సేంద్రియ వ్యవసాయం

Organic Fertilizer: సేంద్రియ ఎరువు – ప్యాకింగ్ జాగ్రత్తలు.!

0
Organic Fertilizer – Packing Precautions
Organic Fertilizer – Packing Precautions

Organic Fertilizer: పక్క పొలంలో ఒకవేళ రసాయనిక ఎరువులు వాడితే దాని నుంచి సేంద్రియ పొలంలోకి రసాయనాలు రాకుండా అరికట్టవచ్చు. ధృవీకరణ సంస్థ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం భద్రపరచడం, ప్యాకింగ్, లేబిల్ చేయటం, రవాణాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాకింగ్ కి ఉపయోగించిన పదార్ధం నేలలో తేలికగా కలిసి పోయేలా ఉండాలి. న్యూస్ పేపర్ని ప్యాకింగ్కి ఉపయోగించకూడదు. అలాగే సర్టిఫైయింగ్ ఏజెన్సీ లేబుల్ ప్రతి ఉత్పత్తి మీద ఉండేలా జాగ్రత్త పడాలి. అంతే కాకుండా సేంద్రియ ఉత్పత్తులను రసాయనిక ఉత్పత్తులతో కలిపి రవాణా చేయకూడదు. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మార్పిడి కాలంలో దిగుబడులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రభుత్వ సంస్థలు సబ్సిడీలు ఇచ్చినా రైతులు భరించగలరా? మధ్యలో అపేయచ్చా? లేదా అతని ఉత్పత్తులు మార్కెట్లో ఎగుమతికి సరిపడా నాణ్యత కలిగి ఉంటాయా? వినియోగదారుడు స్థానిక మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులపై ఆసక్తి చూపుతాడా? అనేవి సామాన్య మానవుడికి ప్రశ్నార్థకరంగా ఉన్నాయి. అందువల్ల రైతులు ఈ ప్రశ్నలను గుర్తుంచుకొని సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపాలి. దీనివల్ల నేల, నీరు, గాలి పరిశుభ్రంగా ఉండటమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు మంచి నాణ్యత కలిగి రసాయనాల నుంచి కలుషితం కాకుండా ఉంటాయి.

Also Read: Bajra Millets Health Benefits: సజ్జల్లోని పోషక విలువలు – వాటి ఉపయోగాలు

Organic Fertilizer

Organic Fertilizer

సేంద్రియ వ్యవసాయంలో వివిధ అంశాలు:

భూమిని సారవంతం చేయడానికి,
పెట్టుబడులు తగ్గించుకునేందుకు సేంద్రియ వ్యవసాయంపై సరైన అవ గాహన కలిగి ఉండాలి. దీనిలోని బాగా తెలిసి ఉండాలి. దీనికి గాను కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి.

1. పచ్చిరొట్ట, కంపోస్టింగ్ ద్వారా భూమిని సారవంతం చేయవచ్చు.
2. సేంద్రియ జీవన ఎరువులు వాడి భూసారాన్ని పెంపొందించటం.
3. వృక్ష సంబంధ పదార్థాలు, వేప పిండి, సహజ సిద్ధమైన పరాన్నజీవుల వల్ల చీడపీడలను అరికట్టడం.

సమగ్ర భూసార సంరక్షణ:

దీనిని పంట మార్పిడి, పచ్చిరొట్టలు, పశువుల ఎరువు, వర్మికంపోస్ట్, పంటల అవశేషాలు, ఇంకా ఏమైనా సేంద్రియ పదార్థాల వాడకం వల్ల సాధించవచ్చు.

జీవన ఎరువులు:

నత్రజని కొరకు అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లాను, భాస్వరం కొరకు ఫాస్ఫో బాక్టీరియం, మైకోరైజాలను వాడవచ్చు.

బయోడైనమిక్ వ్యవసాయం:

ఆకాశంలోని కాస్మిక్ ఎనర్జీ కూడా మొక్క ఎదుగుదలకు, మొక్కల్లోని చర్యలకు ఎంతో దోహదపడుతుంది. ఎలాగంటే సూర్యుడు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కల ఎదుగుదలకు తోడ్పడితే చంద్రుడు మొక్కల్లో నేలలో తేమను ప్రభావితం చేస్తుంది.

చీడపీడలను అరికట్టడం:

చీడ పీడలను తట్టుకొనే వంగడాలను సాగుచేయడం ద్వారా సేంద్రియ వ్యవసాయంలో చీడపీడలను అరికట్ట వచ్చు. అంతేకాకుండా జీవనియంత్రణ పద్ధతుల ద్వారా సూక్ష్మజీవులు, జీవ సంబంధిత క్రిమిసంహారకాలను ఉపయోగించి కూడా అరికట్టవచ్చు. పైన చెప్పుకొన్నవన్నీ దృష్టిలో పెట్టుకొని సేంద్రియ వ్యవసాయంలో విజయం సాధించటానికి కృషి చేయాలి. సేంద్రియ ఉత్పత్తులు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఉండాలని, మన భావితరాలకు కాలుష్యరహిత పర్యావరణాన్ని, నీరు, ఆహారాన్ని అందించగలిగేలా ఉండాలి.

Also Read: Bugga’s Organic Milk: బుగ్గ సేంద్రియ పాలు.!

Leave Your Comments

Bajra Millets Health Benefits: సజ్జల్లోని పోషక విలువలు – వాటి ఉపయోగాలు

Previous article

RRR Natu Natu Song: ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!

Next article

You may also like