Organic Farming: కొత్తగా ఆలోచించే శక్తి, కష్టపడే గుణం ఉంటే ఉద్యోగంలోనే కాదు వ్యవసాయంలో కూడా మంచి ఆదాయం పొందవచ్చు అని చాలా మంది రైతులు నిరూపించారు. రసాయన ఎరువులు వేస్తూ పంటలు పండిస్తూ ఉన్నారు. ఈ పంటలు తిన్నడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో భిల్వారాకు గ్రామంలో ఉన్న అబ్దుల్ రజాక్ రైతు తన తండ్రి రసాయన ఎరువులతో పండించిన పంటలు తిన్నడం వల్ల అనారోగ్యానికి బారిన పడటం వల్ల సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టాలి అని అనుకున్నారు. సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టి ఇప్పుడు అందరి రైతులకి ఆదర్శంగా నిలిచారు.
అబ్దుల్ రజాక్ 10 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఈ పది ఎకరాల్లో దోసకాయ, టమాటా, క్యాప్సికం, ఆనపకాయ కూరగాయలతో పాటు జామ, నారింజ పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఈ కూరగాయల, పండ్ల తోటల నుంచి ప్రతి సంవత్సరం కోటి రూపాయల వరకు ఆదాయం తీసుకుంటున్నారు. అందులో దాదాపు 30 లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది.
అబ్దుల్ రజాక్ గారు సేంద్రియ వ్యవసాయం చేయడానికి బయోలాజికల్ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. ఈ బయోలాజికల్ లేబొరేటరీలో సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ రసాయనాలను తయారు చేస్తున్నారు. అబ్దుల్ రజాక్ గారు ఇతర రైతులు కూడా సేంద్రియ వ్యవసాయం చేయడానికి ట్రయినింగ్ ఇస్తున్నాడు.
Also Read: Avocado Crop: ఒక చెట్టు నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం తీసుకుంటున్న రైతులు..
పంటలకు జీవామృతం, ఆవు మూత్రం, దేశి ఎరువు ,పచ్చి ఎరువులు ఎలా వాడాలో ట్రయినింగ్ ఇస్తున్నారు. బాక్టీరియల్ కల్చర్, బయో-పెస్టిసైడ్, క్రిసోపా వంటి బయో ఏజెంట్లను కూడా వాడుతున్నారు. వీటి వల్ల పంట దిగుబడి బాగా పెరుగుతుంది. అతను పండించిన పంటని అతని పొలం దగ్గరే అమ్ముకుంటూ మంచి లాభాలని పొందుతూ, ఇతర రైతులకి వ్యవసాయంలో కొత్త పద్ధతులని ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం నుంచి మంచి లాభాలు రావడం వల్ల ఈ రైతుని చూసి వారి గ్రామంలో కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టారు.
Also Read: Woman Farmer: మహిళా రైతు ఈ తోటను తన సొంతగా సాగు చేస్తున్నారు..