Chemical Pesticides: రసాయన ఎరువులతో పండించిన పంటలో విపరీతంగా రసాయన అవశేషాలు ఉంటున్నట్లు ఇప్పటికే నివేదికలు చెప్తున్నాయి. ఈ మేరకు సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వాలు కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కాగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సహజ వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా జరిగే ప్రయోజనాలను జాతికి వివరించారు. మరో వైపు వ్యవసాయ విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల్లో సేంద్రియ వ్యవసాయ అంశాన్ని చేర్చాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రసాయన పురుగుమందుల రిజిస్ట్రేషన్ ఫీజును 5,000 నుండి భారీగా పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
బయో-పెస్టిసైడ్‌లను ప్రోత్సహించడానికి ప్రతిపాదనల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ తమ వాటాదారుల నుండి అభిప్రాయాన్ని కోరింది. కాగా పరిశ్రమ అంచనాల ప్రకారం, వ్యవసాయ రసాయనాల మార్కెట్ ఇప్పుడు 50,000 కోట్ల నుండి 2026 నాటికి 80,000 కోట్లకు పెరుగుతుంది. అయితే అవినీతి మరియు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడే నకిలీ అభ్యర్థులను గుర్తించడానికి క్రాప్ లైఫ్ ఇండియా మద్దతు ఇస్తుంది.
మొత్తానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సహజ వ్యవసాయాన్ని అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేట్ పాఠ్యాంశాల్లోకి చేర్చాలని నిర్ణయించింది. UG/PG కోర్సులలో చేర్చడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు సహజ వ్యవసాయ నిపుణులతో సంప్రదించి ICAR విద్యా విభాగం సిలబస్‌ను అభివృద్ధి చేస్తుంది అని ICAR అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ SP కిమోతీ , ఇన్‌స్టిట్యూట్‌ల డైరెక్టర్లు మరియు వైస్-ఛాన్సలర్‌లందరికీ పంపిన లేఖలో తెలిపారు.