ఉద్యానశోభచీడపీడల యాజమాన్యంసేంద్రియ వ్యవసాయం

పండ్లు మరియు కూరగాయల నుండి పురుగు మందుల అవశేషాలను తగ్గించే పద్ధతులు

0

పురుగు, తెగులు మరియు కలుపు నివారణ మందులు విచక్షణా రహితంగా పంటల పై పిచికారి చేయడం వలన కొన్ని రకాల మందులు వాటి అవశేషాలు కొన్ని సంవత్సరాల వరకు విచ్ఛిన్నం కాకుండా ఉంటాయి. మనం తినే వ్యవసాయ ఉత్పత్తులలో వీటి అవశేషాలు ఉండటం వల్ల ప్రతి రోజూ కొంత సూక్ష్మ మొత్తంలో మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతే కాకుండా పర్యావరణంలో అన్ని రకాల ప్రాణుల పై కూడా ఈ అవశేషాలు రక్తము మరియు కొవ్వు పదార్ధాలతో పేరుకు పోవటం వల్ల అనేక రకాల దీర్ఘ కాలిక రుగ్మతలను కలగ చేస్తాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా క్యాన్సర్, శిశుమరణాలు, గుండె జబ్బులు, అంగ వైకల్యం లాంటి విష ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా గమనించడం జరిగింది. అయితే ప్రపంచ వాణిజ్యీకరణ నేపధ్యంలో ముఖ్యంగా మన దేశం నుండి జరుగుతున్న ఎగుమతుల్లో సస్యరక్షణ మందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటటం వల్ల కొన్ని ఎగుమతులు తిరస్కరించబడ్డాయి. ఉదా: 2017వ సంవత్సరంలో మామిడి, ద్రాక్ష, వేరుశనగ, కరివేపాకు, మిరప మరియు రొయ్యలు మొదలగునవి అమెరికా, వియత్నామ్, ఐరోపా, సౌదీ అరేబియా, జపాన్ మరియు బూటాన్ వంటి విదేశీ మార్కెట్లో తిరస్కరింపబడ్డాయి. హెచ్.సి.హెచ్, ఎథియన్, మలధియాన్ వంటి పురుగు మందుల అవశేషాలను త్రాగు నీటిలో గుర్తించడం జరిగింది.

(: Delhi, Gaziabad, Sonipat, IARI, 2011) హెచ్.సి.హెచ్, సైపర్మెత్రిన్, ఫెన్వర్జెట్, క్లోరిపైరిఫాస్, ప్రొఫెనోఫాస్, మోనోక్రోటోఫాస్, డి.డి.టి వంటి పురుగు మందుల అవశేషాలను తల్లి పాలలో గుర్తించడం జరిగింది. (మూలం: Daiwan et al, Punjab, 2013, పశువులు తీసుకునే ఆహారంలో హెచ్.సి.హెచ్, డి.డి.టి వంటి పురుగు మందుల అవశేషాలను గుర్తించడం జరిగింది. డి.డి.టి వంటి పురుగు మందుల అవశేషాలను కోళ్ళ గుడ్డులో గుర్తించడం జరిగింది. బాస్మతి వరిలో కర్బెండాజీమ్, ట్రైసైక్లోజోల్, ఇమిడాక్లోప్రిడ్, బైఫెన్ త్రిన్, బూప్రోఫెజిన్, ఇసోప్రొధయోలిన్, ట్రైజోఫాస్ వంటి పురుగు మరియు తెగుళ్ళ మందుల అవశేషాలను గుర్తించడం జరిగింది.

ఉత్తరాఖండ్ లో ఐదు జిల్లాలో (US Nagar, Naintal, Haridwar, Dehradun, Champavat) కూరగాయల పంటలలో సైపర్ మెట్రిన్, ఇమిడాక్లోప్రిడ్, క్లోరిపైరిఫాస్, ఎండోసల్ఫాన్, కార్బెండజీమ్ వంటి పురుగు మందుల అవశేషాలను గమనించడం జరిగింది. (Chauhan et al., 2012) ప్రొఫెనోఫాస్, మోనోక్రోటోఫాస్, కార్బమెట్, డి.డి.టివంటి పురుగు మందుల అవశేషాలను తేనెలో గుర్తించడం జరిగింది.

తినే ఆహారంలో పురుగు మందుల అవశేషాలను తగ్గించే పద్ధతులు:

సబ్బింగ్ : పురుగు మందుల అవశేషాలను తగించడానికి ముఖ్యంగా పుచ్చకాయలను, క్యారెట్ మరియు బంగాళాదుంప వంటి దుంపలను 10 నుండి 15 సెకన్ల పాటు మృదువైన బ్రష్తో స్క్రబ్ చేసి, ఆ తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నీటితో కడగడం: పండ్లు మరియు కూరగాయలను తినే ముందు నీటితో కడిగి స్వీకరించడం మంచిది. కూరగాయలను వండే ముందు వాటి పై ఉన్న తొక్కును తీసివండడం మంచిది. పండ్లు మరియు కూరగాయలను నీటితో కడిగి పురుగు మందులను తొలగించడంలో వివిధ నిర్మూలన ప్రక్రియల పై ఆదరపడి ఉంటుంది. ముఖ్యంగా పురుగు మందుల రసాయనిక స్వభావం, పండ్లు మరియు కూరగాయల రకాలు మరియు పర్యావరణ పరిస్థితులు పురుగు మందుల అవశేషాలను తొలిగించడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అవశేషాల స్థానం, పండ్లు మరియు కూరగాయలో కొన్ని అవశేషాలు లోతు పొరల్లో ఉండడం, మరియు పురుగు మందుల ద్రావణీయతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు పండ్లను మరియు కూరగాయలను కడగి తినటం చాలా మంచిది.

రసాయనలతో కడగడం: గృహంలో వినియోగించే పండ్లను

మరియు కూరగాయలను 2 నుండి 10 శాతం ఉప్పు ద్రావణంతో లేదా సోడియం క్లోరైడ్ సోడియం కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ (వంట సోడా)లేదా వెనిగర్ (ఎసిటిక్ ఆమ్లం) లేదా సిట్రిక్ ఆమ్లం లేదా ఆస్కార్బిక్ ఆమ్లం లేదా ఇథనాల్ లేదా పసుపు లేదా చింతపండు లేదా క్లోరినేటెడ్ మరియు ఓజోనేటెడ్ నీరు మొదలైన అనుకూలమైన పద్ధతులను ఉపయోగించి పండ్లలో మరియు కూరగాయలలో పురుగు మందుల అవశేషాలను తొలిగించవచ్చును. పండ్లు మరియు కూరగాయల పై ఉన్న తోలును తియడం ద్వారా ఉపరితలంపై కనిపించే క్రిమిసంహారక మందుల అవశేషాలు తొలగిపోతాయి. మామిడి, నిమ్మ, యాపిల్, పియర్, కివీ వంటి పండ్లు మరియు పొట్లకాయ వంటి కూరగాయల తొక్కను తోలించడం వల్ల పురుగు మందుల అవశేషాలు తగ్గుతాయి. క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాలపై ఉన్న మొదటి 2-3 ఆకులను తిసివేయడం వల్లన పురుగు మందుల అవశేషాలు తగ్గుతాయి. కూరగాలను ఉప్పు నీటి ద్రవణంతో శుభ్ర పరచి ప్రెషర్ కుక్కర్ తో వుడికించి నట్లయితే కొన్ని అవశేషాలు పూర్తిగా తొలగించ డానికి ఆస్కారం ఉంటుంది.

U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు పండ్లు మరియు కూరగాయలలో క్రిమిసంహారక మందుల అవశేషాలు తొలగించ డానికి సబ్బు లేదా డిటర్జెంట్ ఉపయోగించ వద్దు అని సూచించారు.

కౌల్ హరీప్రీత్ 2024 వ సంవత్సరంలో వారి పరిశోదనలో మిరప కాయలను 4% ఎసిటిక్ ఆమ్లంలో నానబెట్టి, కుళాయి నీటినతో కడగడం ద్వారా 70.7-74.7% ఇండాక్సాకార్బ్ మరియు ధయోమిధాక్సమ్ పురుగు మందుల అవశేషాలు తగ్గినట్లు గుర్తించారు. తరువాత 0.1% బేకింగ్ సోడతో (61.2-74.9%) ఇండాక్సాకార్బ్ మరియు ధయోమిథాక్సమ్ పురుగు మందుల అవశేషాలు తగ్గినట్లు గుర్తించారు. అయితే, కాయలను ఉడక పెట్టినప్పుడు 78.8% ఇండాక్సాకార్బ్ మరియు ధయోమిథాక్సమ్ పురుగు మందుల అవశేషాలు తగ్గినట్లు గుర్తించారు.

2024వ సంవత్సర0లో రాజీవ్ కాంబోజ్ వారి పరిశోదనలో మిరపకాయలను వేడినీటితో కడగడం వల్ల సైంట్రానిలిప్రోల్ పురుగు మందు అవశేషాలు 86% వరకు తగ్గింనట్టు గుర్తించారు. 2017వ సంవత్సరంలో సుధాకర్ వారి పరిశోదనలో టమాటోలో డైమిధోయెట్, లాండా సైహలో త్రిన్, ప్లూబెండమైడ్ మరియు ప్రొఫెనోఫాస్ వెజ్జి వాష్ తో కడగడం వల్ల పురుగు మందు అవశేషాలు55-76% వరకు తగ్గింనట్టు గుర్తించారు.

 

Leave Your Comments

బీర సాగులో మహిళా రైతు విజయగాథ

Previous article

You may also like