Organic Certification: వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంతో పెట్టుబడులు పెరిగి రైతుకు సాగు గిట్టుబాటు కావడంలేదు. విచ్చలవిడిగా వీటిని వాడటంవల్ల ఉత్పత్తుల్లో రసాయనాల అవశేషాలు మిగి లిపోతున్నాయి. వీటిని ఆహారంగా తీసుకున్నవారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాతావరణం కూడా కలుషితమవుతోంది. పురుగుమందులు అవశేషాలతో పలు ఉత్పత్తులు ఎగుమతికి పనికిరాకుండా తిరస్కారానికి గుర వుతున్నాయి. ఈ సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల సేంద్రియ వ్యవసా యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తు న్నాయి. ఇప్పటికే కొందరు రైతులు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబ డులు సాధిస్తూ లాభదాయకంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు.
నేలకు సేంద్రియ పదార్థాలను అందించి అధిక దిగుబడితోపాటు నాణ్యమైన ఉత్పత్తులను పొందటమే సేంద్రియ వ్యవసాయం. ఈ విధానంలో వ్యవ పాయ వ్యర్థాలు, పశువుల ఎరువు, జీవాలపెంట, పచ్చిరొట్ట, జీవన ఎరువుల్ని వాడుతారు. సస్యరక్షణలో వృక్షసంబంధిత క్రిమిసంహారకాలు, జీవనియంత్రణ, లింగాకర్షక ఎరలతో చీడపీడల్ని నియంత్రిస్తూ ఎలాంటి రసాయనాలు వాడు కుండా పంటలు పండిస్తారు.
సేంద్రియ సాగులో: నేలకోతను తగ్గించే సాగువిధానాలు పాటించాలి. పంటలతో పాటు పాడి -పశువుల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలి. వ్యవసాయ వ్యర్ధాలను సేంద్రియ ఎరువుగా మార్చి పంటలకు వాడాలి. అంతరకృషి జరిపి కలుపునేలలో కలి సేలా చూడాలి. వర్మికంపోస్టు, జీవన, పచ్చిరొట్ట ఎరువుల వాడకానికి ప్రాధా న్యమివ్వాలి. పంటలసాగులో మల్చింగ్ విధానం, సక్రమ నీటి యజమాన్యం పాటించాలి. సస్యరక్షణలో వృక్ష, జంతుసంబంధ రసాయనాలు వాడాలి. జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి. సహజ వనరులు సద్వినియోగం చేసుకో వాలి. ధృవీకరణ వ్యవస్థ అపెడా ద్వారా గుర్తింపు పొందినదైతే ఎగుమతు లకు సానుకూలత ఉంటుంది.
Also Read: Coconut Milk For Hair: కొబ్బరి పాలతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం!
సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ: సేంద్రియ వ్యవసాయాన్ని ఆస్ట్రేలియా, బ్రెజిల్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా చేస్తున్నారు. భారతప్రభుత్వ వ్యవసాయశాఖ 2005లో జాతీయ సేంద్రియ ఉత్పత్తుల పథకం ప్రవేశపెట్టింది. మనదేశంలో బాసు మతి బియ్యం, పప్పుధాన్యాలు, నూనెగింజలు, సుగంధద్రవ్యాలు, పండ్లు, కూ రగాయలు, చెరకు, తేయాకు వంటి పైరు కొంతమేర సేంద్రియ విధానంలో సాగుచేస్తున్నారు. ఈ ఉత్పత్తులను ధృవీకరిస్తేనే వాటి ఎగుమతికి అనుమ తిస్తారు. రసాయనాల వాడకం వల్ల వ్యవసాయంలో కలిగే నష్టాలను గుర్తిం చిన సిక్కిం రాష్ట్రం సేంద్రియ ఉత్సవం పేరుతో సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో సేంద్రియ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు గతేడాది ఫిబ్రవరిలో సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణకు అనుమతిస్తూ తెలంగాణా రాష్ట్ర సేంద్రియ ధృవీకరణ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగు బంగా పంట ఉత్పత్తులను ధృవీకరిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో పండించిన ఉత్పత్తులైనా ఈ సంస్థకు ధృవీకరించే అధికారం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరకోస్తా, తూర్పుగోదావరి, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా లోని గిరిజన ప్రాంతాల్లో ఎరువులు, పురుగుమందులు వాడకుండానే రైతులు సేద్యం చేస్తున్నారు. గనుక ఈ ప్రాంతాల్లో సేంద్రియ సేద్యానికి మంచి అవకాశాలున్నాయి.
ధృవీకరించే పంటలు: పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలు, ఆహారధాన్యాల వంటి వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు, ఔషధ మొక్కలు, తేనె వంటి అటవీసంపద, జీవన ఎరువులు వగైరా సేంద్రియ ఉత్పాదకాలను ధృవీకరించే సేవల్ని తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధృవీకరణ సంస్థ అందిస్తుంది.
Also Read: Organic Manure from Cotton Plant: పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ.!
Also Watch: