పొడి వరిని తడి వరిగా సాగు చేయుట:
తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు సకాలంలో నైరుతి రుతుపవనాల వల్ల మంచి వర్షాలు కురుస్తాయని ఆశించి ముందుగా నార్లు పోసుకొని, సరైన సమయంలో వర్షాలు పడక బోర్లలో మరియు బావుల్లో సరిపడా నీరులేక ప్రధాన పొలం తయారీ ఆలస్యం కావడం వల్ల సరైన సమయంలో నాట్లు వేయలేక ముదురు నారు వేసుకోవాల్సి వచ్చి దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నవి. ఈ సమస్యను అధిగమించడానికి వేసవిలో కురిసే వర్షాలతో పొలాన్ని పొడి దుక్కి చేసుకోవాలి.
Also Read:Trichoderma: నేలకు ఆరోగ్య సంజీవని` ట్రైకోడెర్మా.!
వ్యవసాయ వాతావరణ శాఖ వారి ముందస్తు వాతావరణ సూచనలను అనుసరించి విత్తన శుద్ధచేసిన పొడివిత్తనాలు ఎకరానికి 25 `30 కిలోలు నాగలి లేదా గొర్రుతో సాళ్ళలో దుక్కిలో మట్టితో కలపాలి. ఇలా విత్తిన విత్తనాలు చీమల బారిన పడకుండా రక్షించుకోవాలి. నీటి వసతులు లేని ప్రాంతాలలో వర్షాధారంగా ఆయకట్టు ప్రాంతాలలో సాగు చేస్తారు కాబట్టి వర్షాలు కురిసేంతవరకూ నేలలోనే ఉండి వర్షాలు కురిసిన తరువాత మొలకెత్తుతాయి. వర్షాలు కురిసిన వెంటనే నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిధాలిన్‌్ అనే కలుపు మందును ఎకరాకు 1.5 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఇలా మొలకెత్తిన పంటను జలాశయాలు, చెరువులు, కాలువలు ద్వారా నీరు విడుదలయ్యే వరకు ఆరుతడి పంటలు సాగు చేయాలి. ఆ తరువాత 20 రోజులకు కలుపు సమస్యను అధిగమించడానికి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు బిస్పైరిబాక్ సోడియం అనే కలుపు మందుని 100 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి. తరువాత వర్షాలు బాగా కురిసి, నీరు విడుదలైన తరువాత నీరు నిల్వ ఉంచి సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేసుకోవచ్చు.
దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్దతి:
ప్రస్తుతం వరి సాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతి పై రైతులు ఆసక్తి చూపుతున్నారు ఈ పద్ధతిలో పంట కాలం 7`10 రోజులు తగ్గుతుంది కనుక పంట పది రోజుల ముందుగా కోతకు వస్తుంది. ఈ పద్ధతిలో నారు పెంపకం, నారుపీకడం, నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు ఎకరాకి దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల వరకు తగ్గుతుంది.
ఈ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంటకాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశం ఉంది. అందువలన మన రాష్ట్రంలో ఈ పద్ధతి బాగా ప్రాచుర్యం పొందుతున్నది. వర్షాకాలం కంటే యాసంగిలో చలి తక్కువగా ఉండే జిల్లాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ పద్ధతి చలి ఎక్కువగా ఉండే ప్రాంతంలో, సమస్యాత్మక నేలల్లో అంత అనుకూలం కాదు. ఒక్కోసారి విత్తనం చల్లిన తర్వాత వర్షం వల్ల విత్తనాలు పూర్తిగా కొట్టుకొనిపోయే అవకాశముంది.
విత్తన మోతాదు:
దమ్ము చేసుకున్న పొలంలో నేరుగా వెదజల్లే పద్ధతికై రకాన్ని బట్టి ఎకరాకు 30`40 కిలోల విత్తనాలు 24 గంటలు నానబెట్టి, నానిన విత్తనాలను గొనేసంచిలో 24 గంటలు మండే కట్టి మొలకెత్తిన విత్తనాలను సమంగా వెదజల్లుకోవాలి.
డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా విత్తే పద్ధతి:
డ్రమ్ సీడర్ ద్వారా విత్తే పద్ధతిలో ఎకరాకు 10`15 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకున్నప్పుడు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్ కలిపిన ద్రావణంలో విత్తనాలను 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండే కట్టి కొద్దిగా ముక్కు పగిలిన గింజలను డ్రమ్ సీడర్ లో వేసి విత్తుకోవాలి. డ్రమ్ సీడర్ పరికరానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి.
ప్రతి డ్రమ్ముకి 20 సెంటీమీటర్ల దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలు ఉంటాయి ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాయడానికి వీలుగా ప్రతి డ్రం లో కేవలం 3/4 వంతు గింజలను మాత్రమే నింపాలి. గింజలు నింపిన డ్రమ్ సీడర్ లాగితే ఎనిమిది వరుసల్లో వరుసకి వరుసకి మధ్య 20 సెంటీమీటర్లు దూరంలో గింజలు పడతాయి.
వరుసల్లో కుదురుకి కుదురుకు మధ్య దూరం 5-8 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక్కో కుదురులో 5`6 గింజలు పడడం జరుగుతుంది కొన్ని అనివార్య కారణాలవల్ల కుదురులోని గింజలు 50శాతం దెబ్బతినే మిగిలిన 50 శాతం నుండి వచ్చిన మొక్కల సాంద్రత సరిపోతుంది రకాన్ని బట్టి గింజలు పడటాన్ని బట్టి రంద్రాలను స్టాఫర్స్‌తో మూసుకోవాలి. సన్న గింజ రకాలకు రంధ్రం వదిలి రంధ్రం మూసి వేయాలి. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పు అనగా 20 సెంటీమీటర్లు వచ్చే విధంగా కాలిబాటలు ఉంచుకోవాలి. డ్రమ్ సిడర్‌ని తాడు ఉపయోగించి లాగితే వరసలు బాగా వస్తాయి తద్వారా కోనోవీడర్ తిప్పడానికి వీలుగా ఉంటుంది.
ప్రధాన పొలం తయారీ:
సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు కంటే వీలైనంత బాగా చదును చేసుకోవాలి. ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉండడం చాలా అవసరం. పొలంలో నీరు నిల్వ ఉండకూడదు కాబట్టి నీరు ఎక్కువైతే బయటకు పోవటానికి ఏర్పాట్లు చేసుకోవాలి. పెద్దగా ఉన్న పొలాలను చిన్న మడులుగా విభజించుకొన్నట్లయితే చదును చేయడానికి, నీరు పెట్టడానికి, విత్తనాలు చల్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
బంక నేలల్లో ఆఖరి దమ్ము చేసి, చదును చేసిన మరుసటి రోజు విత్తుకోవచ్చు. విత్తే సమయానికి మీరు లేకుండా దురదగా ఉంటే చాలు ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో విత్తలనుకొన్న రోజే ఆకరి దమ్ము చేసి, విత్తనాలను వెదజల్లి గానీ, డ్రమ్ సీడర్‌తో గాని విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం:
ఈ రెండు పద్ధతులలో కూడా సాధారణ పద్ధతిలో సిఫారసు చేసినా మోతాదు సరిపోతుంది. కాకపోతే దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం పూర్తి భాస్వరం ఎరువు మరియు పొటాష్ ఎరువును సగం మాత్రమే వేయాలి. దమ్ములో కానీ విత్ వేట్ అప్పుడు కానీ నత్రజనిని వేస్తే కలుపు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ సమయంలో నత్రజని ఎరువులు వేయకూడదు. నత్రజని ఎరువును మూడు భాగాలుగా చేసి మొదటి భాగంను విత్తిన 15 నుండి 20 రోజులకి, రెండవ భాగంను విత్తిన 40`45 రోజులకు, మూడవ భాగంను విత్తిన 60`65 రోజులకు మరియు మిగిలిన సగభాగం పోటాష్ ఎరువును కలిపి వేయాలి.
కలుపు యాజమాన్యం:
ఎకరాకు టైటి లాక్లోర్‌సఫెనర్ మందును 600-800 మి. లీ. విత్తిన 3-5 రోజుల లోపు లేదా పైరజోసల్ఫ్యూరాన్ ఈథైల్ 80-100 గ్రా. లేదా బ్యుటాక్లోర్ 1.5 లీ. లేదా ప్రిటిలాక్లోర్ 500 మి. లీ.లేదా అక్పాడయార్జిల్ మందును 35-45 గ్రా. 8-10 రోజులలో ఇసుకలో కలిపి చల్లాలి. ఎకరాకి సైహాలోపాప్ పి బ్యూటైల్ 250-300 మి.లీ.(ఊద మరియు ఒడిపిలి) లేదా ఫినాక్సీ ప్రాప్ పి ఈథైల్ 250-300 మి.లీ. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదా 21 రోజులకీ బిస్పైరిబాక్ సోడియం అనే కలుపు మందు ని 100 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి. బిస్పైరిబాక్ సోడియం వెడల్పకు గడ్డి జాతిని కూడా అరికట్టును. కేవలం వెడల్పకు కలుపు నివారణకు 2, 4డి సోడియం సాల్ట్ 600 గ్రా. విత్తిన 25-30 రోజులకు పిచికారి చేయాలి. పంట దశను మరియు కలుపు రకాన్ని బట్టి కలుపు మందులను ఎంచుకోవాలి.
నీటి యాజమాన్యం:
విత్తిన తరువాత మొదట్లో నీరు లేకుండా బురదగా మాత్రమే ఉంచాలి. నీరు నిల్వ ఉన్న చోట మొలక రాదు. ఆ తర్వాత పలుచగా నీరు 2 ` 3 సెంటీమీటర్లు పిలకలు తొడిగే దశవరకు ఉంచితే సరిపోతుంది. పైరు పొట్ట దశ నుండి పంట కోసే 10 రోజుల వరకు నాటువేసిన పొలం మాదిరిగానే నీటి యాజమాన్యం పాటించాలి.
డా. ఆర్. శ్రీనివాసరావు, ఎమ్. సుమన్, ఎస్. వింద్య, డా. వి. లక్ష్మీనారాయణమ్మ, బి. శివ, డా. ఆర్. విశ్వతేజ్, కె. శ్రావణి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
కృషీివిజ్ఞాన కేంద్రం- భద్రాద్రి కొత్తగూడెం.
Also Read: Trichoderma: నేలకు ఆరోగ్య సంజీవని` ట్రైకోడెర్మా.!