Horticultural Production మామిడి : ఈ నెలలో భూమిలో నిద్రా వ్యవస్థలో ఉన్న పిండి పురుగులు బయటపడి చెట్ల పైకి పాకి చెట్లను ఆశిస్తాయి. ఇవి ఆశించిన కొమ్మలపై లీటరు నీటికి 0.5 మి. లీ ఇమిడా క్లోప్రిడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మామిడిని ఆశించే తేనే మంచు పురుగులు పొలుసు పురుగులు మరియు బూడిద తెగులు నివారణకు 3 గ్రా ల కార్భరిల్ తో పాటు 2 మి.లీ హెక్సా కొనజోల్ మరియు 2.5 మి.లీ వేపనూనె లీటరు నీటికి చొప్పున కలిపి ఆకులు,కొమ్మలు,కాండం మొదలు తడిచేలా పిచికారి చేయాలి.
జామ ;- పండినల్లి చిన్న, పెద్ద పురుగులు కొమ్మల చివరల కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. కాయలు ,ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్ధాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు అక్షింతల పురుగు బదనికలను తోటల్లో విడుదల చేయాలి. ఎసిఫేట్ 1 .5 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఉదృతి అధికంగా ఉన్న తోటల్లో చెట్టుకు 250 గ్రా క్లోరిపైరిఫాస్ పొడి మందును పొదల్లో చల్లి మట్టిలో కలిసేటట్లు చేయాలి.
అరటి : ఈ మాసం నుండి చలి పెరగడం వల్ల జింక్ ధాతు లోపం కనిపిస్తుంది. ఆకుల ఈ నెల వెంబడి తెల్లని చారలు ప్రారంభ మై ఆకులు పాలిపోయినట్లు కనబడతాయి. ఆకుల అడుగు భాగాన ముదురు ఊదా రంగు ఏర్పడుతుంది. దీని నివారణకు ఒక్కొక్క మొక్కకు 10 గ్రా జింక్ సల్ఫేట్ భూమిలో వేయాలి ఆకుల పై 2 గ్రా . జింక్ సల్ఫేట్ లీటరు నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 – 3 సార్లు పిచికారి చేయాలి.
బత్తాయి ,నిమ్మ : అంబే బహార్ ( జనవరి పూత ) చెట్లు పూతకు రావడానికి నీరు ఇవ్వడం ఆపి బెట్టకు గురి చేయాలి నల్లి పురుగుల నివారణకు 5 మి.లీ డైకో ఫాల్ లేదా 3 గ్రా గంధకం లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. 15 రోజుల తరువాత రెండో దఫా పిచికారి చేయాలి.
ద్రాక్ష : బూడిద తెగులు నివారణకు కొమ్మలు కత్తిరించిన 65 వ రోజు హెక్సా కొనజోల్ 1 మి.లీ 70 రోజులప్పుడు ఇప్రోవా లి కార్బ + ప్రోపి నెబ్ 3 గ్రా .75 వ రోజు మైక్‌లో బ్యుటానిల్ 0.4 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
సపోట : ఆకు మచ్చ తెగులు నివారణకు 3 గ్రా . కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
ఆపిల్ రేగు : ఈ మాసంలో బూడిద తెగులు ఆశిస్తుంది. లేత ఆకుల పైన , కాయల పైన తెల్లటి మచ్చలు ఏర్పడి తర్వాత అంతా వ్యాపిస్తుంది. నివారణకు డైనో కాప్ 1 మి.లీ లీటరు నీటిలో కలిపి ఉదృతిని బట్టి 2 – 3 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
కూరగాయలు :
టమాట : ఆకు ఎండు తెగులు వల్ల గోధుమ రంగు మచ్చలు మొక్కలోని అన్ని భాగాలకు వ్యాపించి నష్ట పరుస్తాయి. పూత , పిందెను కూడా ఈ తెగులు ఆశిస్తుంది. కార్బండిజం + మ్యాంకో జెబ్ మిశ్రమాన్ని 2.5 గ్రా, లీటరు నీటికి చొప్పున కలిపి పైరు పై పిచికారి చేయాలి ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు టేబు కొనజోల్ 1.5 మి.లీ లేదా అజాక్సీస్టోబీన్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
మిరప : రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గే కొద్ది కొమ్మ కుళ్ళు , కాయ ఎండు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. నివారణకు 1 మి.లీ టేబుకొనజోల్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1 మి.లీ అజాక్సీ స్ట్రోబిన్ లేదా పైరాక్సీ స్ట్రోబిన్ లీటరు నీటికీ కలిపి పిచికారి చేయాలి. బూడిద తెగులు కూడా ఈ మాసంలో వ్యాపిస్తుంది దీని నివారణకు గంధకం 3 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
బెండ : తెల్ల దోమ నివారణకు 1.5 గ్రా ఎసిఫేట్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. కాయ తొలుచు పురుగుల నివారణకు కార్భరిల్ 3 గ్రా లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
వంగ : ఆకు మాడు తెగులు నివారణకు మ్యాంకో జెబ్ 2.5 గ్రా లేదా కార్భండజిమ్ 1 గ్రా లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. Horticultural Production
తీగ జాతి కూరగాయలు : బూడిద తెగులు నివారణకు డైనో క్యాప్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. తీగ జాతి పంటల పై గంధకం సంభందిత తెగుళ్ళ మందులు వాడరాదు. దీని వలన ఆకులు మాడిపోతాయి. డిసెంబర్ రెండవ పక్షం నుండి నాటుకోవచ్చు. 2 – 2.5 ఎడంతో 60 సెం.మీ వెడల్పు గల నీటి కాలువలను తయారు చేసుకొని కాలువలకు ఇరు వైపులా 30 – 50 సెం.మీ ఎడంతో విత్తనాలు విత్తుకోవాలి. 500 – 600 గ్రా విత్తనం ఎకరాకు సరిపోతుంది.
ఫ్రెంచి చిక్కుడు : ఈ పంట సాగుకు చల్లని వాతావరణం అనుకూలం. ఈ మాసం చివరి వరకు నాటు కోవచ్చు . ఎకరాకు 20 – 25 కిలోల విత్తనం సరిపోతుంది. పాల కూరను కూడాఈ మాసం చివరి వరకు నాటుకోవచ్చు.
అల్లం : ఈ మాసంలో అల్లం దుంపలు పక్వానికి వస్తాయి. తవ్వుకోవచ్చు ఆకులు పసుపు పచ్చగా మారి ఎండిపోవడం , కాండం ఎండిపోవడంను బట్టి అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లు గుర్తించవచ్చు.
పసుపు : ముర్రాకు తెగులు నివారణకు లీటరు నీటికి 1 మి.లీ ప్రోపి కొనజోల్ జిగురు కలిపి ఆకులపై పిచికారి చేయాలి. వారం రోజుల తరువాత 1 గ్రా హైరాక్సీ స్ట్రోబిన్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. దుంప ఈగ వల్ల దుంపల్లో బియ్యపు గింజల మాదిరిగా తెల్లటి పురుగులు ఏర్పడతాయి. వీటి నివారణకు తోటల్లో నీరు పెట్టిన తరువాత కార్బో ప్యురాన్ 3 జి గుళికలను ఎకరాకు 5 కిలోల చొప్పున ఇసుకలో కలిపి సాళ్ళలో వేయాలి. December Garden Guide
డా . యమ్ వెంకటేశ్వర రెడ్డి , అసోసియేట్ ప్రొఫెసర్
డా. ఎ నిర్మల
డా . కె చైతన్య
డా . ఎ.మనోహర్ రావ్ , రిటైర్డ్ ప్రొఫెసర్
వ్యవసాయ కళాశాల , జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
రాజేంద్ర నగర్ , హైదరాబాదు
Agriculture News. Indian Agriculture Updates, Latest Agriculture News