Green Manure Crops: పోషక విలువలు సమృద్ధిగా, సమతుల్యతా కలిగిన రసభరిత పచ్చని మొక్కలు వాటి ఆకులను పచ్చి రొట్ట ఎరువులు అంటారు.
పచ్చి రొట్ట ఎరువులు భూమికి రెండు విధాలుగా అందించవచ్చు.
హరిత మొక్కల ఎరువులు
హరిత ఆకు ఎరువులు.
పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్య కాలవ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ పచ్చి రొట్ట ఇచ్చే మొక్కలను పెంచి వాటిని నెలలో కలియ దున్నడం ద్వారా నేలకు పోషకాలు అందించడాన్ని గ్రీన్ మన్యూర్ అంటారు.
హరిత మొక్కల పైరుకు ఉండాల్సిన లక్షణాలు
తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చి రొట్టను ఇచ్చేదిలా ఉండాలి.
అన్ని రకాల నేలల్లో పెరగాలి. పచ్చి రొట్టలో పీచు శాతం తక్కువగా ఉంది,ఎక్కువ ఆకు కలిగి రాసభరీతంగా ఉండాలి. నేలను కలియ దున్ననప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసేటట్లు ఉండాలి.పచ్చి రొట్ట పంటలు వేర్లు భూమి లోతుకు పోయేలా ఉండాలి. త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదల అరికట్టేదిగాఉండాలి. పప్పు జాతికి చెందిన పచ్చి రొట్ట ఎరువు అయితే గాలిలో నత్రజని స్థిరీకరించి నేల సారాన్ని పెంచుతుంది.
Also Read: Homemade Fertilizers Uses: జీవన ఎరువుల వల్ల ఉపయోగాలు.!

Green Manure Crops
పచ్చి రొట్ట ఎరువులుగా ఉపయోగించే మొక్కలు:
జనుము
జీలుగా
పిల్లి పెసర
సీమ జీలుగా
నీలి
అడవి నీలి
పచ్చి రొట్ట ఎరువుల సాగులో అవరోధాలు: పచ్చి రొట్ట వేసిన తర్వాత నేలలో వేసి కలియ దున్నడానికి సుమారు 60 రోజుల వ్యవధి కావాలి పంటల ప్రణాళిక వేసుకోవడం ఇబ్బంది గా ఉంటుంది. ఎపుగా పెరిగే పచ్చి రొట్టను ఇవ్వాలి అంటే తేమ అవసరం అవుతుంది.అన్ని ప్రాంతాలలో నీటి లభ్యత ఉండదు. పశుగ్రాస లక్షణాలు ఉన్న పచ్చి రొట్ట ఎరువులకు పిల్లి పెసర,జీలుగా, పశువులు బెడదా ఎక్కువగా ఉంటుంది.వీటిని ఆశించే చీడ పీడలా తర్వాత సాగు చేసి పంటకు నష్టం కలిగించవచ్చు.పచ్చి రొట్ట విత్తనాల గిరాకీ ఎప్పుడు ఒకేలా ఉండదు. అందువల్ల వీటిని అందుబాటులో ఉంచడానికి ఇష్టపడరు
పచ్చి రొట్ట ఎరువుల సాగులో మెలకువలు: ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమ ను సాద్వినియోగపరచుకొని పచ్చి రొట్ట ఎరువులు విత్తుకోవాలి. ఉదా : వరి కోసే ముందు జనుము, పిల్లీ పెసర,జల్లి వెంటనే వరి కోస్తారు.తేమ చాలని ప్రాంతాల్లో వేసవి దుక్కి దున్నీ తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం.
పసుపు కంద, చెరకు వంటి పంట వరుసల మధ్య కాల వ్యవధిలో పచ్చి రొట్ట పూత సమయంలో కలియ దున్నవచ్చు.సాధారణంగా పచ్చి రొట్ట పైర్లు చల్లుకునేటప్పుడు అధిక మోతదు విత్తనం ఉపయోగించిన మొక్కలు తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి. లేనిచో జీలుగా వంటి పచ్చి రొట్ట ఎరువులు మొక్క ఎత్తు పెరిగి కాండం పీచు ఏర్పడి చివకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
Also Read: Grapes Hormonal Control: ద్రాక్షలో హార్మోన్లు ఎప్పుడు వాడాలి.!