Biogas: మనం గొప్పగా ఊహించుకునే ఈ నవ నాగరిక సమాజంలో మనిషి ప్రతి నిత్యం అతి చిన్న అవసరాలకు సైతం ఏదో ఒక యంత్రం లేక విద్యుత్ పరికరాల పై ఆధారపడి జీవించుచున్నాడు. మొదట్లో ఎదో చిన్న చిన్న పరికరాలు వాడే మనిషి నేడు అధిక శక్తి వినియోగించే యంత్రాలకు అలవాటు పడి, అవి లేకపోతే బ్రతకలేని స్థాయికి దిగజారాడు. ఈ యంత్రాలకు అధిక శక్తిని వినియోగిస్తూ వాటి క్షీణతకు దోహద పడుతున్నాడు. ఫలితంగా తలసరి ఇంధన లభ్యత రోజు రోజుకు బాగా తగ్గిపోయి మళ్ళీ మనం చీకటి రోజులు చూడవలసిన రోజు త్వరలోనే మన ముందుకు రానుంది.
నేటి మన అవసరాల కొరతను కొంత వరకు అయిన తీర్చగలిగిన శక్తి బయోగ్యాస్ ఇంధనం కలదు. దీనిని గోబర్ గ్యాస్ అని కూడా అంటారు.
బయోగ్యాస్: పాడి పశువుల వ్యర్ధ (పేడ) పదార్థాలు, చెట్ల ఆకులు మరియు వంట గది వ్యర్థాలను గాలి రహిత స్థితిలో పులియ బెట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే వాయువును బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అంటారు.
ఈ వాయువులో ప్రధానంగా మిథేన్ సుమారు 50-90 శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 25-45 శాతం, నైట్రోజన్ 0-10 శాతం, హైడ్రోజెన్ 0-3 శాతం మరియు నీరు 2-7 శాతం వరకు ఉంటాయి.
పాడి పశువుల వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారగుట అనేది నాలుగు దశలలో జరుగుతుంది. అవి 1. వ్యర్థ పదార్థాల లిక్విఫికేషన్ లేదా హైడ్రోలైసిస్ 2. ఎసిడిఫికేషన్ 3. ఎసిటిక్ యాసిడ్ తయారగుట మరియు చివరకు మిథేన్ వాయువు తయారవుతుంది. ఒక కి.లో పాడి పశువుల పేడ నుండి సుమారు 0.03-0.04 క్యూబిక్ మీటర్ల గోబర్ గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది.
Also Read: Bio Fertilizers Importance in Agriculture: వ్యవసాయంలో జీవన ఎరువుల వాటి ప్రాముఖ్యత.!
రెండు క్యూబిక్ మీటర్ల గోబర్ గ్యాస్ ప్లాంట్ ను మొదటి సారిగా ప్రాంభించాలంటే సుమారు 2 టన్నుల పేడను నీటితో కలిపి బయోగ్యాస్ ప్లాంట్ ఇన్లెట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. దీనిని పంపించిన తరువాత ఈ ప్లాంటులోకి ఎటువంటి గాలి చొరబడకుండా దీని పై మూత వెయ్యాలి. 2-3 రోజులలో ఈ పేడ అంత ఎనరోబిక్ (గాలి రహిత) పెర్మంటేషన్ జరిగి మిథేన్ వాయువు (బయోగ్యాస్) తయారవుతుంది . ఈ గ్యాస్ను ఒక పైపు ద్వారా వంట గదిలోని స్టాకు కనెక్షన్ ఇచ్చి వంట గది అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
గోబర్ గ్యాస్ ప్లాంట్ నుండి బయోగ్యాస్ తయారైన తరువాత మిగిలిన వ్యర్ధాలు (స్లర్రి) అవుట్లెట్ పైపు ద్వారా బయటకు వస్తుంది. ఈ స్లర్రీని వానపాములు వదిలినట్లైతే పర్మి కంపోస్టు తయారవుతుంది. ఈ విధంగా పాడి పశువుల పేడ నుండి బయోగ్యాస్ కాకుండా మంచి జీవ రసాయనాలు గల వర్మి కంపోస్టు కూడా తయారవుతుంది. 2 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్కు ప్రతిరోజు సుమారు 15 కిలో గ్రాముల పేడ అవసరముంటుంది.
ఈ గోబర్ గ్యాస్ను 1930 సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్తలు కనుగొనుట జరిగింది. భారత ప్రభుత్వం 1981 సంవత్సరంలో న్యామరల్ బయోగ్యాస్ మరియు మెస్మర్ మేనేజ్మెంట్ ప్రొగ్రామ్ నెలకోలిపి బయోగ్యాస్ ప్రోత్సాహించుట జరుగుతుoది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం మూడు రకాల బయోగ్యాస్ మోడల్స్ ను తయారు చేయగా (1. Khodi village Industrial Commision Model (2) Janatha Model (3) Deena bhandu Model) 36 Deena bhandu Model బాగా ప్రాచుర్యం పొంది నేటికి ఉపయోగంలో ఉంది.
బయోగ్యాస్ ఉత్పత్తి ఉష్ణోగ్రత పైన, పి.హెచ్ విలువ పైన, సి.ఎన్ రేషియో పైన, పోషక విలువల పై, రసాయనాల ప్రభావం పైన, నిలువ ఉండే కాలం పైన ఆధారపడి ఉంటుంది.
Also Read: Nitrogen Fixing Biofertilizers: నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులతో ఎన్నో లాభాలు.!