Bio Products: దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుపోయింది. సాగు నష్టాలతో ఏటా వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు గిట్టుబాటు ధరలు దక్కక రైతులు అప్పుల పాలవుతున్నారు. అప్పులు తీర్చే మార్గం కానరాక ఏటా దేశంలో వేలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషాదాలు వ్యవసాయ కీలక శాస్త్రవేత్త సంగీతా సవాలాఖేను కదలించి వేశాయి. పురుగు మందులు, ఎరువులతో పనిలేని బయో ప్రత్యామ్నాయాలను ఆవిష్కరించి రైతుకు అండగా నిలిచింది.
చీడపీడలకు చెక్ పెట్టే బయో ఉత్పత్తులు
పంటల్లో చీడపీడలు తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. పత్తిలో రసంపీల్చే పురుగు నివారణకు రైతులు ఏటా భారీగా పురుగు మందులు పిచికారి చేస్తూ ఉంటారు. రసంపీల్చే పురుగుల నివారణకు ఏటా రైతులు కనీసం ఏడుసార్లు రసాయనాలు పిచికారి చేస్తున్నారని ఓ అంచనా.
విచ్చలవిడిగా రసాయనాల పిచికారీతో పురుగులు కూడా తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీంతో రైతులు పురుగు మందులు డోస్ పెంచి పిచికారి చేయాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా బయో పెస్టిసైడ్‌లను ఉపయోగించడం వల్ల ఉపయోగం ఉంటుందని ముందు సంగీత నమ్మలేకోయారు. చివరి ప్రయత్నంగా బయో పెస్టిసైడ్స్ ఉపయోగించి సత్పలితాలు సాధించారు.
దిగుబడులు కూడా పెరిగాయి
మొదటిసారి తన పంటలో సంగీత 20 శాతం మాత్రమే బయో పెస్టిసైడ్స్ ఉపయోగించారు. మంచి ఫలితాలు వచ్చాయి. దిగుబడులు కూడా 30 శాతం పెరగడం ఆమె గమనించారు. అనూజ అనే రైతు తన 12.5 ఎకరాల పత్తి, సోయా, మల్బరీ పంటల్లో బయో పెస్టిసైడ్స్ ఉపయోగించి అధిక దిగుబడులు సాధించినట్టు శాస్త్రవేత్త సంగీత తెలిపారు.
Also Read: Vegetable Price Control Measures: కూరగాయల ధరలకు ఇలా కళ్లెం వేయవచ్చు.!
తెగుళ్లను తినేస్తాయి
సహజంగా పంటలను పురుగులు తింటూ ఉంటాయి. కానీ బయో పెస్టిసైడ్స్ లోని సూక్ష్మజీవులు పంటల్లోని తెగుళ్లను తినేస్తాయి. దీంతో పురుగులు, తెగుళ్లకు కారణమైన చీడలు రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం కూడా లేదు. బయో పెస్టిసైడ్స్ పంటల్లో దిగుబడిని పెంచడమే కాదు కూలీ ఖర్చులు, సాగు ఖర్చులు ఎకరాకు రూ.10వేలు తగ్గించాయని పరిశోధనల్లో తేలింది. రసాయన పురుగు మందులు పిచికారీ చేసిన కూలీలు, రైతులు అనేక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బయో పెస్టిసైడ్స్ తో ఆ సమస్యకు కూడా పరిష్కారం లభించిందని సంగీత తెలిపారు.
రైతులు సేంద్రియ సాగుకు మొగ్గుచూపుతున్నారు
గత మూడు దశాబ్దాలుగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లో రసాయనాలతో సాగు చేసిన వేలాది రైతులు ప్రస్తుతం బయో పెస్టిసైడ్స్ వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. బయో ఎరువుల వాడకం తో సేంద్రీయ వ్యవసాయానికి మారడం వారి పంటలకు కూడా మంచి ధర దక్కుతోంది. 1992లో సంగీత అగ్రికల్చర్ ఎంటమాలజీ లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు రైతు ఆత్మహత్యలు ఆమెను కలచివేశాయి.
రైతులు రసాయన ఎరువులు మరియు పురుగు మందుల కొనుగోలు కోసం వారు చాలా ఖర్చు చేస్తున్నారని సంగీత తెలుసుకుంది. పంట నష్టాలతో ఒక్కసారి రైతు అప్పుల్లో కూరుకు పోతే బయట పడటం అసాధ్యంగా మారిందని అందుకు ప్రత్యామ్నాయంగా ఖర్చులేని బయో పెస్టిసైడ్స్ ను సంగీత అభివృద్ధి పరిచారు. నేడు దేశ వ్యాప్తంగా లక్షలాది రైతులు ఆమె తయారు అభివృద్ధి పరచిన బయో పెస్టిసైడ్స్ ఉపయోగిస్తూ సేంద్రియ ఉత్పత్తులను అందిస్తున్నారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గడంతోపాటు, వారి పంటలకు కూడా అధిక ధర లభించడంతో రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గాయని సంగీత సంతోషంగా చెబుతున్నారు.
Also Read: Nano Tractor: వ్యవసాయ పనులను సులభతరం చేస్తున్న నానో ట్రాక్టర్.!