సేంద్రియ వ్యవసాయం

Dryland Agriculture: మెట్ట వ్యవసాయంలో ఏ పంటలు పండిస్తారు.!

0
Dryland Agriculture in India
Dryland Agriculture in India

Dryland Agriculture: వర్షాధారంగా పంటలు పండించే పద్ధతి ని “మెట్ట వ్యవసాయం” అంటారు. మెట్ట వ్యవసాయం లో పండించే పంటలను “మెట్ట పంటలు” అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో సాగు చేయబడు విస్తీర్ణం లో దాదాపు 70 % వరకూ వర్షాధారం కింద సాగు అవుతుంది. ప్రాంతాల వారీ గా చూస్తే తెలంగాణా 80%, రాయల సీమ 70%, కోస్తా జిల్లా లలో 52 % సాగు భూమి మెట్ట వ్యవసాయం క్రింద ఉoది. మెట్ట సాగు క్రింద పండించే ముఖ్యమైన పంటలు – జొన్న, సజ్జ, రాగి, వేరుశెనగ, ఆముదం, కుసుమ, పొద్దు తిరుగుడు పువ్వు, ఉలవ, కంది, పెసర, మినుము, బొబ్బర్లు.వాతావరణ పరిస్థితులు (ముఖ్యం గా వర్ష పాతం, వర్ష పాత వితరణల పై) ననుసరించి పైరు దిగుబడులలో చాల వ్యత్యాసo కనిపిస్తాయి.

మెట్ట ప్రాంత రైతులు చిన్న, సన్న కారు రైతులు – ఆర్థికంగా వెనుకబడిన వారు. కనుక పెట్టుబడి శక్తి చాల తక్కువ వ్యవసాయ జీవనోపాధి కే గాని వ్యాపార రీత్యా కాదు.మెట్ట ప్రాంతాల్లో పంట ఉత్పత్తి సమస్యల (వర్ష పాతం – వితరణ, అధిక ఉష్ణోగ్రతలు, తేలిక నేలలు, అనిశ్చిత వాతావరణ పరిస్థితులు) ననుసరించి పంటలు – ఆ పంటల లో అధిక దిగుబడి వంగడాలు ఎంచు కోవాలి.మెట్ట సేద్యం లో ముఖ్యం గా వర్షపు నీటిని ఆదా చేస్తూ, నేలలో గల తేమను పంట ఉత్పత్తి కి అధికం గా వినియోగపడే సేద్యపు ప్రక్రియలను తప్పక అనుసరించాలి..మెట్ట పైర్లకు కూడా తగు మోతాదులలో ఎరువులు వేసిన పంట దిగుబడులు పెంచ వచ్చు.

Also Read: Sorghum Pest: వానాకాలం జొన్న సాగులో కంకినల్లి మరియు ఎర్రనల్లి పురుగు నివారణ చర్యలు.!

Dryland Agriculture

Dryland Agriculture

మెట్ట వ్యవసాయ చరిత్ర: కేంద్ర ప్రభుత్వం 1883 సంవత్సరం లో “కరువు కమిషన్” ను నియమించింది. వర్షాభావ పరిస్థితులలో ఒక తడి పెట్టాలి అని సిఫారసు చేసింది.భారత ప్రభుత్వం 1925 సంవత్సరం లో థాం హేస్ అను శాస్త్రవేత్తను పూనా సమీపం లో “మంజరి”వద్ద పరిశోధనకు నియమించారు.1926 లో “కనిత్కర్”అను శాస్త్రవేత్త విస్తృత పరిశోధనలు మొదలుపెట్టారు.1928 లో “రాయల కమీషన్” నియమింపబడింది. ఈ కమీషన్ వర్షాధారం లో చిరు ధాన్యాల సేద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అని సూచించింది.

ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, న్యూ ఢిల్లీ వారు కొల్హాపూర్ (మహారాష్ట్ర) బీజాపూర్ (కర్నాటక), హగరి (కర్నాటక), రాయచూర్ (కర్నాటక) మరియు రోహటక్ (హర్యానా) ప్రాంతాలలో ఐదు పరిశోధనా కేంద్రాలను ప్రారంభించిoది. 1943 సంవత్సరం లో కొన్ని క్లిష్ట పరిస్థితులలో ఆ కేంద్రాల లో పరిశోధనలు నిలిపి వేయబడ్డాయి.

మెట్ట సాగు పద్ధతి (DRY FARMING): సంవత్సర వర్షపాతం 750 మి.మీ కన్నా తక్కువ ఉంటుంది. పంట కాలంలో దీర్ఘ కాలం బెట్ట పరిస్థితులు సర్వ సాధారణంపంట నష్టం తరుచు గా సంభవిస్తుంది.ఈ ప్రాంతాలు శుష్క ప్రాంతాలతో సమానం గా ఉంటుంది.తేమ సంరక్షణ పద్ధతులు పాటించడం చాల అవసరం.

మెట్ట భూమి సాగు (DRY LAND FARMING): పంట నష్టం తక్కువ గా ఉండును. దీనికి రెండు కారణాలు లను చెప్పవచ్చు. సంవత్సర వర్షపాతం హెచ్చు గా ఉండవచ్చు నేలలు నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండవచ్చు.నేల మరియు తేమ సంరక్షణ పద్ధతులు పాటించడం.నల్ల రేగళ్ళ లో మురుగు నీరు పోవు సౌకర్యం కల్పించడం.ఈ ప్రాంతాలను అర్ధ శుష్క ప్రాంతాలు గా వర్గీకరిస్తారు.

వర్షాధార సాగు (RAINFED FARMING): వర్ష పాతం 1150 మిమీ కంటే అధికంగా ఉండే ప్రాంతాలు. పంట నష్టాలు తక్కువ బరువు నేలల్లో మురుగు నీరు పోవు సౌకర్యం ముఖ్య సమస్య.

Also Read: Aspergillosis in Animals: పశువుల్లో అస్పార్ జిల్లోసిస్ వ్యాధి ఎలా నిర్ములించాలి.!

Leave Your Comments

Sorghum Pest: వానాకాలం జొన్న సాగులో కంకినల్లి మరియు ఎర్రనల్లి పురుగు నివారణ చర్యలు.!

Previous article

TS Agri Minister: వ్యవసాయం వృత్తి కాదు జీవితం – మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like