సేంద్రియ వ్యవసాయం

Organic Farming:సేంద్రీయ వ్యవసాయం.!

1
Organic Farming - The Future of Farming
Organic Farming - The Future of Farming

Organic Farming: మన పూర్వీకులు పాటించిన పద్ధతి ఎటువంటి రసాయనిక ఎరువులు ఉపయోగించకుండానే పంటలు పండిరచేవారు. 1960 – 1965 మధ్యకాలంలో ఎరువుల వాడకం ప్రారంభమైంది, ఇప్పుడు రసాయనలతో మాత్రమే పండిరచే పద్ధతి అలవాటైంది.

రసాయనిక ఎరువులు మాత్రమే కాకుండా చీడ పీడలు మరియు కలుపు నివారణకు పంటలు మాములుగా కాకుండ ఏపుగా పెరిగి పువ్వులు, కాయలు, గింజలు ఎక్కువగా పెరిగేందుకు కృత్రిమ హర్మోనుల వాడకం కూడ ఎక్కువైంది. ఈ విధమైన పరిస్థితి ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక పక్క పెరిగే జనాభా ఆహార భద్రత కొరకు అధిక ఉత్పత్తి చేయవలసిన నేపథ్యంలో అధిక దిగుబడి ఇచ్చే పంట రకాలను, సంకరాలను తయారుచేసి వాటికి సరిపోయేలా రసాయనిక ఎరువులు వాడవలసి వచ్చింది అనే నిజాన్ని అందరు ఒప్పుకోవలసిందే.

Also Read: Organic Farming: సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి ?

Organic Farming

Organic Farming

సేంద్రీయ ఎరువులు తగినంత మొతాదులో లభ్యం కాకపోవడం, రాసాయనిక ఎరువులతో పోలిస్తే వాటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉండటం మరియు దానికి కావలసిన రవాణా, కూలీల అవసరం, సొంత సేద్యం తగ్గి కౌలు సేద్యం పెరగడం, పశు సంపద క్రమేపీ తగ్గిపోయి ఇలా ఎన్నో ఇతర కారణాలు రాసాయనిక సేద్యం వైపు వ్యవసాయాన్ని మళ్ళించాయి.

కేవలం రసాయనలతో వ్యవసాయం పైన మొగ్గుచూపటం వల్ల నేలలో, నీటిలో, ఆహార పదార్థలలో ఆరోగ్యానికి హానికరమైనవి ఉండటం వల్ల ఇది ఆందోళన చెందవలసిన విషయం. ఈ పరిస్థితులని సరిచేసి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులని నడిపించ వలసిన అవసరం చాలా ఉంది. కాని ఇది ఓక క్రమ పద్ధతిలో, ప్రణాళికా బద్దంగా దశల వారీగా జరగవలసి ఉంటుంది..
యువ వ్యవసాయ దారుల్లో వీటి పై అవగాహన కలిపిస్తూ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం. సేంద్రీయ ఉత్పత్తులకు మద్దతుగా నిర్ణయాలను అమలుపరచడం వంటి చర్యలు పాటించాలి.

Also Read: Organic Farming Precautions:సేంద్రియ వ్యవసాయంలో చేపట్టవలసిన చర్యలు.

Leave Your Comments

Organic Farming: సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి ?

Previous article

Murrah Buffaloes: తక్కువ వయసులోనే ముర్రా జాతి గేదెల్లో గర్భధారణ – సరికొత్త పరిశోధనలో వెల్లడి..!

Next article

You may also like