యత చెందకుండా, ప్రకృతి ప్రసాదిత వనరును ఉపయోగించుకోవాలి.

సేంద్రియ వ్యవసాయం వల్ల నేలకు ఒనగురు లాభాలు :

1. నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
2. నేలలో ‘‘హ్యూమస్‌’’ నిల్వలు పెరిగి అన్ని పోషకాలను పంటకు అందిస్తుంది.
3. నేల భౌతిక, రసాయనిక, జీవనపరంగా అభివృద్ధి చెందుతుంది.
4. నీటిని, పోషకాలను నిలువరించే గుణం పెరుగుతుంది.
5. నీటి నిల్వ సామర్ద్యం, మురుగు నీరు పోవు సౌకర్యం కలుగుతుంది.
6. నేల కాలుష్యం తగ్గి నాణ్యతతో కూడిన ఉత్పాదకత జరుగుతుంది.
7. భూగర్బజలాల కాలుష్య నివారణకు దోహదపడుతుంది.
8. పర్యావరణ సమతుల్యత దోహదపడుతుంది.
9. నాణ్యమైన సురక్షిత ఆహారం లభిస్తుంది
10. నాణ్యత, నిల్వ ఉండే గుణం పెరుగుతుంది
11. సుస్థిర సేద్యానికి, రైతు మనో వికాసానికి, దేశ ప్రగతికి మాయమవుతుంది.

సేంద్రియ వ్యవసాయంలో అవరోధాలు :

1. మొత్తం సాగు భూమికి కావలసిన సేంద్రియ పదార్ధాన్ని సేకరించడం కష్ట సాధ్యం
2. రైతుకు పశు పోషణ సామర్ధ్యం తగ్గి పశువును పోషించలేకపోవడం వల్ల సేంద్రియ ఎరువు తయారీ తగ్గింది.
3. రైతు జీవన శైలిలో మార్పు వల్ల సేంద్రియ పదార్ధాలు తయారీకి సుముఖంగా ఉండరు.
4. సేంద్రియ ఎరువు ప్రభావం మొక్క పెరుగుదలపై ఆశించినంత లేకపోవడం వల్ల రైతు రసాయనిక ఎరువుపై మొగ్గు చూపిస్తున్నారు.
5. కవులు చేసే రైతు సేంద్రియ ఎరువుపై శ్రద్ద చూపరు.
6. అధిక దిగుబడి వంగడాలు, హైబ్రీడ్ సేంద్రియ ఎరువు వాడకం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు
7. సేంద్రియ ఎరువు వల్ల నాణ్యత పెరిగినా దిగుబడు రసాయనిక ఎరువు వల్లే పెంచవచ్చు.
8. నీటి ఎద్దడి ప్రాంతాల్లో సేంద్రియ ఎరువు సమీకరణ, సేంద్రియ సేద్యం కష్ట తరమవుతుంది.
9. సేంద్రియ ఎరువుతో పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల రైతు దాని వైపు మొగ్గు చూపడం లేదు.

సేంద్రియ, రసాయనిక ఎరువును సమర్థవంతంగా ఉపయోగించుటకు సూచనలు :

ఎరువు సామర్థ్యం పెంచటానికి ప్రతి కిలో పోషక పదార్థం నుండి గరిష్ట వ్యవసయోత్పత్తి సాధించడానికి ఈ దిగువ తెలిపిన చర్యలు, సాగు పద్ధతు దోహదం చేస్తాయి.
1. ప్రాంతానికి అనువైనవి, వేసిన ఎరువుకు అత్యధికమైన ప్రతిఫలం ఇవ్వగలిగే పంటలు, వంగడాలు ఎంపిక చేయాలి.
2. ఎరువు నుండి పూర్తి ప్రతిఫలం రావడానికి, ఆ ప్రాంతానికి తగిన సమయంలో విత్తడం లేక నాటు వేయడం చేయాలి.
3. మొక్క మధ్య దూరం, రకాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, మార్చుకోవాలి. ఉదా: సార్వాలో వరి వరుస మధ్య 15 సెం. మీ. వరుసలో మొక్క మధ్య 10 సెం. మీ. దూరం ఉండేటట్లు నాటుకోవాలి. దాళ్వాలో 10 సెం. మీ. I 10 సెం. మీ ఎడంగా ఉండేటట్లు నాటాలి.
4. ఏ పంట పండిరచినా, ఏ నేలోనైనా, ఏ కాలంలోనైనా సేంద్రియ ఎరువు పొలానికి వేసినప్పుడు పోషక విడుదల జరిగి మొక్కకు వాటి లభ్యత పెరుగుతుంది.
5. భాస్వరపు ఎరువు ప్రతిఫలం సార్వాలో కంటే దాళ్వాలో ఎక్కువగా ఉంటుంది. భూసారపరీక్షను అనుసరించి దాళ్వాలో భాస్వరపు ఎరువు వేయటం మంచిది.
6. భాస్వరపు ఎరువును విత్తనం వరుసకు 2 1/2-5 సెం. మీ. కింద విత్తనాలకు 5 సెం. మీ. దూరంగా పడేటట్లు వేయాలి. పొటాషియం, భాస్వరపు ఎరువుతోపాటు ప్లేస్‌ మెంట్‌ పద్ధతిలో వేయవచ్చు. రసాయన ఎరువు తేమ ఉండే ప్రదేశంలో వేయాలి.
7. పోటాష్‌ ఎరువును బరువు ఉన్న నేలలో ఒక దఫా గాను, తేలిక నేలలో రెండు దఫాలుగా వేయాలి.
8. ఆమ్లనేలు, ఉప్పునేలలు, క్షార నేలను బాగు చేయడానికి రసాయన ఎరువు వేయక ముందు, ఆమ్లనేలకు సున్నం, చౌడు నేలకు జిప్సం వేయాలి.
9. విత్తిని / నాటిన 10-15 రోజుల్లో కలుపును తీసివేసి మొదటి ధఫా పైపాటుగా రసాయనిక ఎరువు సూటి ఎరువు రూపంలో వేసుకోవాలి .
10. నిదానంగా నత్రజని విడుదల చేసే సాయనిక ఎరువు.
నత్రజని ఎరువు నీటిలో త్వరగా కరిగి మొక్కు తీసుకొనే నత్రజని తక్కువుగా ఉంది. అధిక నత్రజనినే క్రింది పొరలోనికి పోవడం లేదా గాలిలో కలిసిపోవడం జరుగుతుంది. నత్రీకరణ రేటు తగ్గించి, నత్రజని సామర్థ్యాన్ని పెంచుటకు ఈ క్రింది ప్రక్రియను చేపట్టవచ్చు. దీనివల్ల నత్రజని నష్టాన్ని తగ్గించవచ్చు.
. గంధక పూత యూరియ : యూరియ పై గంధకం పూత వల్ల నత్రజని మొక్కకు కావాల్సినంత వరకే ఇస్తూ, నష్టాన్ని తగ్గిస్తాయి.
. వేప పిండి, కానుగ పిండి పూత పెట్టిన యూరియ : ప్రతి వంద కిలో యూరియాకు 20 కిలోల వేప పిండి లేదా కానుగ పిండితోగాని పూత పెట్టిన యూరియ సామర్థ్యం పెరుగుతుంది.
. తారు పూత పెట్టిన యూరియ : తారు కరిగించి తగినంత యురియాతో కలిపిన వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
. యూరియా సూపర్‌ గ్రానులెస్‌ (పెద్ద గుళికు) : 1-3 గ్రా. బరువు గల గుళికకు వాడుక చేయడం ద్వారా నత్రజని సామర్థ్యాన్ని పెంచవచ్చు.
11. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పోటాష్‌ ఎరువుపైనే రైతు ధ్యాస పెట్టుతున్నారు. కాని సూక్ష్మ పోషకాల పై కూడా వారు దృష్ట్టిపెట్టాలి.
12. నేలలో జింకు లోపం నివారణకు ఎకరానికి 20 గ్రా. జింకుసల్ఫేట్‌ దుక్కిలో వేసి కలియ దున్నినట్లయితే వరి పైరును జింకు లోపం నుంచి నివారించవచ్చు. పంట పై జింకు లోపం కనబడినప్పుడు ఎకరానికి 500 గ్రా. జింకు 6-7 రోజు వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి. పంట పై ఇనుము లోపం నివారణకు 20-30 గ్రా. అన్నభేది, 2-3 గ్రా. నిమ్మ ఉప్పు ఎకరానికి 500 గ్రా. జింకు సల్ఫేట్‌ 6-7 రోజు వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

Leave Your Comments

బంగాళా దుంప సాగు చేసే పద్ధతులు

Previous article

చేపల దిగుబడిని పెంచే మేత – యాజమాన్యం

Next article

You may also like