సేంద్రియ వ్యవసాయం

Integrated Farming Practices: సమగ్ర వ్యవసాయ పద్ధతులు.!

0
Integrated Farming Practices
Integrated Farming Practices

Integrated Farming Practices: వ్యవసాయ రంగం నేడు గడ్డు పరిస్థితుఎదుర్కుంటుంది. సేద్యపు ఖర్చు ఎక్కువ గాను పంటకు తగిన ధరలు లేక పోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల ఆర్ధికం గా దెబ్బ తింటూ మరొక గత్యంతరం లేక వ్యవసాయాన్నే నమ్ముకుని బ్రతుకు తున్నారు.

రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే వ్యవసాయ అనుబంధ వృత్తులను చేపట్టాలి. రైతుల దృక్పదం లో మార్పు రావాలి. కుటుంబ అవసరాలను, మార్కెట్ లో గిరాకీని దృష్టీ లో పెట్టుకోవాలి వాణిజ్యపరం గా వ్యవసాయాన్ని చేయాలి.

అనుబంధం గా పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోట లపై దృష్టి పెట్టాలి.
పాడి పశువులు, కోళ్ళు, చేపలు, రొయ్యలు, తినేటిగాలు పుట్ట గొడుగులు పెంపకం మొదలైన అనుబంధ వృత్తులను చేపట్టాలి. దీనినే సమగ్ర వ్యవసాయ పద్ధతి అంటారు.

సమగ్ర వ్యవసాయ పద్ధతి వలన లాభాలు:-

రైతులు నష్టాలను తాగించుకొని స్థిర ఆదాయం పొందగలడు.

సంవత్సరం పొడవునా పని ఉంటుంది –ఆదాయం ఉంటుంది.

జీవన ప్రమాణo పెరుగుతుంది.

వనరులు పూర్తిగా సద్వినియోగ పరుచు కోవచ్చు.

కుటుంబానికి కావలసిన ధన్యo, పప్పులు, పాలు, గ్రుడ్లు , కూరగాయలు, మాంసం, మొదలైనవి ఎల్లపుడూ లభిస్తాయి. దీనివల్ల జీవన వ్యయం తగ్గుతుంది.

పశుపోషణ వల్ల పాలతో పాటు నాణ్యమైన సేంద్రియ ఎరువు లభిస్తుంది. దీనివలన రసాయన ఎరువులు ఖర్చు తగ్గుతుంది. నేల ఆరోగ్యం గా వుండి దాని నుండి వచ్చే ఫలసాయం ఎక్కువ కాలం నిల్వ వుండడం కాకుండా నాణ్యత కలిగి వుంటుంది.

Also Read: Integrated Farming: సమీకృత వ్యవసాయం తో రూ. 12 లక్షలు సంపాదిస్తున్న రైతు.!

Integrated Farming Practices

Integrated Farming Practices

పశువుల పేడ నుండి గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి గృహ అవసరాలకు వాడు కోవచ్చు. మిగిలిన వ్యర్థ పదార్ధం మంచి పోషక విలువలు కలిగి ఎరువు గా ఉపయోగించు కోవచ్చు.

కేవలం సేద్యం మీద ఆధార పడిన రైతు ఆదాయని కంటే సమగ్ర వ్యవసాయం పాటించిన రైతు రెండింతలు ఆదాయo పొందగలడు.

రైతుల ఆత్మహత్యలు తగ్గు ముఖం పడతాయి.

రాష్ట్రం లో ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలు విశ్లేషి సై పెరట్లో కూరగాయలు, ఇంటి ముందు కోళ్ళు, కొట్టాలలో పశువులున్న రైతు లెవ్వరు ఆత్మహత్య చేసుకోలేదు. పంటలు ఒక్కటే ఆధారం గా చేసుకొని జీవిస్తున్న రైతులు ప్రతికూల పరిస్థితులలో వేరొక ఆధారం లేక మనో దైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడు చున్నారు.

సమగ్ర వ్యవసాయ/ సేద్యపు పద్ధతులు:- గ్రామాలలో రైతులు వివిధ సంఘాలు గా ఏర్పడి వారి కమతము లలో సంఘటితం గా వ్యవసాయం వాటి అనుబంధ వృత్తులను చేపటి ఆధిక లాభాలను పొందవచ్చు. ఈ విధానం లో సంగీటీత పరచిన అనుబంధ వృతుల్లో క్రొత్త విధానాలు అవలంబించి ఆధిక ఉత్పత్తులను సాధించవచ్చు.

Also Read: Integrated farming: సమీకృత వ్యవసాయం తో రూ. 40,00,000 సంపాదిస్తున్నా దంపతులు

Leave Your Comments

Fenugreek Water Benefits: పరగడుపున మెంతి వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.!

Previous article

Banana Cultivation Varieties: అరటి సాగులో రకాలు.!

Next article

You may also like